breaking news
L.. Ramana
-
నియంతృత్వ పోకడలతో పాలిస్తున్నారు : ఎల్.రమణ
సీఎం కేసీఆర్‌ను విమర్శించిన ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని విస్మరించి నియంతృత్వ పోకడలతో సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని టీటీడీపీ నేత ఎల్.రమణ ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ విలీన ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో జాతీయ జెండాను రమణ, టీటీడీపీ జెండాను మరో నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఎగురవేశారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే జరపాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని మీడియాకు పార్టీనేత పెద్దిరెడ్డి వినిపించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కొత్తకోట దయాకరరెడ్డి, సీతా దయాకరరెడ్డి, నర్సిరెడ్డి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. టీటీడీపీ రైతు దీక్ష 26కు వాయిదా: ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన రైతు దీక్షను రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 26, 27 తేదీల్లో నిర్వహించాలని టీటీ డీపీ నిర్ణయించింది. -
రమణకే సైకిల్ సారథ్యం
జగిత్యాల, న్యూస్‌లైన్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్యం జగిత్యాల ఎమ్మెల్యే ఎల్.రమణకే దక్కింది. టీటీడీపీ అధ్యక్షుడిగా ఆయన సోమవారం నియమితులయ్యారు. యువకుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రమణ మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. బీసీ నాయకుడైన రమణకు టీటీడీపీ పగ్గాలు అప్పగించడం ద్వారా బీసీ కార్డు ఎన్నికల్లో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే.. ఒకమారు ఎంపీ 1994లో తొలిసారి టీడీపీ తరఫున జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రమణ పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి పదవిని చేపట్టారు. 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి జీవన్‌రెడ్డిని ఓడించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ొనసాగుతున్నారు. మొన్నటిదాకా టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. యువకుడిగా రాజకీయ అరంగేట్రం యువకుడిగా ఉన్నప్పుడే పలు కార్యక్రమాల్లో రమణ పాల్గొనేవారు. జగిత్యాల డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా ఉన్న ఆయన ప్రతిభను గుర్తించి టీడీపీ టికెట్టు ఇచ్చారు. 1994లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి జిల్లాలో ఉన్న తన సామాజికవర్గంతోపాటు బీసీ వర్గాల్లో పట్టు సాధించా రు. పార్టీ జిల్లా బాధ్యతలు నిర్వహించారు. భవితవ్యం ఏమిటో..? రాయికల్ : రమణకు టీటీడీపీ పగ్గాలు దక్కినప్పటికీ.. నియోజకవర్గంలో క్రమంగా పట్టు జారిపోతోంది. తెలంగాణలోని టీడీపీ సీనియర్ నాయకులంతా ఇతర పార్టీలకు వలస వెళ్తున్నా రు. జిల్లాలో టీడీపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రమ ణ కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో నిరాశ చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వైపు వెళ్లారు. రాయికల్, సారంగాపూర్, జగిత్యాల మండలాల్లో టీడీపీపీకి ఎంపీటీసీ అభ్యర్థులు దొరకలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రమణ నెగ్గుకురావడం అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.