breaking news
ma telugu thalli
-
ఘనంగా శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాషా సంస్థ అధ్యక్షులు పి. విజయబాబుగారు, సభ్యులు జి .రామచంద్రారెడ్డి గారు శంకరంబాడి సుందరాచారి గారి చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు విజయబాబుగారు మాట్లాడుతూ.. శంకరంబాడి సుందరాచారిగారు “ మా తెలుగు తల్లికి మల్లె పూదండ “ గీతంలో రాష్ట్రం నలుమూలలా ఉన్న విశేషాలను పొందుపరచి రాష్ట్ర వైభవాన్ని చాటారని, అంతేకాకుండా ఆధునిక ఆంధ్ర కవులలో అగ్రశ్రేణిలో నిలిచే శంకరంబాడి బుద్ధ గీత, అగ్నిపరీక్ష, గీతాంజలి వంటి రచనలతో పాటు సుందరభారతం, సుందర వాల్మీకి రామాయణము వంటి గొప్ప రచనలు అందించిన మహాకవి అనీ. తెలుగు జాతికి తేటగీతులలో అందించిన మధుర కవి అన్నారు. నటుడిగాను పత్రికారంగంలో ఉపసంపాదకుడిగా, సినీ గీత రచయితగా, అధ్యాపకుడిగా, వివిధ రంగాల్లో తన ప్రతిభాభాటలని పేర్కొన్నారు. శంకరంబాడి గారి నిరాడంబరత, ముక్కుసూటి తత్వం గురుంచి రామ చంద్రారెడ్డి గారు వివరించారు. శ్రీవారి భక్తులైన వీరు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమల తిరుపతిలో జీవించారు. ప్రముఖులైన జ్ఞానపిఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ, రాళ్లపల్లి రాయప్రోలు, పుట్టపర్తి వంటి ప్రముఖలైన కవుల ప్రశంసలు అందుకున్నారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో వీరి రచనలకు తగిన ప్రోత్సాహం లభించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్త, రచయిత్రి శృంగేరి శారద గారు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహార్లాల్ నెహ్రూ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వంటి ప్రముఖల సమక్షాన కవితలను వినిపించి ప్రశంసలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శంకరంబాడి సుందరాచారి అని కొనియాడారు. (చదవండి: అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు) -
రాష్ట్ర గేయం లేకుండానే పాఠ్య పుస్తకాల ముద్రణ!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 నెలలైనా ఖరారు చేయని ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్రం లో వచ్చే విద్యా సంవత్సరంలో (2015-16) విద్యార్థులకు ఇవ్వనున్న పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గేయం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్ర గేయాన్ని ఖరారు చేయకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే 61 లక్షలమంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు 2.5 కోట్ల పుస్తకాలు అవసరం. ఇందులో తెలుగు పాఠ్య పుస్తకాలు 61 లక్షలు ఉంటాయి. విద్యాశాఖ రాష్ట్ర గేయం లేకుండానే పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు చేసింది. ‘మా తెలుగుతల్లికి’ తొలగింపు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు పాఠ్య పుస్తకాల్లో జాతీయ గీతంతోపాటు రాష్ట్ర గేయంగా పెట్టిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ గేయాన్ని తెలుగు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర గేయం వివిధ గేయాలను పరిశీలించారు. అంద్శైరాసిన ‘జయజయహే తెలంగాణ జననీ జనకేతనం..’ గేయాన్ని రాష్ట్ర గేయంగా చేస్తే బాగుంటుందని భావించారు. సీఎం కేసీఆర్ కూడా ఆ గేయానికి కొన్ని మార్పులు చేస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడలేదు. విద్యాశాఖ రాష్ట్ర గేయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం పరిశీలనలోనే ఉందన్న సమాధానం రావడంతో మిన్నకుండిపోయారు. పుస్తకాల ముద్రణ ప్రారంభించాల్సి రావడంతో ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయాన్ని తొలగించి ముద్రణ ప్రారంభించినట్లు తెలిసింది.