‘ఒరిగిందేం లేదు..’ ట్రంప్ టారిఫ్‌లకు గీతా గోపినాథ్ నెగెటివ్ మార్క్
ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్.. ట్రంప్ సుంకాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాటి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటిదాకా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారామె. పైగా ఈ 6 నెలల కాలంలో టారిఫ్‌లు ప్రతికూల ప్రభావాన్ని చూపాయని తేల్చేశారామె(Gita Gopinath On Trump Tariffs).ప్రపంచంలోనే అత్యధికంగా.. భారత్, బ్రెజిల్‌పై 50 శాతం సుంకాలను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే.. బ్రాండెడ్ ఔషధాలపైనా 100 శాతం టారిఫ్‌లు విధించారు. వీటితో పాటు చాలా రంగాలపై సుంకాలు విధించారు.. ఇంకా విధించుకుంటూ పోతున్నారు. అయితే.. లిబరేషన్ డే పేరిట ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టి(Liberation Day Tariffs) ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంలో హార్వార్డ్ యూనివర్సిటీ ఎకనామిక్ ఫ్రొపెసర్ గీతా గోపినాథ్ స్పందించారు. ట్రంప్ సుంకాలను నెగటివ్ స్కోర్‌కార్డ్‌గా అభివర్ణిస్తూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం కాకుండా నష్టం కలిగించాయని అన్నారామె. ఈ టారిఫ్‌లు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినప్పటికీ.. ‘పన్నుల్లా’ వాటి భారం అమెరికా కంపెనీలు, వినియోగదారులపై పడిందని ఆమె అన్నారు. టారిఫ్‌ల ప్రభావంతో ద్రవ్యోల్బణాన్ని స్వల్పంగా పెరిగినప్పటికీ.. గృహోపకరణ వస్తువులు, ఫర్నిచర్, కాఫీ వంటి వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైందని.. ఇది మధ్య తరగతి కుటుంబాలపై ప్రభావం చూపినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. వెరసి.. తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందలేదు. అలాగే, వాణిజ్య లోటు తగ్గిన సంకేతాలు కూడా లేవు. టారిఫ్‌లతో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు అని ఆమె తేల్చేశారు. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం, విదేశీ పోటీని తట్టుకోవడం, వాణిజ్య లోటును తగ్గించడమే లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకోవడం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా ఇప్పటివరకు ఫలితాలు ఇవ్వలేదని IMF మాజీ అధికారి అభిప్రాయపడటం గమనార్హం.It is 6 months since "Liberation day" tariffs. What have US tariffs accomplished?1. Raise revenue for government? Yes. Quite substantially. Borne almost entirely by US firms and passed on some to US consumers. So it has worked like a tax on US firms/consumers. 2. Raise… pic.twitter.com/KZG3UgKB3S— Gita Gopinath (@GitaGopinath) October 6, 2025 గీతా గోపినాథ్(53) భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణురాలు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2019లో IMF చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులై, 2022లో ఆ సంస్థకు తొలి డిప్యూటీ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2025లో IMF పదవిని వీడి.. హార్వర్డ్‌లో తిరిగి ప్రొఫెసర్‌గా చేరారు.ఇదీ చదవండి: క్వాంటమ్ మెకానిక్స్‌కు ఎట్టకేలకు గుర్తింపు