breaking news
Lexington
-
50 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఇప్పుడు పెళ్లి!
దేవుడు వేసిన ముడి ఎప్పటికి విడిపోదు. ఆ ముడిని తెంచుకోవడం మానవమాత్రులకు ఎలా సాధ్యమవుతుంది. కానీ మారుతున్న కాలంతో పాటు మనిషిలో కూడా మార్పులు వస్తున్నాయి. బ్రహ్మ వేసిన ముడులు విప్పడానికి విడాకులను సృష్టించాడు మానవుడు. విడాకులు మనషికి మాత్రం పరిమితం. మనసుకి కాదు. ఆ మనసులు ఎప్పడూ కలిసే ఉంటాయి. లేదా ఎప్పటికైనా కలుస్తాయి. దీనికి నిదర్శనమే ఈ జంట. అమెరికా కెంటుకీలోని లెక్సింగ్టన్కు చెందిన హరోల్డ్ హోలాండ్, లిల్లియన్ బర్న్స్ లు 1968లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి ఐదుగురు సంతానం ఉంది. విడాకుల అనంతరం వీరిద్దరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరు 2015లో చనిపోయారు. అయితే ఆ జంట విడిపోయినా మధ్యమధ్యలో పిల్లలకోసం కలిసేవారు. మాట్లాడుకునే వారు. హోలాండ్ ప్రతీ సంవత్సరం తన కుటుంబంతో గెట్ టుగేదర్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసేవాడు. అయితే ఈ ఏడాది కూడా ఏర్పాటుచేశాడు. అయితే దీనికి మాజీ భార్య బర్న్స్ కూడా హాజరయ్యారు. వీరికి పది మంది పిల్లలు, 20కి పైగా మనవళ్లు, 30కి పైగా ముని మనవళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీరు ఒంటరిగా మాట్లాడుకోవడం వల్ల మరింత సన్నిహితులం అయ్యామని హోలాండ్ తెలిపారు. ఇప్పటికి వీరిద్దరు యువకుల్లానే ప్రేమించుకుంటున్నారనీ, కలిసినప్పుడు చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారనీ, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నప్పుడు కళ్లలో వెలుగులు కనబడతాయని వారి మనవళ్లు చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లి వచ్చే వారం చర్చిలో జరగనుంది. పాస్టర్ కూడా వీరి మనవడే. గ్రాండ్ పేరెంట్స్ వివాహం నా చేతులపై జరపడం చాలా ఆనందంగా ఉందనీ, నేను చేసిన అన్ని పెళ్లిళ్లలోనూ ఇది ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు. -
అమెరికాలో కిరాతకం
-
అమెరికాలో కిరాతకం
లెగ్జింటన్: అమెరికా స్పింటర్ టైసన్ గే కుమార్తె ట్రినిటీ గే(15) దారుణ హత్యకు గురైంది. కెంటకీ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ లో ఆమెను కాల్చిచంపినట్టు టైసన్ గే ప్రతినిధి మార్క్ వెట్ మోర్ తెలిపారు. రెస్టరెంట్ పార్కింగ్ ప్రాంతంలో ట్రినిటీ మృతదేహాన్ని గుర్తించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు లెగ్జింటన్ పోలీసులు తెలిపారు. రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య కాల్పులు జరిగినట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మరో వాహనం కోసం గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. గత మూడు సమ్మర్ ఒలింపిక్ క్రీడల్లో టైసన్ గే పోటీ పడ్డాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో 4X100 మీటర్ల రిలే పరుగు పందెంలో వెండి పతకం గెలిచిన అమెరికా అథ్లెట్ల బృందంలో అతడు కూడా ఉన్నాడు. ట్రినిటీ కూడా తండ్రి మాదిరిగానే స్పింటర్ గా మారింది. రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంది. ఆమె మృతి పట్ల కెంటకీ హైస్కూల్ అథ్లెటిక్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.