@Love Movie
-
ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!
ఒక గ్రామంలోని రచ్చబండ వద్ద ఓ ఆధ్యాత్మికవేత్త ప్రవచనం చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగా ‘‘ఈ సృష్టిలోని విషయాలు మనకి అంత సులభంగా అర్థం కావు. ఈ సృష్టిలో అన్నీ విలువైనవే. ప్రతి ఒక్కటీ ఏదో ఒక కారణంగా సృష్టింపబడుతుంది. మనకి ఉపయోగపడదని, మనకి తెలియదని దేన్నీ వృథాగా భావించ కూడదు’’ అని చెప్పాడు.అప్పుడే ఒక పశువుల కాపరి అడవినుంచి జీవాలను ఇంటికి తోలుకుని వెళ్తున్నాడు. ఆధ్యాత్మికవేత్త ఉపన్యాసం విని కొద్దిసేపు ఆగి ‘‘ఈ మేక మెడ దగ్గర రెండు లింగాలు ఉన్నాయి. ఇవి దేనికి పనికి వస్తాయి. తోలుకూ మాంసానికీ రెండిటికీ పనికి రానివి కదా ఇవి’’ అని నిష్టూరంగా అడిగాడు.చిరునవ్వు నవ్విన ఆధ్యాత్మికవేత్త ‘‘సృష్టి రహస్యాలు కనుక్కోవడం కష్టం. అవి ఎందుకు సృష్టింప బడ్డాయో మనకు తెలియకపోవచ్చు. నీకు బాగా అర్థమయ్యేట్లు నేను విన్న ఒక పాత కథ చెబుతాను విను.పూర్వం ఒక ఋషి ఉండేవాడు. అతడి తపశ్శక్తి వల్ల అతడికి కొన్ని శక్తులు వచ్చాయి. తను ఏది కోరుకుంటే అది జరిగేది. ఆ ఋషి ఒకరోజున నదీ స్నానం చేసి లేస్తున్నప్పుడు తన ముక్కు వెంట్రుకలు దట్టంగా పెరగడం గమనించాడు. కొంచెం అసౌకర్యంగా భావించాడు. ‘దేనికి పనికివస్తాయి ఇవి? ఇవి లేకుంటే మాత్రం నేను జీవించలేనా’ అని భావించి అవన్నీ రాలిపోయేట్లు కోరుకున్నాడు. అతడు కోరినట్లే జరిగింది. అది జరిగిన కొద్దిసేపటికే ఉచ్చ్వాసనిశ్వాసలు తీసుకోవడం కష్టమయ్యింది. రోజురోజుకీ ఆ ఋషి ఆరోగ్యం క్షీణించి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. చిన్న వెంట్రుకలైనా దాని విలువ దానికి ఉందని గుర్తించకపోవడం వల్ల జరిగిన అనర్థం అది.కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదీ ఏదో ఒక కార్య నిమిత్తం సృష్టింపబడిందే. కాకుంటే మనం వాటి ప్రయోజ నాలన్నిటినీ గుర్తించలేము. మనకు, మన ఆలోచనలకూ పరిమితులు ఉన్నాయి. కాబట్టి సృష్టి మర్మాలను మనం గౌరవించక తప్పదు’’ అని వివరించాడు.‘అది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు అలా ఉండకూడదు అని ఆలోచించి లాభం లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించడం ఉత్తమం’ అని గ్రహించిన పశువుల కాపరి జీవాలను తోలుకుని ఇంటివైపు నడిచాడు. – ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
@Love Movie Review: ‘@లవ్’ రివ్యూ
టైటిల్ : @లవ్ నటీనటులు: అభి, సోనాక్షి, రామరాజు తదితరులు నిర్మాణ సంస్థలు: టిఎమ్మెస్, ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ ఎస్ఎన్ క్రియేషన్స్ నిర్మాతలు: మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ దర్శకత్వం : శ్రీ నారాయణ సంగీతం: సన్నీ మాలిక్ స్క్రీన్ ప్లే: శ్రీ నారాయణ సినిమాటోగ్రఫీ: మహి ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదలతేది: డిసెంబర్ 9, 2022 కథేంటంటే.. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథగా మొదలవుతుంది ఈ చిత్ర కథ. ఎమ్మెల్యే శర్మ (రామరాజు) తన కూతురు విందు, రామ్ అనే గిరిజన యువకుడిని ప్రేమించిందని తెలిసి.. ఎలాగైనా ఆ ప్రేమను చెడగొట్టాలని ఆ గిరిజన ప్రాంతానికి బయలు దేరతాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శర్మకి ఓ గిరిజన పెద్దాయన పరిచయం అవుతాడు. ఆయన ఎప్పుడో గతంలో తమ ప్రాంతంలో జరిగిన చంద్ర- మాలచ్చిమి అనే జంట తాలూకు ప్రేమ కథ చెబుతాడు. నిజమైన ప్రేమకు ప్రతిరూపం లాంటి ఆ ప్రేమ కథ విన్న తర్వాత శర్మ లో ఎలాంటి మార్పు వచ్చింది?, చివరకు శర్మ తన కూతురు ప్రేమను అంగీకరించాడా?, లేదా ? అసలు అప్పటి జంట ప్రేమ కథ కు - నేటి జంట ప్రేమ కథకు మధ్య కనెక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ. ఎలా ఉందంటే.. '@లవ్'.. సున్నితమైన భావోద్వేగాలతో మడిపడిన ఉన్న ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ. సినిమా చూస్తున్నంత సేపు అందమైన అడవి మధ్యలోకి వెళ్లి అక్కడి పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో ప్రేమ, మరియు కులం, ప్రాంతం, జాతి వంటి సున్నితమైన అంశాలను, వాటి వల్ల ఆడవాళ్ళు పడుతున్న ఇబ్బందలను చూపించటం చాలా బాగుంది. నేటి సమాజంలో కొంతమంది కుల మత పిచ్చితో ఎంత మూర్ఖంగా ఉంటారో అని కొన్ని కఠినమైన వాస్తవాల ఆధారంగా కొన్ని సంఘటనలను చాలా వాస్తవికంగా చూపించడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. ఫీల్, ఎమోషన్, ఆడవాళ్ళ కి సంబంధించిన సోషల్ మెసేజ్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. వీటితో పాటు శ్రీ నారాయణ టేకింగ్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది. ఈ సినిమాలోని నటీనటులంతా కొత్తవారైనా..చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సన్నీ మాలిక్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి అందాలను చక్కడా చూపించారు. శివ.కె మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాతలు మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఈ '@లవ్' చిత్రం భావేద్వేగమైన ప్రేమ కథలతో, సున్నితమైన భావోద్వేగాలతో మెప్పిస్తుంది. -
వినూత్న చిత్రం '@లవ్' ..ప్రతి పాత్రకు ఓ కథ ఉంటుంది
రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సుందర్ ముఖ్య తారలుగా, శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ ‘ 2లవ్’. టిఎమ్మెస్, ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ ఎస్ఎన్ క్రియేషన్స్ బేనర్స్ పై మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీనారాయణ మాట్లాడుతూ– ‘‘గిరిజనుల నేపథ్యంలో తెరకెక్కిన స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రం. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఓ కథ ఉంటుంది. ప్రతి ఎమోషన్ కథను నడిపిస్తుంటుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు జర్నీఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది’అన్నారు. -
ట్రైబల్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా '@లవ్'
డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. హీరోతో సంబంధం లేకుండా కథలో దమ్ముంటే చాలు.. ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు '@లవ్' అనే సినిమా కూడా అలాంటి కోవకు చెందింన సినిమానే అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో కంటెంట్ చాలా వైవిధ్యంగా ఉందని.. మరో వినూత్న సినిమాగా నిలుస్తోందని తెలుస్తోంది. శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఫస్ట్ లుక్ ను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని..నాగ్ అశ్విన్ చెప్పారు. మంచి సినిమా రావడం లేదు అని బాధ పడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే సినిమా ఇది అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు శ్రీ నారాయణ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ట్రైబల్ బ్యాక్‌డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని పంచుతుందట. ఇక ఈ చిత్రాన్ని టీఎమ్ఎస్(TMS) బ్యానర్ తో ప్రీతమ్ ఆర్ట్స్ &ఎస్ఎన్(SN) క్రియేషన్స్ సంయుక్తంగా మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మించారు. డిసెంబర్లో ఈ @లవ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.