breaking news
lineman dies
-
విద్యుత్ షాక్‌తో సచివాలయ లైన్‌మేన్ మృతి
జి.సిగడాం: మండలంలోని వెలగాడ సచివాలయంలో విద్యుత్ లైన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.ఎర్రయ్య (33) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో భాగంగా ఎర్రయ్య మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో వెలగాడలో ఎల్సీ తీసుకుని స్తంభం ఎక్కి విధులు నిర్వహిస్తుండగా పక్కనే ఉన్న హెవీలైన్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడి నుంచి కిందకు పడిపోయాడు. స్థానికులు స్పందించి 108 వాహనంలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు, గుండెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందాడు. ఎర్రయ్యకు భార్య లక్ష్మి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పేద కుటుంబాన్ని ఆదుకోవాలి.. నిరుపేద కుటుంబానికి చెందిన ఎర్రయ్య పుట్టినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కష్టపడి చదివి సచివాలయం ఉద్యోగం సాధించాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలతో ఆనందంగా జీవిస్తున్న తరుణంలో మృత్యువు వెంటాడింది. ఎర్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న ఏఈఈ తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి చేబ్రోలు సురేష్, తోటి ఉద్యోగులు ఎర్రయ్య కుటుంబాన్ని ఓదార్చారు. కాగా, ఎర్రయ్య మృతి వార్త తెలియగానే స్వ్రగామం మధుపాంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎర్రయ్య మృతిపట్ల సర్పంచ్ బగాది అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ నల్లి తవిటినాయుడు, ముగ్గు శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. -
విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి
ధర్మవరం అర్బన్ : విద్యుదాఘాతంతో జూనియర్ లైన్మెన్ మృతి చెందిన ఘటన పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలో జూనియర్ లైన్మెన్గా వెంకటరమణ (35) కాయగూరల మార్కెట్ వీధిలో ఉన్న భక్త మార్కెండేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విద్యు™Œ స్తంభం ఎక్కి విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నట్టుండి స్తంభంపైన విద్యుత్ తీగల నుంచి విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురై కిందపడ్డాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మెయిన్‌లైన్‌పై విద్యుత్ ప్రసార ం నిలిపి వేసిన ఇళ్లలో ఉండే ఇన్వర్టర్ల కారణంగా విద్యుత్ షాకు తగిలి ఉంటుందని విద్యుత్ ఉద్యోగులు చెప్తున్నారు. మృతుడికి భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడీ వెంకట రమేష్ మృతుడి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని తెలిపారు.