breaking news
Laksha kumkumarchana services
-
కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
సాక్షి, తిరుపతి: టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో మహాలక్ష్మీ, సరస్వతి, కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేపట్టారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి తదితరులు పాల్గొన్నారు. -
నేడు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు రోజు ఆనవారుుతీ ప్రకారం ఆలయంలో నిర్వహించే లక్ష కుంకుమార్చన సేవలు వేదపండితులు, అర్చకులు, శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి నామాన్ని లక్ష మార్లు స్తుతిస్తూ అర్చన చేశారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన తిరుచానూరు: శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులోని ఆలయంలో లోకకల్యాణార్థం మంగళవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవను ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రతి ఏడాది అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందు రోజు ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని మంగళవారం వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామ, నిత్యార్చనలతో నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అమ్మవారిని వేంచేపుగా శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి తీసుకొచ్చి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారి సహస్రనామాలను ఆలయ అర్చకులు, వేదపండితులు లక్షమార్లు స్తుతిస్తూ మధ్యాహ్నం 12.30 గంటల వరకు కుంకుమతో అర్చన చేశారు. తరువాత భక్తులకు ప్రసాదంగా కుంకుమను అందజేశారు. సాయంత్రం ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి, వరప్రసాద్, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, వాహన ఇన్స్పెక్టర్ నాగరాజు, వీజీవో రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.