breaking news
Lohri
-
మన భోగి.. వారికి లోహ్రీ.. గమ్మత్తయిన పోలికలివే..
భారతీయ సంస్కృతిలో పండుగలనేవి కేవలం వేడుకలు మాత్రమే కాదు.. అవి ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతాయి. సంక్రాంతికి ముందురోజున ఉత్తరాదిన లోహ్రీ (Lohri) అంబరాన్నంటుతుంటే, దక్షిణాదిన భోగి (Bhogi) మంటలు వెలుగులు పంచుతాయి. ప్రాంతాలు వేరైనా, పేర్లు వేరైనా.. ఈ రెండు పండుగల వెనుక ఉన్న అంతరార్థం ఒక్కటే.. అదే పాతను వదిలి కొత్తను ఆహ్వానించడం! మంచు కురిసే చలి రాత్రులలో నునువెచ్చని మంటల సాక్షిగా సాగే ఈ రెండు ఉత్సవాల మధ్య ఉన్న పోలికలు, వైవిధ్యాలపై ప్రత్యేక కథనం..అగ్ని సాక్షిగా పాతకు వీడ్కోలుభోగి, లోహ్రీ.. ఈ రెండు పండుగల ప్రధాన ఆకర్షణ మంటలు వేయడం. సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి నాడు తెల్లవారుజామున ఇంటి ముందు పాత వస్తువులతో మంటలు వేసి, చలిని తరిమికొడుతూ వెచ్చదనాన్ని పొందుతారు. ఇదే సమయంలో అటు పంజాబ్‌లో లోహ్రీ రోజున చీకటిపడ్డాక భారీ ఎత్తున కట్టెలు పేర్చి మంటలు వేస్తారు. భోగి మంటలు ఇంట్లోని పాతను వదిలించుకునేదానికి సంకేతమైతే, లోహ్రీ మంటలు చలికాలం ముగిసి, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాడనే దానికి సంకేతంగా నిలుస్తుంది.నైవేద్యాల్లో నువ్వులు, బెల్లంఈ రెండు పండుగల్లో ప్రత్యేక ఆహారానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. భోగి రోజున తెలుగు రాష్ట్రాల్లో నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాలను తింటారు. అదేవిధంగా లోహ్రీ నాడు నువ్వులు, బెల్లం, వేరుశనగతో తయారు చేసిన ‘రేవడి’లను ఆనందంగా అందరూ పంచుకుంటారు. ఈ రెండు వంటకాలూ శీతాకాలంలో శరీరానికి అవసరమైన ఉష్ణాన్ని ఇచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కావడం విశేషం.పంట చేతికొచ్చే వేళఈ రెండు పండుగలు కూడా పంట చేతికివచ్చే తరుణాన్ని సూచించేవే.. పంజాబ్‌లో చెరుకు, రబీ పంటలు (గోధుమలు) కోతకు వచ్చే సమయం ఇది. అందుకే అక్కడి రైతులకు లోహ్రీ కొత్త ఆర్థిక సంవత్సరానికి నాంది. ఇటు దక్షిణాదిన పంటలు పండి, ధాన్యపు రాశులు ఇంటికి వచ్చే వేళ జరుపుకునే పండుగ భోగి. ప్రకృతి ప్రసాదించిన ఐశ్వర్యానికి కృతజ్ఞతగా ఇరు ప్రాంతాల్లోనూ ఈ వేడుకలను అత్యంత ఆనందంగా జరుపుకుంటారు.దుల్లా భట్టి వర్సెస్ ఇంద్ర దేవుడుదేశంలో జరిగే ప్రతి పండుగ వెనుక ఒక కథ ఉంటుంది. పంజాబ్‌లో లోహ్రీ అనగానే దుల్లా భట్టి గుర్తుకొస్తాడు. ఆరోజున..పేద అమ్మాయిలను రక్షించి, వారికి పెళ్లిళ్లు చేసిన దుల్లా భట్టి ధైర్యసాహసాలను కీర్తిస్తూ పాటలు పాడతారు. ఇక భోగి రోజున తెలుగువారు వర్షాలకు అధిపతి అయిన ఇంద్ర దేవుడిని పూజిస్తారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పుడమి పచ్చగా ఉండాలని కోరుకుంటూ భోగి వేడుకలు చేసుకుంటారు.ఆటపాటల సందడిసంప్రదాయం ఏదైనా సంతోషమే పరమార్థం. పంజాబీలు లోహ్రీ మంటల చుట్టూ 'గిద్దా', 'భాంగ్రా' నృత్యాలతో హోరెత్తిస్తారు. డప్పుల చప్పుళ్లతో వీధులన్నీ మారుమోగిపోతాయి. మన తెలుగు ఇళ్లలో భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్లు (రేగు పళ్లు, నాణేలు కలిపి) పోసి దిష్టి తీస్తారు. పిల్లల ఆరోగ్యం, క్షేమాన్ని కోరుకుంటూ ఈ వేడుక నిర్వహిస్తారు.ఆత్మీయ అనుబంధాలులోహ్రీ ఉత్సవం ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు, ఇంట్లో పుట్టిన తొలి సంతానానికి ఎంతో ప్రత్యేకమైనది. ఆ రోజున పెద్ద ఎత్తున విందులు ఏర్పాటు చేస్తారు. అదే విధంగా తెలుగు లోగిళ్లలో భోగి రోజున కొత్త అల్లుళ్లను ఇంటికి పిలిచి మర్యాదలు చేయడం, ఆడపిల్లలకు కానుకలు సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. ఈ రెండు పండుగలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను మరింతగా పెంచుతాయి.ఒకవైపు ముగ్గులు.. మరోవైపు గాలిపటాలుభోగి రోజు తెల్లవారుజామున తెలుగు ఇళ్ల ముంగిళ్లు రంగురంగుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో కళకళలాడుతాయి. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో లోహ్రీ సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తారు. రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ పంజాబీలు తమ ఉత్సాహాన్ని చాటుకుంటారు.భిన్నత్వంలో ఏకత్వంమొత్తంగా చూస్తే అటు లోహ్రీ అయినా, ఇటు భోగి అయినా భారతీయుల జీవనశైలిలోని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. చలిని తరిమికొట్టే మంటలు, ప్రకృతికి కృతజ్ఞత తెలిపే వేడుకలు అంతటా కనిపిస్తాయి. మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవాలనే సందేశాన్ని ఈ రెండు పండుగలు అందిస్తాయి.ఇది కూడా చదవండి: పునాదుల్లో భారీగా బంగారం.. విద్యార్థి చొరవతో.. -
లోహ్రీ రోజు దానం చేయాలి : అమితాబ్
సంక్రాంతి పండగ సంబరాలు ఆరంభమయ్యాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ లోహ్రీ (భోగి పండగ) శుభాకాంక్షలు. లోహ్రీ అంటే నాకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. లోహ్రీ రోజు జానపద కళాకారులు ‘లోహ్రీ దా టక్కా దే, రబ్ యానూ బచ్చా దే’ అంటూ పాటలు పాడుకుంటూ ఇంటింటికీ వచ్చినప్పుడు వారికి దానం ఇవ్వడం ఆనవాయితీ. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా పండగ తాలూకు విషయాలు చెప్పేవారు’’ అని సోషల్ మీడియా ద్వారా అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. T 4889 - Happy Lohri .. 'लोहड़ी दा टक्का दे, रभ थानू बच्चा दे ' ... 😁 this is how the chanting went when they came to homes and families to collect donations on the occasion of Lohri .. Maa used to tell us these stories .. pic.twitter.com/t9rVu8Kb2j — Amitabh Bachchan (@SrBachchan) January 13, 2024 ‘‘లోహ్రీ తాలూకు వెచ్చదనాన్ని, పండగ సందర్భంగా మా అమ్మగారు చేసిన స్వీట్స్‌ని తలుచుకుంటున్నాను. ఇరుగు పొరుగుతో పంచుకున్న నవ్వులతో నా మనసు నిండిపోయేది. నేటి బిజీ జీవితంలో అప్పటి ఆనందకర సాధారణ రోజులను తలచుకుని, ఆనందిస్తున్నాను. అందరి జీవితాల్లో లోహ్రీ ఆనందం నింపాలని కోరుకుంటున్నా’’ అని సన్నీ డియోల్ పేర్కొన్నారు. ఇంకా అక్షయ్ కుమార్, సంజయ్ దత్, విక్కీ కౌశల్, ఇషా డియోల్, నేహా ధూపియా వంటి తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
రైతులతో చర్చలు కొనసాగుతాయ్
న్యూఢిల్లీ: కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరిషోత్తం రూపాల చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్నారు. 15వ తేదీన 9వ దఫా చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను రైతులు లోహ్రీ(భోగీ) మంటల్లో దహనం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతన్నలు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సింఘు బోర్డర్ వద్ద బుధవారం లక్ష ప్రతులను దహనం చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి పరమ్‌జిత్‌సింగ్ చెప్పారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో లోహ్రీ పంటల పండుగ. మూడు కొత్త చట్టాలను కేంద్ర సర్కారు రద్దు చేసిన రోజే తాము పండుగ జరుపుకుంటామని హరియాణా రైతు గురుప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీ–హరియాణా రహదారిపై పలుచోట్ల నిరసనకారులు లోహ్రీ మంటలు వెలిగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 26న కిసాన్ పరేడ్ 26న వేల ట్రాక్టర్లతో ఢిల్లీ శివార్లలో పరేడ్ నిర్వహిస్తామని ఆలిండియా కిసాన్ సంఘర్‡్ష కో–ఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. ఢిల్లీకి చుట్టూ 300 కిలోమీటర్లలోపు ఉన్న అన్ని జిల్లాల ప్రజలు ఒకరోజు ముందే నగర శివార్లకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. -
ఉత్సాహంగా లోహ్రీ ఉత్సవం
-
ఆటపాటలతో ఘనంగా 'లోహ్రీ'


