breaking news
LS polls
-
2024 LS polls: సగానికిపైగా ఓట్లు మనకే పడాలి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ పార్టీ పదాదికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి మరిన్ని ఓట్లను ఒడిసిపట్టాలని పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్టీ జాతీయ పథాధికారుల సమావేశం ఇందుకు వేదికైంది. రెండురోజులపాటు సాగిన ఈ సమావేశం శనివారం ముగిసింది. నేషనల్ ఆఫీస్ బేరర్స్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర సంస్థాగత విభాగాల సారథులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చకొచి్చన ఇతరత్రా అంశాలను విశ్వసనీయ వర్గాలు శనివారం వెల్లడించాయి. ‘‘త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమరంలో సగానికిపైగా ఓట్లు బీజేపీకే దఖలుపడాల్సిందే. పోలింగ్‌లో పార్టీ ఓటు షేర్ కనీసం 10 శాతమైనా పెరగాల్సిందే. 2019లో బీజేపీ 37శాతానికిపైగా ఓటు షేరు సాధించింది. ఎన్డీఏ కూటమి దాదాపు 45 శాతం ఓటుషేరు సాధించింది. 2014 నుంచి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు ఒక్క బీజేపీకే పడ్డాయి. దృఢ కార్యదీక్షతో ఎన్నికల క్షేత్రంలో అవిశ్రాంతంగా పనిచేయండి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అంతకుమించిన చోట్ల మన పార్టీ విజయభేరీ మోగించాలి. ఆ బాధ్యత మీదే. జనం మెచి్చన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చొచ్చుకుపొండి. తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేసే విపక్ష పారీ్టల ఆటకట్టించండి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసిన ప్రాజెక్టులు, పనులు, వాస్తవ గణాంకాలతో ప్రజలకు నిజానిజాలకు తెలియజెప్పండి’’ అని బీజేపీ నేతలకు మోదీ సూచించారు. నాలుగు ‘కులాలను’ కలుపుకొని పొండి ‘దేశంలో నాలుగే కులాలున్నాయి. మహిళలు, యువత, రైతులు, పేదలు. ప్రచారంలో భాగంగా ఈ నాలుగు కులాలను కలిసి వారి కష్టాలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయతి్నంచండి. అద్భుత ఫలితాలు, ప్రజాదరణ పొందిన కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లండి’ అని మోదీ సూచించారు. కేంద్రంలో బీజేపీ హయాంలో అమలవుతున్న కేంద్ర పథకాలు, వాటి లబ్ధిదారుల విజయగాథలను తెల్సుకుంటూ, ప్రజల్లో పథకాల అవగాహన పెంచుతూ ముందుకు సాగుతున్న ‘ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను మరింతగా విజయవంతంగా చేయడంపైనా సమావేశంలో నేతలు చర్చించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగబోయే అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి వేడుకలను మరింత బాగా నిర్వహించడం, తదితరాలూ సమావేశంలో చర్చకొచ్చాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో నమోదైన విజయం.. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విజయానికి శుభసూచకమని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారని వార్తలొచ్చాయి. బూత్ కమిటీలను పటిష్టవంతంచేస్తేనే ఎక్కువ మంది ఓటర్లను మనం చేరుకోగలమని నేతలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ‘‘మూడు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాం. ఇక సార్వత్రిక సమరంలోనూ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం’’ అని నేతల ముందు మోదీ విశ్వాసం వ్యక్తంచేశారని తెలుస్తోంది. ‘‘మన ప్రదర్శన చూసి విపక్షాలు కంగుతినాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారట. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ఘన విజయంపై ఆ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు పార్టీని పొగుడుతూ ప్రసంగించారు. వచ్చే నెలలో అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవం సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టకి బాగా కలిసొస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. -
పొత్తు... కసరత్తు
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ పొత్తులపై కసరుత్తులు చేస్తుండగా అన్నాడీఎంకే, బీజేపీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 2వ తేదీన కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పొత్తుపై అధికారిక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎత్తులు, జిత్తులతో పాటూ పొత్తుల కోసం పాకులాట మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే పొత్తు దాదాపు ఖరారైపోయిం ది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాం ధీ నేతృత్వంలో ఇటీవల జరిగిన తమిళ కాంగ్రెస్ సమావేశంలో సైతం మాజీ మిత్రుడైన కరుణానిధితో చెలిమికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. డీఎండీకే సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ సహజంగానే ఏ విషయం తేల్చడం లే దు. వచ్చేనెల కాంచీపురంలో నిర్వహిం చేబోయే పార్టీ మహానాడులో విజయకాంత్ ఓ ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే అన్నాడీఎంకేను ఓ డించడమే లక్ష్యంగా విజయకాంత్ చెబుతుండడంతో అదే లక్ష్యంతో ఉన్న కూట మిలోనే చేరుతారని భావించవచ్చు. పరస్పర సహకారం ఇదిలా ఉండగా, అధికార అన్నాడీఎంకే వైఖరిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న అమ్మపార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంతటి హవాను కోల్పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు ఓ తోడు అవసరమైంది. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో అనేక ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన బీజేపీ కూటమి చెల్లాచెదురైంది. పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే పార్టీలన్నీ వేర్వేరుదారుల్లో ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి సైతం అన్నాడీఎంకేతో పొత్తు అనివార్యమైంది. రాష్ట్రంలో బలమైన కూటమి కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం గట్టిప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే కూటమికి పార్టీలతో చర్చలు సాగించే బాధ్యతను కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై తదితరులకు బీజేపీ పెద్దలు అప్పగించా రు. ముఖ్యంగా అన్నాడీఎంకేని ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రమంత్రులు ప్రకాశ్‌జవదేకర్, పియూష్ గోయల్‌లను సైతం బీజేపీ రంగంలోకి దించింది. బీజేపీ పెద్దలంతా ఇప్పటికే రహస్య చర్చలను ప్రారంభించారు. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై రెండు పార్టీల్లో రసవత్తరమైన రహస్య చర్చలు సాగుతున్నాయి. మోదీతో ముహూర్తం: రాష్ట్రంలో బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ వచ్చేనెల 2వ తేదీన కోయంబత్తూరుకు వస్తున్నారు. ఉదయం ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోదీ వచ్చేలోగా పొత్తులను ఖరారు చేసుకోవాలని రాష్ట్ర నేతలు పరుగులు తీస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తు ఖారైన పక్షంలో మోదీ సభలో రాష్ట్ర మంత్రులంతా పాల్గొంటారని ఆశిస్తున్నారు. ఇటీవల అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న తీరు అన్నాడీఎంకే, బీజేపీల స్నేహాన్ని పరోక్షంగా చాటిచెప్పింది. కాగా, వేదికపై నుండి మోదీ ప్రకటించడమే తరువాయిగా విశ్వసిస్తున్నారు. -
కలిసి ఉంటే కలదు కుర్చీ
-
బీహార్‌లో కాంగ్రెస్‌కు షాక్
-
కాంగ్రెస్ మేధోమథనానికి సీఎం కిరణ్