breaking news
Labor contractor
-
లేబర్ కాంట్రాక్టర్ దారుణ హత్య
జిన్నారం (పటాన్చెరు): ఓ లేబర్ కాంట్రాక్టర్‌ను దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి కాల్చి దహనం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తంబాలపల్లి మండలం, కాయపల్లి గ్రామానికి చెందిన కుసుమ ఆదినారాయణ(36) కుటుంబం బతుకుదెరువు కోసం జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామానికి వలస వచ్చింది. ఇక్కడి పారిశ్రామికవాడ లోని ఓ పరిశ్రమలో లేబర్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో పాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసేవాడు. బుధవారం రాత్రి లేబర్ కోసం ఓ వ్యక్తిని కలవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రాత్రి 12 గంటలైనా తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు ఆదినారాయణకు సెల్‌ఫోన్‌కు చేయడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. మరుసటి రోజు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం కనిపించడంతో కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించగా.. అది ఆదినారాయణ మృతదేహంగా గుర్తించారు. బీరు బాటిళ్లను నోట్లో, మెడపై గుచ్చి, పెట్రోల్ పోసి కాల్చి చంపేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరో కక్షపూరితంగానే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరుకు తరలించారు. -
మేమెక్కడ పనిచెయ్యాలే?
► రాజన్న గుడి మెట్లపై కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా ► కాంట్రాక్టర్‌తో ముగిసిన ఒప్పందం ► ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ ► అధికారుల హామీతో ఆందోళన విరమణ వేములవాడ : మేమంతా ఎక్కడ పనిచెయ్యూలంటూ రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం గుడి మెట్లపై ధర్నా చేశారు. ఏడాదిగా ఆలయంలో పనిచేస్తున్నామని, ఇప్పుడు కాంట్రాక్టర్ గడువు ముగియడంతో పని ఇవ్వలేనని పేర్కొన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి నేరుగా దేవస్థానమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా సీఐటీయూ జిల్లా నాయకులు గుర్రం అశోక్ నిలిచారు. ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 109 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా, పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయూలని కోరారు. నెల కు రూ.5,500 చెల్లిస్తున్న ఆలయ అధికారులు కార్మికులతో వెట్టిచాకిరీ చేరుుంచుకుంటున్నార న్నారు. రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వద్దకు ఏఈవో హరికిషన్, శానిటరీ అధికారి బుద్ధి భగవాన్, నగరపంచాయతీ వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ చేరుకుని ఈవో రాగానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. ముగిసిన ఒప్పందం ఆలయంలో వివిధ పనుల నిర్వహణ కు గతేడాది ఏప్రిల్ 1 నుంచి 2016, మార్చి 31 వరకు కార్మికుల సరఫరాకు సిరిసిల్లకు చెందిన అంబేద్కర్ మ్యూచువల్లీ ఏడెడ్ లేబర్ కాంట్రాక్టు కో-ఆపరేటివ్ సొసైటీతో ఒప్పందం చేసుకున్నారు. సదరు కాంట్రాక్టర్ రాంచందర్ 109 మంది కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన ఆలయంలో పనులకు నియమించుకున్నారు. తన గడువు ముగుస్తుంద ని, రానున్న కాలంలో అనుభవం ఉన్న సొసైటీలకే అవకాశం ఇవ్వాలని ఫిబ్రవరి 15న ఆలయ అధికారులకు కాంట్రాక్టర్ లిఖిత పూర్వకంగా విన్నవించారు. అరుుతే తనకు ఆలయం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి కార్మికులకు తనకు సంబంధం లేదని తెలిపినట్లు తెలిసింది. దేవస్థానమే నేరుగా చెల్లించాలి మేమెంత పని జెప్పినా వెనుకాడుత లేదు. దేవుని దగ్గరికి వచ్చే భక్తులకు వసతులు మంచిగా ఉండేలా చూస్తున్నం. కాంట్రాక్టు విధానం రద్దు చేసి మాకు దేవస్థానం సార్లే నేరుగా జీతాలు ఇవ్వాలి. - పెరిగె దేవమ్మ, కాంట్రాక్టు కార్మికురాలు