breaking news
lakshmanna
-
బ్రెయిలీలో భగవద్గీత
అతని కళ్లకు లోకమంతా గాఢాంధకారం. అంతమాత్రాన ఆ ఉపాధ్యాయుడు నిరాశ చెందలేదు. భగవద్గీత– హిందువుల ఆరాధ్య గ్రంథం. కళ్లులేని వాళ్లు దాన్నెలా చదవాలి, ఎవరైనా చదువుతుంటే వినడం తప్ప! అందుకే భగవద్గీతను తన తోటి అంధులకు అందించాలని నిశ్చయించుకున్నారు. భగవద్గీతను బ్రెయిలీ లిపిలో రాశారు. ఎందరో అంధులకు భగవద్గీతను చదివే అవకాశం కల్పించాలనేదే అలూరుకు చెందిన అంధ ఉపాధ్యాయుడు బూర్ల తిక్కలక్ష్మన్న సంకల్పం. ఇదీ ఆయన స్ఫూర్తి గాథ..రామకృష్ణ, కర్నూలు కల్చరల్ఒకవైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే, బ్రెయిలీ లిపిలో భగవద్గీతను రాసిన బూర్ల తిక్కలక్ష్మన్న కర్నూలు జిల్లా ఆలూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బూర్ల హనుమన్న, నరసమ్మ. పదో తరగతి వరకు ఆలూరులోనే చదువుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ అంధుల కళాశాలలో ఇంటర్, టీటీసీ పూర్తిచేసి, బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. తర్వాత అలూరు మండలం మూసానిపల్లెలో 1993లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆలూరు మండలం హులేబీడు ప్రభుత్వ పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎమ్గా పనిచేస్తూ, మరోవైపు కర్నూలులోని ఒక కళాశాలలో బీఈడీ చదువుతున్నారు.చిన్మయి మిషన్ సహకారంచిన్మయి మిషన్ ఆదోని శాఖ సహకారంతో బ్రెయిలీ భగవద్గీతను 2001లో వెయ్యి కాపీలను ముద్రించారు. దీనిని ముంబైలోని చిన్మయి మిషన్ స్వామీజీ తేజోమయానంద చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిన్మయి మిషన్ అనుమతితో రెండోసారి కూడా బ్రెయిలీ భగవద్గీత ప్రతులను ముద్రించారు. వీటిని అప్పటి ఆలూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ హేమ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే రాయచోటి రామయ్య సహకారంతో ఆదోని లక్ష్మమ్మవ్వ జీవిత చరిత్రను మాస్టారు బ్రెయిలీ లిపిలో రాశారు.మాస్టారి సేవలు.. సత్కారాలు⇒ 2005లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.⇒ 2012లో కర్నూలులో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిల చేతుల మీదుగా సన్మానం. ⇒ 2004 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 78 ప్రాంతాల్లో గీతా జ్ఞాన యజ్ఞాల నిర్వహణ.⇒ 2014 నుంచి బ్రెయిలీ భగవద్గీత ఆలయం వద్ద ప్రతి ఆదివారం భగవద్గీత శ్లోకాల పోటీల నిర్వహణ. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.1000, రూ.500, రూ.300 చొప్పున నగదు బహుమతుల ప్రదానం.⇒ కుటుంబ సభ్యుల సహకారంతో 2014లో ఆలూరులో బ్రెయిలీ భగవద్గీత ఆలయం నిర్మాణం పరిపూర్ణం.⇒ భగవద్గీతపై అవధానం కొనసాగిస్తున్న మొదటి అంధ ఉపాధ్యాయుడు లక్ష్మన్న. ⇒ 2020 ఏప్రిల్ 4న ఆదోనిలోని శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో మొదటిసారి భగవద్గీతపై అష్టావధానం నిర్వహణ. ఐదేళ్ల శ్రమ: బూర్ల తిక్కలక్ష్మన్న‘పుట్టుకతోనే అంధుడిని. నిరుపేదను. నాకు చదువుకోవాలనే ఆశ ఉండేది. నా తపన గమనించి మా నాన్న ఎన్నో కష్టాలకోర్చి నన్ను చదివించారు. కృష్ణుడిపై భక్తి భావంతో బ్రెయిలీలో భగవద్గీతను రాయాలనుకున్నాను. తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాదరావు సహకారంతో భగవద్గీత 18 అధ్యాయాల్లోని 701 శ్లోకాలకు ప్రతి పదార్థ తాత్పర్యాలు రాసి, 300 పేజీల పుస్తకాన్ని ముద్రించాను. యజ్ఞంలా తలపెట్టిన ఈ పని పూర్తికావడానికి ఐదేళ్లు శ్రమించాను.మా తెలుగు ఉపాధ్యాయుడు శివశంకరయ్య చిన్నతనం నుంచి భగవద్గీత గురించి చెప్పారు. మరో తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాద్ సహకారంతో భగవద్గీతను తెలుగు బ్రెయిలీ లిపిలో రాశాను. ఆయన నా భక్తికి మెచ్చి మేము కట్టించిన గుడికి రాధాకృష్ణుల విగ్రహాలను బహుమానంగా ఇచ్చారు. పిల్లల మనసు పరిశుభ్రమైన పలక వంటిది. పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, భగవద్గీత, భాగవతం లాంటì వాటిని నేర్పించాలి. ఏటా మూడు నెలలు అన్ని పాఠశాలల్లో భగవద్గీత గురించి ప్రచారం చేస్తాం. తరువాత భగవద్గీత పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేస్తున్నాం. భగవద్గీత అష్టావధాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. మరిన్ని అవధానాలు నిర్వహించాలన్నదే నా లక్ష్యం. -
నిన్న ఆర్ఐపై దాడి.. నేడు రైతు హత్య
ఇసుకరవాణాను అడ్డుకుంటే భౌతికదాడులు అధికారుల అండదండలతోరెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆత్మకూర్: ఈనెల 16న రాత్రి ఇసుకతరలింపును అడ్డుకున్న మానవపాడు ఆర్ఐపై దాడిచేసిన సంఘటనను మరువకముందే ఇసుకమాఫియా మరోసారి బరితెగించింది. భూగర్భజలాలు తగ్గిపోకుండా.. ఇసుకను కంటికిరెప్పలా కాపాడుకుంటున్న ఓ రైతును ట్రాక్టర్‌తో అడ్డంగా తొక్కించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకెళ్తే.. ఆత్మకూరు మండలం కర్వెన, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్ గ్రామశివారులో ఉన్న ఊకచెట్టు వాగులోంచి కొంతకాలంగా అక్రమంగా ఇసుకరవాణా కొనసాగుతోంది. ఇసుకాసులు వాగులోంచి తవ్విన ఇసుకను రైతుల పొలాల్లో పెద్దఎత్తున డంప్‌చేస్తున్నారు. ఆ తర్వాత లారీల్లో హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈనెల 21న పిన్నంచర్ల గ్రామశివారులో తహశీల్దార్ గోపాల్‌నాయక్ బృందం ఇసుకరవాణాపై దాడులు నిర్వహించి రెండు లారీలను పట్టుకున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులు చిన్నచింతకుంట మండలం శివారులో లారీలను పట్టుకునే హక్కు మీకెక్కడిది..! అంటూ బెదిరింపులకు దిగి మరీ ఓ ఇసుకలారీని తరలించుకుపోయారు. నారాయణపేట ఆర్డీఓ స్వర్ణలత ఆదేశాల మేరకు చిన్నచింతకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు న మోదు చేయించారు. ఈ ఘటనను మరువకముందే ఓ రైతు ప్రాణం తీసుకున్నారు. ఆత్మకూర్ మండలం పిన్నంచర్ల గ్రామానికి చెందిన రైతు లక్ష్మన్న(30)కు చెందిన వ్యవసాయ పొలం కర్వెన గ్రామ శివారులో ఉంది. నిత్యం తన పొలంలోంచి ఇసుక వాహనాలు వెళ్తుండడంతో పలుమార్లు వారించాడు. ఆదివారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో తన పొలంలో నుంచి వెళ్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకోబోయాడు. ఇసుక తరలిస్తున్న మాఫియా ముఠాసభ్యులు అడ్డువచ్చిన రైతుపైకి ట్రాక్టర్‌ను ఎక్కించడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇలా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. పెద్దఎత్తున మాముళ్లు ఇసుక అక్రమరవాణా చేస్తున్న మాఫియా నుంచి పోలీసు, రెవెన్యూ అధికారులకు పెద్దఎత్తున మామూళ్లు అందుతున్నాయని, అందుకే ఇసుక మాఫియా జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఇసుకవ్యాపారుల నుంచి నెలకు రూ.50 వేలకు ముడుతున్నాయని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇసుక మాఫియాకు ఎవరు సహకరిస్తున్నారనే విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు. ఈ సంఘటనపై కలెక్టర్ స్పందించి ఇసుకమాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామస్తుల ఆందోళన ఇసుకమాఫియా ఆగడాలను నిరసిస్తూ పిన్నంచర్ల గ్రామస్తులతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘటనస్థలంలో ఆందోళనకుదిగారు. బాధ్యులైనవారిని శిక్షించాలని డిమాండ్‌చేశారు. బాధిత రైతు కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ షేక్గౌస్తో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరు తహశీల్దార్ గోపాల్‌నాయక్, గద్వాల డీఎస్పీ బాలకోటితోపాటు సీఐ కిషన్ సంఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధ్యులు ఎంతటివారైనా సరే చట్టపరంగా శిక్షిస్తామన్నారు. బాధితరైతు లక్ష్మన్న కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చేందుకు ఇసుకమాఫియా అంగీకరించినట్లు తెలిసింది. మానవపాడు ఆర్ఐపై దాడి ఈనెల 16న మానవపాడు ఆర్ఐ శ్రీకాంత్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారెడ్డితో పాటు గ్రామ తలారీలు కిష్ణ, బాష విధుల్లో ఉన్నారు. కర్నూలు జిల్లా పంచలింగాలకు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆర్ఐ శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు కొందరు ఇసుకవ్యాపారులు శ్రీకాంత్‌రెడ్డిపై దాడిచే శారు.