breaking news
ma examinations
-
శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితునికి ఎంఏ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తీహార్ జైలు నుంచి ఎంఏ పరీక్షలు రాయనున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 20న కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి ఢిల్లీ న్యాయస్థానం అతనికి మినహాయింపునిచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాల నమోదు కోసం కోర్టు జూలై 20 నుండి 25 వరకు రోజువారీ విచారణను గత మే నెలలో ఖరారు చేసింది.అయితే జూలై 20 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తనకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంఏ సోషియాలజీ చివరి పరీక్ష ఉందని, అందుకే ఆ రోజు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఆఫ్తాబ్ కోర్టును కోరారు. తీహార్‌లోని సెంట్రల్ జైలు నంబర్ 3లో జూలై 11 నుండి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి.ఈ కేసును విచారిస్తున్న సెషన్స్ న్యాయమూర్తి హర్గురువరిందర్ సింగ్ జగ్గీ.. జూలై 20న విచారణను వాయిదా వేస్తూ, జూలై 21 మధ్యాహ్నం 2 గంటల నుండి తిరిగి సాక్ష్యాల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. కోర్టు ముందుగా నిర్ణయించిన మిగిలిన తేదీల విచారణ యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎనిమిది మంది సాక్షులను విచారించాల్సి ఉందని ప్రాసిక్యూషన్ తెలిపింది. 13 మంది సాక్షుల వాంగ్మూలాలను పాక్షికంగా నమోదు చేయగా, 12 మంది సాక్షుల విచారణ వాయిదా పడింది.లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తన భాగస్వామి శ్రద్ధా వాకర్ (27)ను ఆఫ్తాబ్ అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 2023లో ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా తాను నిర్దోషినని ఆఫ్తాబ్ కోర్టులో వాదించారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు విద్యను అభ్యసించే అవకాశం ఉండటంతో కోర్టు ఈ మినహాయింపునిచ్చింది. -
ఇందులో తక్కువ కులం ఏది? ప్రశ్నాపత్రంపై తీవ్ర దుమారం
చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్మెంట్ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R — ANI (@ANI) July 15, 2022 అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? -
ఇంటికి వెళ్లగానే దీపా కర్మాకర్ ఏం చేసింది?
రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం శాయశక్తులా కృషి చేసి, వెంట్రుక వాసిలో అదృష్టాన్ని మిస్సయిన దీపా కర్మాకర్.. ఇంటికి రాగానే పుస్తకాలు తీసింది. ఇంటికి వచ్చిన మర్నాటి నుంచే ఆమెకు ఎంఏ పరీక్షలు ఉన్నాయి. త్రిపుర యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ద్వారా ఆమె ఎంఏ రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరైంది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తనకు త్వరలోనే వస్తుందని ఆమె గట్టి నమ్మకంతో చెప్పింది. ఒకవైపు క్రీడాంశాలపై అపారమైన ఆసక్తి చూపుతూనే, చదువు మీద కూడా ఇంత శ్రద్ధ పెట్టడం అద్భుతమని త్రిపుర యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. సాధారణంగా క్రీడాకారులు చదువును పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో వీలైనప్పుడు పరీక్షలు రాస్తారు. కానీ, దీప మాత్రం అలా కాకుండా అకుంఠిత దీక్షతో రియో నుంచి వచ్చిన మర్నాడే పరీక్షలకు హాజరైంది.. బాగా రాసింది కూడానట. పరీక్షలు తప్పించుకోడానికి వంకలు వెతికే పిల్లలు ఆమెను చూసి నేర్చుకోవాలని అధ్యాపకులు అంటున్ నారు. జిమ్నాస్టిక్స్ కోచింగ్, ప్రాక్టీసుకు చాలా సమయం పడుతుందని, అయినా దీప మాత్రం ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. చివరకు రియోకు వెళ్లేటప్పుడు కూడా ఆమె పుస్తకాలు తీసుకెళ్లిందట. మధ్యలో ఖాళీ దొరికితే చదువుకుందామని అలా తీసుకెళ్లిందని ఆమె తల్లి గౌరి చెప్పారు. మన దేశంలో చదువా.. ఆటలా అని ఏదో ఒకటి ఎంచుకోమంటారని, కానీ రెండూ ఒకేసారి చేయొచ్చని దీపా కర్మాకర్ నిరూపించిందని ఆమెతో పాటు పరీక్షకు హాజరైన యువకుడు చెప్పాడు.


