breaking news
Leneovo
-
ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్లకు భలే గిరాకీ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని దేశాలు లాక్డౌన్లు విధించాయి. కరోనా ఎక్కువగా చిన్నారులు, వృద్ధులకు వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారులకు ట్యాబ్లెట్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల ద్వారా విద్యకు సంబంధించిన అంశాలను నేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రూ.10,000 నుంచి 15,000 ఖరీదు చేసే ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక గిరాకీ ఉందని స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ దిగ్గజం లెనివో ఇండియా డైరెక్టర్ పంకజ్ హర్జై తెలిపారు. కాగా ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక డిమాండ్ నెలకొనడంతో చిన్నారులకు అలరించే సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటామని హర్జై స్పష్టం చేశారు. ట్యాబ్లెట్ ఫోన్లకు అధిక డిమాండ్ ఉందని మహేష్ టెలికం సంస్థకు చెందిన వ్యాపారి మనీష్ ఖత్రి పేర్కొన్నారు. కాగా మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు తక్కువ ఖర్చుతో అత్యధిక క్వాలిటీ గల ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ల్యాప్‌టాప్ తయారీ సంస్థలు రూ.20,000నుంచి రూ.30,000 ధరకు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రముఖ రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు ముందు తల్లిదండ్రులు విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనివ్వడానికి మొగ్గు చూపేవారు కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: 'మీరిచ్చే ఆఫర్ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది') -
లెనవూ బడ్జెట్ ట్యాబ్లెట్...
చైనీస్ కంప్యూటర్ తయారీ దిగ్గజం లెనవూ తాజాగా సరికొత్త ట్యాబ్లెట్ ఒకదాన్ని విడుదల చేసింది. శక్తిమంతమైన ఫీచర్లున్నప్పటికీ ధర అందుబాటులోనే ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మైక్రోప్రాసెసర్ విషయాన్నే తీసుకుంటే దీంట్లో 1.3 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికితోడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ 4.4, అత్యాధునిక డాల్బీ ఆడియోలు ఉండటం విశేషం. ఫైళ్లను సులువుగా ట్రాన్స్ఫర్ చేసేందుకు, ట్యాబ్లెట్ వేగాన్ని పెంచేందుకు, కాంటాక్ట్‌ల సింకింగ్ కోసం లెనవూ డూయిట్ ఆప్స్‌ను అందుబాటులో ఉంచారు. స్క్రీన్ సైజు ఏడు అంగుళాలు కాగా, రెజల్యూషన్ 1024 బై 600గా ఉంది. ఫైవ్ పాయింట్ టచ్ స్క్రీన్, ఒక గిగాబైట్ ర్యామ్, 8జీబీ ప్రధాన మెమరీ దీంట్లోని అదనపు ఫీచర్లు. బ్యాటరీ 3450 ఏంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంది. అయితే... రూ.4999లకే లభించే ఈ ట్యాబ్లెట్లో సెల్ఫీ కెమెరా ఒక్కటే ఉండటం అది కూడా 0.3 ఎంపీ రెజల్యూషన్ మాత్రమే కలిగి ఉండటం కొంత నిరాశ కలిగించే అంశం.