breaking news
Laththi Movie
-
ఓటీటీలో లాఠీ, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ విశాల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లాఠీ. సునయన కథానాయిక. ఎ.వినోద్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నంద నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించాడు. గత నెల 22న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సన్ నెక్స్ట్ అధికారికంగా ప్రకటించింది. కథ విషయానికి వస్తే.. సిన్సియర్ కానిస్టేబుల్ అయిన మురళీకృష్ణ(విశాల్) తన కుటుంబమే ప్రపంచంగా బతుకుతాడు. ఓ హత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అతడిని అధికారులు సస్పెండ్ చేస్తారు. ఎలాగోలా తిరిగి ఉద్యోగంలో చేరతాడు కానీ ఎవరినీ లాఠీతో శిక్షించొద్దని నిర్ణయించుకుంటాడు. ఓసారి డీఐజీ ఓ నేరస్తుడిని లాఠీతో కొట్టమని మురళీని ఆదేశిస్తాడు. తనకు ఉద్యోగం తిరిగి ఇప్పించాడనే కృతజ్ఞతతో నేరస్తుడిని వీరబాదుడు బాదుతాడు. ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ కొడుకు. తనను కొట్టిన మురళిపై పగపడతాడు. అతడి నుంచి మురళి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడన్నదే మిగతా కథ. Laththi streaming from 14th Jan only on Sun NXT#SunNXT #Laththi #LaththiCharge #Vishal #Sunaina #Prabhu #Munishkanth #MeeshaGhoshal #ThalaivasalVijay #AVinothKumar @VishalKOfficial @TheSunainaa pic.twitter.com/wbNiF642u9 — SUN NXT (@sunnxt) January 12, 2023 చదవండి: వారీసు వర్సెస్ తునివు.. ఓపెనింగ్స్ ఎంత వచ్చాయంటే? -
Latti Review: ‘లాఠీ’ మూవీ రివ్యూ
టైటిల్: లాఠీ నటీనటులు: విశాల్, సునైన, ప్రభు, మనిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్ తదితరులు నిర్మాణ సంస్థ: రానా ప్రొడక్షన్స్ నిర్మాతలు: రమణ, నంద దర్శకత్వం: ఎ. వినోద్ కుమార్ సంగీతం: యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం విడుదల తేది: డిసెంబర్ 22,2022 ‘లాఠీ’ కథేంటంటే.. మురళీకృష్ణ(విశాల్) ఓ సిన్సియర్ కానిస్టేబుల్. భార్య కవి(సునైన), కొడుకు రాజునే ప్రపంచంగా బతుకుతాడు. ఓ హత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పై అధికారులు అతన్ని సెస్పెండ్ చేస్తారు. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మురళీ అధికారుల చుట్టూ తిరుగుతుంటాడు. చివరకు డీఐజీ కమల్(ప్రభు) సాయంతో ఉద్యోగంలో చెరతాడు. ఇకపై ఎవరిని లాఠీతో శిక్షించొద్దని భావించిన మురళీ...సిన్సియర్‌గా తన పని తాను చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతుంటాడు. ఓ సారి డీఐజీ కమల్..తన కస్టడీలో ఉన్న ఓ నేరస్తుడిని లాఠీతో కొట్టమని మురళీని కోరతాడు. తన ఉద్యోగం తిరిగి ఇప్పించాడనే కృతజ్ఞతతో నేరస్తుడు ఎవరనేది చూడకుండా.. అతన్ని లాఠీతో కొడతాడు మురళీ. అయితే ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ సూరా కొడుకు వీరా అని తర్వాత తెలుస్తుంది. తనను తీవ్రంగా కొట్టిన మురళీపై వీరా పగ పడతాడు. పట్టుకున్న డీఐజీ కమల్ని కాకుండా.. లాఠీతో కొట్టిన మురళి కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అప్పుడు మురళీ కృష్ణ ఏం చేస్తాడు? సూరా, వీరాలనుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ సాధారణ కానిస్టేబుల్ కథే ‘లాఠీ’. పై అధికారుల ఒత్తిడితో ఓ ముఠాతో వైరం పెంచుకొని.. ఆ ముఠా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే.. కానిస్టేబుల్ ఒక్కడే తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ స్టోరీ లైన్. పాయింట్ కొత్తగా ఉన్నా.. కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ సన్నివేశాలతో చాలా సింపుల్‌గా కథ ముందుకు వెళ్తుంది. ఫస్టాఫ్‌లో ఓ సాధారణ కానిస్టేబుల్ జీవితాన్ని చూపించారు. నిజాయతీగా ఉండే ఓ కానిస్టేబుల్ పై అధికారి చెప్పారని ఓ నేరస్తుడిని కొట్టడం..అతను పై అధికారిపై కాకుండా కానిస్టేబుల్‌పై పగపెంచుకోవడం.. సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌తో అతన్ని గుర్తించడం లాంటి సన్నివేశాల ఫస్టాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం చాలా రొటీన్‌గా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పోరాట ఘట్టాలు అయినా కొత్తగా ఉంటాయా అంటే అదీ లేదు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. పోలీసు పాత్రలు విశాల్‌కు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లో పోలీసు పాత్ర పోషించారు. అందుకే కానిస్టేబుల్ మురళీ కృష్ణ పాత్రలో విశాల్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు కానీ అది వర్కౌట్ కాలేదు. కవిత పాత్రకు సునైనా న్యాయం చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ప్రభు, తలైవాసన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక విలన్లు సూరా, వీరలుగా సన్నీ పీఎన్, రమణ జస్ట్ తెరపై విలనిజం పండించడంలో విఫలం అయ్యారు. అయితే ఈ తప్పు వారిది కాదు. ఆ పాత్రలు డిజైన్ చేసిన విధానంలోనే లోపం ఉంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. పీటర్ హెయిన్స్ పోరాట ఘట్టాలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాలసుబ్రహ్మణ్యం పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్