breaking news
laksmanareddy
-
మంత్రి కేటీఆర్‌ను కలిసిన ‘వంగేటి’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కె.తారకరామారావును మర్యాద పూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు మంత్రికి వంగేటి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా లక్ష్మారెడ్డికి కేటీఆర్ సూచించారు. -
తెలుగు జాతి క్షమించదు
రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీని మాటవరసకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగక పోవడం దురదృష్టకరమని జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో తిరుపతి సభలో 10 సంవత్సరాలు ప్రత్యేక హాదా హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసిందని.. తెలుగు జాతి వారిని ఎన్నడూ క్షమించదని అన్నారు. ప్రజల్లో మతాచారాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి.. మట్టి, నీరు తెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో పంటల విధ్వంసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రధాని ప్రశ్నించక పోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంత ప్రజాధనాన్ని వెచ్చించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.