breaking news
Lakshmi Narayana Reddy
-
22న వైఎస్ఆర్సీపీలోకి చెరుకులపాడు నారాయణరెడ్డి
పత్తికొండ: అధికారం ఉన్నా.. లేకున్నా నిరంతరం తన వెంట నడిచిన కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తానని కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు లక్ష్మీ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండలంలో న్యాయవాది ఎల్లారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల సహకారంతో 32 వేల ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థుల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచానన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. నాయకులు, కార్యకర్తలు సలహా మేరకు, తనను నమ్ముకున్న వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 30వ తేదీన పత్తికొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. పార్టీలోకి చేరిన మరుక్షణమే హంద్రీ నీవా నుంచి సాగు, తాగునీరు సరాఫరా చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాల నాయకులు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చెర్మన్ మల్లికార్జున యాదవ్, మాజీ సర్పంచ్ కృష్ణ, సర్పంచ్ హనుమంతు, ఆస్పరి బోయ రవిచంద్ర, శ్రీనివాసులు, పెద్ద తిమ్మయ్య, శంకర్‌రెడ్డి, నాయీ బ్రహ్మణుల సంఘం డివిజన్ అధ్యక్షుడు రవికుమార్, చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు జాఫర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహనికి ఎన్నికల్లో కనుమరుగైందన్నారు. రాష్ట్ర విభజనతో తమ నాయుడు నారాయణరెడ్డికి కాంగ్రెస్ ఓట్లు పడలేదని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారం చేసినందుకు వ్యక్తిగతంగా ఓట్లు పడ్డాయన్నారు. పదవులు, కాంట్రాక్టు పనులు కోసం టీడీపీలో చేరకుండా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీలోకి చేరుతుండటంతో ఆనందంగా ఉందంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గాందిరెడ్డి, బాబుల్‌రెడ్డి, మేకల సత్యం, ఖజావలి, శ్రీనివాసులు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈనెల 22వ తేదీన హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలిసింది. -
రిజిస్ట్రేషన్లు ఆగలేదు
నిలుపుదల చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు లేవు రియల్ బూమ్ ప్రచారమే రూ.616 కోట్ల ఆదాయం లక్ష్యం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డీఐజీ కె.లక్ష్మీనారాయణరెడ్డి నూజివీడు : జిల్లాలోని 8మండలాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (విజయవాడ) కె.లక్ష్మీనారాయణరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోసోమవారం ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.616కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగాపెట్టుకున్నా మని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న లక్ష్యం లో కేవలం 68శాతం మాత్రమే ఆదాయం సమకూరిందని, అయితే ఈ ఏడాది మాత్రం ఏప్రిల్, మే, జూన్ నెలలకే 85శాతం ఆదాయం వచ్చిందన్నారు. గతంలో మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే ఇచ్చిన ఈసీలను, హైకోర్టు ఆదేశాల మేరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారానూ జారీ చేస్తున్నామన్నారు. భూములరేటు పెరిగిందని, అధికరేట్లకు కొనుగోలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం కేవలం ప్రచారం మాత్రమేనని, ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్లు పెరగలేదని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడో కొనుగోలుచేసిన భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. తూర్పు క్రిష్ణాలో భూముల బూమ్ అసలేమాత్రం లేదని, నూజివీడు, గన్నవరం, కంకిపాడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆశించినంతగా రిజిస్ట్రేషన్లు జరగడంలేదని చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్లుబీ శ్రీనివాసరావు, బాలకృష్ణ ఉన్నారు.