breaking news
lifting sports
-
శభాష్ ! సాయి అలంకృత.. వెయిట్ లిఫ్టింగ్‌లో వరల్డ్ రికార్డ్
హైదరాబాద్ : చెంగిచర్లలో నివాసముంటున్న సందీప్, స్నిగ్థ బసు దంపతుల కూతురు సాయి అలంకృత అరుదైన ఫీట్ చేసింది. ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. పిన్న వయసులోనే అదిక బరువులను అవలీలగా ఎత్తేస్తూ ఔరా అనిపిస్తోంది. చదవండి: మోడరన్ మామ్స్.. బేబీ ఫుడ్ కుకర్ గురించి మీకు తెలుసా? -
ముగిసిన జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఐఎంఏ హాల్ నిర్వహించిన జిల్లాస్థాయి ద్వితీయ సబ్‌జూనియర్, జూనియర్, పురుషులు, మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ముగిసిశాయి. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పోటీలను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 65 మంది క్రీడాకారులు ఆయా కేటగిరీల్లో పాల్గొన్నారు. ఒక్క రోజుకు పరిమితంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలకు సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలను కెరీర్‌గా మార్చుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. ఆయా కేటగిరిల్లో విజేతలుగా నిలిచినవారికి ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ పీటీఆర్ కృష్ణారావు, అధ్యక్షుడు జి.నరేంద్ర, కార్యదర్శి సీహెచ్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.