breaking news
landlady
-
పనిమనిషిని అంత దారుణంగా..
యజమానికి సహకరించిందన్న కారణంతో ఓ మహిళపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఆమె గుడ్డలూడదీసి అర్ధనగ్నంగా ఆమెను రోడ్డుపై పరుగులు పెట్టించారు. స్థానికులు కొందరు ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే... సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ పాలమ్ ప్రాంతంలో ఓ మహిళ తన కొడుకు-కోడలితో నివసించేంది. అయితే కోడలి వైఖరితో ఆ ఇంట్లో గొడవలు చెలరేగగా.. కొన్ని రోజుల క్రితం ఆ జంటను సదరు తల్లి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ తర్వాత కొడుకు తరచూ తల్లిని కలుస్తూ ఉండేవాడు. బుధవారం సాయంత్రం కోడలు మహిళ ఇంటి వద్ద గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో పని మనిషి(45) ఆమెను అడ్డుకునేందుకు యత్నించింది. కోపంతో ఆ కొడుకు-కోడలు పని మనిషిపై దాడికి పాల్పడ్డారు. ఆమె దుస్తులు చించి, పిడి గుద్దులు గుప్పించారు. రోడ్ల వెంబడి పరుగులు పెట్టించారు. అడ్డుకోవటానికి యత్నించిన తల్లిపై కూడా దాడికి యత్నించారు. స్థానికులు చూస్తూ ఉండిపోయారే తప్ప(వీడియోలు మాత్రం తీశారు).. సాయానికి ముందుకు రాలేదు. చివరకు అక్కడి నుంచి పారిపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతుల కోసం గాలింపు చేపట్టారు. -
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి మహిళపై దాడి
తెగించి దుండగుడిని పట్టుకున్న యజమానురాలు చిలకలగూడ: ఇల్లు కిరాయికి కావాలంటూ వచ్చిన దుండగుడు యజమానురాలిపై చాకుతో దాడిచేశాడు. ఆమె మెడలోని గొలుసుతెంపగా.. ఆమె అతనిని అడ్డుకుని స్థానికుల సాయంతో పట్టుకుని అప్పగించింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఉప్పరిబస్తీకి చెందిన ఎల్ సాయకుమార్, వాణి దంపతులు తమ ఇంట్లోని ఓ పోర్షన్ అద్దెకిచ్చేందుకు టు-లెట్ బోర్డు పెట్టారు. లాలాపేట శాంతినగర్‌కు చెందిన పోతరాజు శ్రీకాంత్ (39) బుధవారం మధ్యాహ్నం వెళ్లి పోర్షన్ చూపించాలని వాణిని కోరాడు. ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి చూపించగా, మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఇంట్లో వాణి ఒక్కరే ఉన్నారని గ్రహించిన శ్రీకాంత్ నామాలగుండులోని ఓ దుకాణంలో కూరగాయలు తగిరే చాకును కొని, పది నిమిషాల తర్వాత నేరుగా ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. కిచెన్‌లో ఉన్న వాణిపై చాకుతో దాడిచేసి, ఆమె మెడలోని ఆరున్నర తులాల బంగారు గొలుసుకుని తెంపాడు. గాయాలపాలైనప్పటికీ ధైర్యంగా ప్రతిఘటించిన వాణి శ్రీకాంత్‌ను పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించి శ్రీకాంత్‌ను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. బీకాం చదివిన శ్రీకాంత్ కార్ఖానాలో సెక్యూరిటీగార్డుగా పనిచేసి.. కొద్దిరోజులుగా ఖాళీగా ఉంటున్నాడు. తన భార్య స్కూలు టీచరని, పిల్లల స్కూలు ఫీజు కోసమే దోపిడీకి పాల్పడ్డానని శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.