breaking news
leave India
-
నరేష్ గోయల్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు గోయల్ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. గ్యారంటీ సొమ్ము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి విదేశాలకు వెళ్లాలనుకుంటే 18వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని న్యాయమూర్తి సురేష్ కైత్ స్పష్టం చేశారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్‌ను సవాల్ చేస్తూ, దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతిని కోరుతూ గోయల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా గోయల్ ఆయన భార్య అనిత దుబాయ్‌కు వెళుతుండగా మార్చి 25 న విమానాన్ని దింపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ రంగబ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా, డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్‌కు తాజా షాక్ తగిలింది. -
'48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపో..'
న్యూఢిల్లీ: గూఢచర్యం నిర్వహిస్తున్నాడనే కారణాలతో భారత్‌లోని పాక్ హైకమిషన్‌లో పనిచేస్తున్న మొహమ్మద్ అక్తర్‌ను పోలీసులు అరెస్టు చేయగా అతడిని 48గంటల్లో భారత్ విడిచిపెట్టి వెళ్లాలని భారత విదేశాంగ శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం తెలియజేశారు. పాక్ హైకమిషన్ కార్యాలయంలో అక్తర్ వీసా సెక్షన్లో పనిచేస్తున్నాడని, అతడి దౌత్య పరమైన రక్షణ ఉందని వికాస్ స్వరూప్ చెప్పారు. ఈ కారణంతోనే అరెస్టు చేయడం లేదని అన్నారు. కమిషన్‌లో పనిచేస్తున్న అతడు గోప్యంగా మరో ఇద్దరు ఉద్యోగుల నుంచి భారత రక్షణ శాఖకు చెందిన కీలక పత్రాలను సేకరిస్తూ గూఢచర్యం నిర్వహిస్తున్నాడని, ఇలాంటి చర్యలకు దిగిన అతడికి ఇక భారత్‌లో పనిచేసే అవకాశం లేదని, 48గంటల్లో దేశం నుంచి పంపించాలంటూ ఇప్పటికే పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్‌కు చెప్పినట్లు తెలిపారు. అక్తర్‌ను అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించామని, అతడిపై ఏ అధికారి కూడా చేయి చేసుకోలేదని, పాక్ చేసేవి కేవలం ఆరోపణలు మాత్రమే అని అన్నారు. ఇప్పటికే అక్తర్ కు సహాయం చేసిన పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలను సదరు ఉద్యోగులు దొంగిలించి అక్తర్‌కు అందించినట్లు తెలుస్తోంది.