సుకుమార్‌కు కె.వి.రెడ్డి పురస్కార ప్రదానం
సినీ దర్శకుడు సుకుమార్‌ను ‘యువ కళావాహిని’ కె.వి.రెడ్డి చలనచిత్ర దర్శక పురస్కారంతో సత్కరించనుంది. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిలింల్యాబ్స్లో జరగనుంది.
సారిపల్లి కొండలరావు అధ్యక్షతన ఏర్పాటవుతున్న ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య ముఖ్యఅతిథిగా, ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం.కాంతారావు గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ సభను ప్రారంభిస్తారు. కె.రాఘవ, బి.గోపాల్, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.