breaking news
leg pacture
-
కాలునే దిండుగా..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఝాన్సీ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కాలును తొలగించిన వైద్యులు.. ఆ కాలును తలగడగా వినియోగించి మరోసారి అమానవీయంగా వ్యవహరించారు. క్యాజువాలిటీ వార్డ్‌లో స్ట్రెచర్‌పై పడుకున్న రోగి.. ఆయన తలగడగా తొలగించిన కాలున్న వీడియోను ఓ స్థానిక టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ ఆసుపత్రి డాక్టర్ల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ స్కూలు బస్సుకు క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని.. శనివారం బస్సు ప్రమాదంలో కాలు విరగటంతో హుటాహుటిన ఝాన్సీ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు డాక్టర్లు వెంటనే కాలు తీసేశారు. అనంతరం, బెడ్‌పై కాకుండా స్ట్రెచర్‌పైనే ఆ వ్యక్తికి చికిత్సనందించిన డాక్టర్లు.. ఆ వ్యక్తికి ఆయన కాలునే తలగడగా పెట్టారు. దీన్ని స్థానిక మీడియా బయటపెట్టడంతో ఈ విషయం ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తొలగించిన కాలు ఎలా గదిలోకి వచ్చిందో తెలియదని డాక్టర్లంటున్నారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఆసుపత్రిలోనే కాలు తొలగించామని, లోపలకు ఎలా వచ్చిందో తెలియదని చెబుతుండగా.. ప్రమాదం జరిగిన చోటే కాలు తెగిపోయిందని, కుటుంబ సభ్యులు దీన్ని తీసుకొచ్చి ఉంటారని మరికొందరంటున్నారు. అయితే.. ఈ ఆసుపత్రిలో స్వీపర్లు, వార్డ్బాయ్లే చిన్న చిన్న సర్జరీలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. -
మానవత్వం పరిమళించే...
జూబ్లీహిల్స్ (హైదరాబాద్): ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారికి కాలు విరిగితే నగరానికి చెందిన యువకుడు వైద్యం చేయించి మానవత్వం చాటుకున్నాడు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వత్తిబాట గ్రామానికి చెందిన సింగమాల రమణయ్య, శశికళ దంపతులు కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారి కుమార్తె గాయత్రి(3) ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడడంతో కాలు విరిగింది. వైద్యానికి రూ.2లక్షలు ఖర్చు అవుతుందని స్థానిక వైద్యులు చెప్పడంతో గాయత్రి తల్లిదండ్రులు జిల్లాకు చెందిన శ్రీజ్ఞాన సరస్వతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీనివాస్‌ను సంప్రదించారు. తన ట్రస్ట్ ఫేస్బుక్, వాట్సాప్ పేజీలలో శ్రీనివాస్ ఈ సమాచారాన్ని ఉంచాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని సంస్థ కోఆర్డినేటర్ రాఘవేంద్ర తెలుసుకుని చిన్నారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తన మిత్రులు, పరిచయస్థుల నుంచి రూ. 75వేలు సేకరించి గాయత్రి తల్లిదండ్రులకు అందించాడు.