breaking news
ladies and gents
-
సమానత్వమా నీవెక్కడ?
మీ ఇంట్లో ఓ చిట్టితల్లి కళ్లు తెరిచింది! పురుషుడితో సమానంగా ఆమె ఓ కంపెనీకి సీఈవో కావాలంటే..? ఇంకా ఎన్నేళ్లు వేచి చూడాలో తెలుసా..? 81 సంవత్సరాలు!! మహిళ, పురుషుడు అని తేడా లేని సమసమాజాన్ని చూడాలంటే ఆ చిన్నారి ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలో తెలుసా..? మరో 50 ఏళ్లు!!! న్యూయార్క్: అవును.. ఆకాశంలో సగమని, అన్నింటా 'ఆమే'నని ఎంత ఊదరగొడుతున్నా మగువకు నేటికీ సమానావకాశాలు దక్కడం లేదు. ఇది వాళ్లోవీళ్లో చెప్పిన పోచికోలు కబురు కాదు. సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితే ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. స్త్రీ, పురుష వివక్ష రూపుమాసిపోవడానికి మరో 8 దశాబ్దాలు గడిచిపోవాల్సిందేనని చెబుతోంది. స్త్రీ సమానత్వం కోసం 20 ఏళ్ల కిందట కార్యాచరణ ప్రారంభించిన దాదాపు 189 దేశాలు ఇప్పటికీ తమ లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచాయని, ఒక్క దేశం కూడా సమానత్వాన్ని అందుకోలేదని పేర్కొంటోంది. స్త్రీ వివక్ష నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న ఐరాస మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఫుమ్జిలె లాంబో-చుకా ఈ వివరాలు వెల్లడించారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 1995లో బీజింగ్‌లో ఐరాస మహిళా సదస్సు సందర్భంగా మహిళా సమానత్వం కోసం 150 పేజీలతో కార్యాచరణ(బ్లూప్రింట్) తయారు చేశారు. ఆ సదస్సులో నాటి అమెరికా మొదటి పౌరురాలు హిల్లరీ క్లింటన్ ప్రపంచదేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఉత్తేజభరిత ప్రసంగం చేశారు. "మానవ హక్కులే.. మహిళా హక్కులు. మహిళా హక్కులే.. మానవ హక్కులు" అంటూ నినదించారు. బ్లూప్రింట్ అమలు కోసం 189 దేశాలు ప్రతినబూనాయి. ఆరోగ్యం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతి నిధ్యం తదితర 12 అంశాల్లో మిహ ళకు పెద్దపీట వేయాలని నాడు తీర్మానించాయి. అప్పటితో పోల్చుకుంటే మహిళ పరిస్థితి కాస్త మెరుగుపడ్డా.. అది ఆశించినంత మేర లేదని ఫుమ్జిలె చెప్పారు. దేశాలకు, ప్రభుత్వాలకు నేతృత్వం వహించే విషయంలో మహిళకు సమాన అవకాశాలు లేవన్నారు. ప్రస్తుతం దాదాపు 20 మందికిపైగా మహిళలు మాత్రమే దేశాలు, ప్రభుత్వాలకు అధినేతలుగా ఉన్నారన్నారు. 20 ఏళ్లలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 11 నుంచి 22 శాతానికి చేరిందన్నారు. "విధాన నిర్ణయాల్లో మహిళలకు చోటు దక్కడం లేదు. వారిపై హింస కూడా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది." అని ఆమె పేర్కొన్నారు. నైజీరియా లో బొకో హరమ్ ఉగ్రవాదులు స్కూల్లోని బాలికలను కిడ్నాప్ చేసి 'సెక్స్' బానిసలుగా అమ్మేస్తున్నారని ఫుమ్జిలె ఆవేదన వ్యక్తంచేశారు. పిల్లల్ని ఎప్పుడు కనాలనే స్వేచ్ఛ బీజింగ్ మహిళలకు ఉండడం లేదని పేర్కొన్నారు. ఆరోగ్యమూ అంతంతే! పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో పనులు.. మరెన్నో బాధ్యతలు! క్షణం తీరిక లేని ఈ నిత్యసమరం ముందు ''ఆమె' తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతోందని సర్వేలు చెబుతున్నాయి. 'ఆ ఏమౌతుందిలే..' అని సర్దిచెప్పుకుంటూ మహిళలు పనుల్లో పడిపోతున్నారని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థ ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో దాదాపు వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు. వారిలో తాము అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే 'హెల్త్ చెకప్' చేయించుకుంటామని 63 శాతం మహిళలు చెప్పారు. 16 శాతం మంది మాత్రమే రెగ్యులర్‌గా చెకప్‌లకు వెళ్తున్నట్టు తెలిపారు. ఏడాదిలో ఒకట్రెండు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్టు ఏకంగా 71 శాతం స్త్రీలు వెల్లడించారు. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా కేవలం 39 శాతం మంది మహిళలు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారని తేలింది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతో మగవారితో పోల్చుకుంటే కీళ్ల నొప్పులు, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత, కేన్సర్ల బారిన పడే అవకాశం మహిళల్లో ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. -
చైనా మగాళ్లకు ముందుంది మొసళ్ల పండగ!
మనదేశంలో స్తీ, పురుష జనాభా నిష్పత్తి ్రపమాదకర స్థితిలో ఉంది... ఇది అంతిమంగా అబ్బాయిల జీవితాలపై ప్రభావం చూపుతోంది, సామాజిక దుష్పరిణామాలకు దారి తీస్తోందని ఒకవైపు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో పక్కదేశం చైనాలో పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 1000:840 గా ఉంది చైనాలో పురుష, స్త్రీల జనాభా నిష్పత్తి! దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు పెళ్లిడుకొచ్చిన అబ్బాయిలు. వెయ్యిమంది అబ్బాయిల్లో 160 మందికి అమ్మాయి దొరికే పరిస్థితి లేదంటే... 120 కోట్ల పై బడ్డ జనాభా ఉన్న జనచైనాలో మొత్తం ఎంతమంది బ్రహ్మచారులుగా మిగులుతారో అంచనా వేయడానికి గణాంక నిపుణులు దిగిరావాలి! రానున్న రోజుల్లోఈ సమస్య మరింత తీవ్రస్థాయికి చేరుతుందని అంటున్నారు. 2030 నాటికి చైనాలోని పాతికశాతం మంది అబ్బాయిలకు పెళ్లి చేసుకొందామంటే, పిల్ల దొరికే పరిస్థితి ఉండదట. ఇది సామాజిక సంక్షోభానికి దారితీయవచ్చని, జనాభా నియంత్రణ అంటూ జననాల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యవహరించిన తీరే దీనికి కారణం అని విశ్లేషకులు అంటున్నారు.