breaking news
kurnool zp meeting
-
ఆ మోటార్లు ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?
-
పనిచేయని మోటార్లు ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హంద్రీ నీవా మోటార్లను పట్టిసీమకు తరలించిన అంశంపై చర్చ రావడం కేఈ ఆగ్రహానికి కారణమైంది. మోటార్లను రహస్యంగా ఎందుకు తరలించారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రశ్నించారు. మీకు తెలియకుండానే మోటారును ఎలా తరలిస్తారని కేఈపై మండిపడ్డారు. దాంతో డిప్యూటీ సీఎం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. హంద్రీ నీవాకు నీళ్లు కావాలంటే నాలుగు రోజుల్లో మోటారు తీసుకొస్తామని చెప్పారు. అయినా, అసలు పనిచేయని మోటార్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.