breaking news
labour problems
-
ఏపీ విధానాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న విధానాలను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిన మహానుభావుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. కార్మిక విధానాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు.కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా కేంద్రం ఆలోచనలున్నాయని విమర్శించారు. కనీస వేతనాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్మిక వ్యతిరేక విధానాలపై జనవరి 8న పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకి పిలుపునిచ్చారు. సమ్మెలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొనాలని విజ్ణప్తి చేశారు. కార్మికులకి 21 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఉండాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను పోస్కోకి కట్టబెట్టడం దారుణమని గౌతంరెడ్డి మండిపడ్డారు. -
అక్రమాలకు హామీ!
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఉపాధి హామీ పథకం పేరుతో జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అవినీతి అంతాఇంతా కాదు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దోచేయడంతోపాటు పేదలకు అందాల్సిన ఉపాధి వేతనాలను కూడా ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పనులు చేపట్టకుండానే జరిగినట్టు చూపించేస్తున్నారు. తక్కువ పనిచేసి ఎక్కువ కొలతలు వేసి స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయి. కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలు దిగమింగేసిన దాఖలాలు అనేకం. చెరువుగట్లలో అవినీతి.. కూరగాయల పందిర్లలో అక్రమాలు.. ఉద్యానవన మొక్కల పెంపకంలో నిధులు స్వాహా.. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో అవకతవకలు.. నీరు చెట్టులో నాసిరకం పనులు.. సీసీ రోడ్ల పేరుతో దోపిడీ.. మరుగుదొడ్ల నిర్మాణాల్లో చేతివాటం... ఇలా ఒకటేమిటి ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులన్నీ అక్రమాలకు హామీగా మార్చేశారు. విచారణపేరుతో బోలెడు ఖర్చు జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సోషల్ ఆడిట్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వారు పనుల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏమేరకు నిధులు మింగేశారో తేల్చుతారు. అయితే దీనికోసం చేసే ఖర్చే ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క ఏడాదిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా రూ..300 కోట్లు ఖర్చుచేశారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో గడచిన ఎనిమిదేళ్లుగా జరిగిన అక్రమాలు పరిశీలించేందుకు చేసిన ఖర్చు దాదాపుగా రూ.5.60 కోట్లు. ఇంతా చేసి వీరు తేల్చిన అక్రమాల విలువ కేవలం రూ.4.10 కోట్లే. అంటే పరిశీలనకు అయ్యే ఖర్చుకంటే అక్రమాల విలువే తక్కువన్నమాట. రికవరీల్లో రాజకీయ జోక్యం జిల్లా వ్యాప్తంగా రూ.4.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించగా ఇంతవరకు రూ.1.52 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఈ విషయంలో రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. 16 మంది ఏపీఓలు, ఆరుగురు ఇంజినీరింగు కన్సల్టెంట్లు. 66 మంది టెక్నికల్ అసిస్టెంట్లు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసిన 10,447 మంది అక్రమాలకు పాల్పడినట్టు సోషల్ ఆడిట్లో తేల్చారు. కానీ రికవరీ విషయంలో మాత్రం తీవ్ర జాప్యం జరిగింది. కనీసం అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులైనా జారీ చేశారా అంటే అందులోనూ అలసత్వం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 34 మండలాలకు గాను 2017–18 ఆర్థిక సంవత్సరంలో 9 మండలాల్లో, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 30 మండలాల్లో సోషల్ ఆడిట్ జరిగింది. ఇందులో గుర్తించిన అక్రమాల విలువ రూ.2,35,21,296. అందులో నేటి వరకు రూ.20,30,788 రికవరీ చేశారు. అవినీతికి పాల్పడిన 986 మందికి నోటీసులు జారీచేశారు. అక్రమాలకు ‘బాట’లు ఉపాధిలో తమవారికి లబ్ధి చేకూర్చేందుకు అనువుగా మెటీరియల్ కాంపొనెంట్ పనులను తెరమీదకు తీసుకువచ్చారు. తెలుగు తమ్ముళ్లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఈ పనులు దక్కించుకుని పనులు చేయకుండానే బిల్లులు నొక్కేశారు. ఇక చంద్రన్న బాటల పేరుతో నిర్మించిన సీసీరోడ్లలో జరిగిన అవినీతి తారాస్థాయికి చేరుకుంది. అవసరం లేనిచోట్లకు కూడా నాశిరకం నిర్మాణాలు చేపట్టి అడ్డగోలుగా దోచుకున్నారు. పంటపొలాలకు... వ్యవసాయ పనులు చేసుకునే కళ్లాలకు ఇష్టానుసారం సిమెంట్ రోడ్లు నిర్మించారు. కానీ డబ్బులు మాత్రం మొత్తం కొట్టేశారు. కూలీలకు అందని వేతనాలు ఉపాధి హామీ పథకం పేరుచెప్పి కమీషన్లు వెనకేసుకుంటున్న ప్రజాప్రతినిధులు, అక్కమార్కుల పాలవుతున్న నిధులు కోట్లలో ఉంటే ఎండనకా, వాననకా కాయకష్టం చేస్తున్న ఉపాధి కూలీలకు మాత్రం అన్యాయం జరుగుతోంది. వారికి అందాల్సిన వేతనాలను నెలల తరబడి ఇవ్వకుండా ప్రభుత్వాలు వారిని పస్తులుంచుతున్నాయి. జిల్లాలో గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకూ నాలుగు నెలలకు రూ.100 కోట్ల బకాయి ఉంచింది. ఉపాధి హామీ పథకం వివరాలు: జిల్లాలో 921 పంచాయతీల్లో శ్రమశక్తి సంఘాలు: 42,432 జిల్లాలో ఉన్న జాబ్‌కార్డులు సంఖ్య:3.80లక్షలు కూలీలకు రావాల్సిన బకాయిల మొత్తం (4 నెలలకు): రూ.100 కోట్లు -
‘చెత్త’బండి.. నెట్టాలండి..
సంగారెడ్డి పట్టణంలో నిత్యం చెత్తసేకరించే ట్రాక్టర్ తరచూ మోరాయిస్తోంది. దీన్ని నెట్టలేక పారిశుద్ధ్య కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. రోజుకు ఐదారుసార్లు మొరాయిస్తోండడంతో మహిళా కార్మికులు సైతం నరకం చూస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి