breaking news
LS Speaker Sumitra Mahajan
-
నేను పోటీచేయను: స్పీకర్ సుమిత్రా
న్యూఢిల్లీ/ఇండోర్: తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రస్తుత లోక్సభ స్పీకర్, సీనియర్ బీజేపీ నేత సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశానని శుక్రవారం ఇండోర్లో ఆమె మీడియాతో చెప్పారు. ‘ఏప్రిల్ 12వ తేదీకి సుమిత్రకు 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన వారికి బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సుమిత్ర నిర్ణయంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. సుమిత్రా మహాజన్ లోక్సభకు 8సార్లు ఎంపీగా గెలుపొందారు. తొలిసారిగా 1989లో ఇండోర్ నుంచి గెలిచారు. వాజపేయి ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ, టెలికాం శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. -
ప్రియాంకతో కలిసి సుమిత్ర ఇంటికి సోనియా..
న్యూఢిల్లీ: మరో పది రోజుల్లో పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇంటికి విశిష్ట అతిథి వేంచేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. సోమవారం రాత్రి స్పీకర్ అధికార నివాసం లెటర్స్ రెసిడెంట్ కు వెళ్లి సుమిత్రా మహాజన్ ను కలుసుకున్నారు. సోనియా వెంట ఆమె కూతురు ప్రియాంకా వాద్రా రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని లెటర్స్ రెసిడెన్స్ వర్గాలు ప్రకటించాయి. నవంబర్ 26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభకానుండటంతో స్పీకర్ తో సోనియా గాంధీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై ఫిర్యాదు చేసేందుకు సోనియా.. ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన సంగతి తెలిసిందే. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం ఒక్కరోజు కూడా సభజరగనీయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ ఈ సారి మరిన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దాద్రి ఘటన, రచయితలు, శాస్త్రవేత్తలు, సినీ దిగ్గజాల అవార్డు వాపసీలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.