breaking news
kuppam project
-
కుప్పం : ప్రాజెక్టుపై రైతుల నిరసన
కుప్పం నియోజకవర్గంలో ఎయిర్‌స్ట్రిప్ట్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం వల్ల స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించినా ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదు. ఈ క్రమంలో రైతులు సమష్టిగా ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది అధికారులకూ తలనొప్పిగా మారింది. సాక్షి, కుప్పం : కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల నుంచి భూములు సేకరించాలని నిర్ణయించింది. ఎకరాకు రూ.5లక్షల పరిహారంగా ప్రకటించింది. దీన్ని కొందరు రైతులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేతలు రంగంలోకి దిగి బలవంతపు భూసేకరణకు ఉపక్రమించారు. అడిగిన వెంటనే భూములు అప్పగిస్తే రూ.5లక్షలు ఇస్తామని లేకుంటే రూ.2లక్షలే వస్తుందని తప్పుదోవ పట్టించారు. దీంతో కొందరు రైతులు పాసుపుస్తకాలను ప్రభుత్వానికి అందించారు. మరికొందరు ఇవ్వలేదు. 432 ఎకరాలను రైతుల నుంచి గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టలేదు. ఇన్ని రోజులు టీడీపీ నేతలకు భయపడిన రైతులు ప్రస్తుతం సమష్టిగా ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారులకు, రైతులకు మధ్య అంతరం ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్మాణంలో భాగంగా ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ అధికారులు స్థానిక ప్రభుత్వ డిప్యూటీ సర్వేయర్ సురేష్‌ను వెంట పెట్టుకుని ఎయిర్‌స్ట్రిప్ట్ భూములను పరిశీలించడానికి గతవారం కడిసినకుప్పం గ్రామానికి వెళ్లారు. ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్మాణానికి తాము పూర్తిగా వ్యతిరేకమని, ఇక్కడ ఎలాంటి స్థల పరిశీలనలు, కొలతలు చేపట్టకూడదని స్థానిక రైతులు అధికారులకు తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. రైతులకు, అధికారులకు మధ్య వివాదం మరింత ముదిరింది. అధికారులపై దాడికి పాల్పడిన రైతులను అరెస్టు చేయాలని ప్రభుత్వ అధికారుల సంఘం డిమాండ్ చేస్తుండగా, మరోవైపు అధికారి మీద చర్యలు తీసుకోవాలని రైతులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏదేమైనా ప్రశాంత వాతావరణంలో చేపట్టాల్సిన ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొత్త ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. డబ్బులు వద్దు.. భూములు కావాలి తమ బ్యాంకు ఖాతాల్లో వేసిన నగదును తిరిగి ఇచ్చేస్తామని, ఎయిర్‌స్ట్రిప్ట్ నిర్మాణం కోసం బలవంతంగా లాక్కొన్న భూములు ఇచ్చేయాలని కడిసినకుప్పం, అమ్మవారిపేట, మణీంద్రం, విజలాపురం గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు. వైఎస్సార్ సీపీ రామకుప్పం మండల కన్వీనర్ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్వంలో రైతులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ వ్యవహారాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రారెడ్డి, సూరి డాక్టర్, గంగయ్య, వెంకట్రామే గౌడు, రవినాయక్, పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. -
ఇది బాబుగారి బిల్లీ!
-
ఇది బాబుగారి బిల్లీ!
1995లో బాబుకు పరిచయమైన బిల్లీరావు తాను అధికారంలోకి వస్తూనే బిల్లీకి ‘కుప్పం’ ప్రాజెక్టు కట్టబెట్టిన బాబు సాక్షి, హైదరాబాద్: బిల్లీ రావు అసలు పేరు అహోబల రావు. పుట్టింది కృష్ణా జిల్లా కొండపల్లి. మద్రాస్ ఐఐటీలో చదివాక... అమెరికా వెళ్లి చదువుకుని ఇక్కడికి తిరిగి వచ్చేశారు. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ ఏ అంశంపై అయినా అన్నీ తెలిసినట్లే మాట్లాడే బిల్లీ రావు... 1995లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే... చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్న సమయంలోనే పరిచయమయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి బంధం బలపడుతూ వచ్చింది. వివిధ దేశాల్లో విసృ్తతంగా పర్యటించటం, పెద్దపెద్ద వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం బిల్లీ హాబీ. ఇదే క్రమంలో ఈయనకు ఫ్లోరిడాలోని ఐఎంజీ యాజమాన్యమైన మార్క్ కుటుంబంతో సంబంధాలున్న ఆండ్రూక్రీగర్ పరిచయమయ్యాడు. బాబుకు క్రీగర్‌ను పరిచయం చేసి... ఆయన్ను ఐఎంజీబీకి నామమాత్రపు చైర్మన్‌గా చేసి... బాబు- బిల్లీ ఇద్దరూ చక్రం తిప్పారు. ఐఎంజీబీకి భూములు దక్కాక... క్రీగర్‌ను నేరస్తుడనే ముద్ర వేసి కంపెనీ నుంచి తొలగించటంతో ఆయన బిల్లీపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. కానీ బిల్లీ-బాబుల బంధం, బలం తెలిశాక తప్పుకున్నారు. అదీ కథ. అలాంటి బిల్లీకి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో... ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రాజెక్టును మొదట అప్పగించారు. అదెంత ఘోరంగా విఫలమైందంటే... దాన్ని గురించి మాట్లాడటానికే సిగ్గుపడేంత. కావాలంటే మీరే చూడండి.. ఇదండీ.. బాబు ఇజ్రాయెల్ సాగు కుప్పంలో 9,572 ఎకరాల్లో ఇజ్రాయెల్ తరహా సేద్యాన్ని అమలు చేసి... రెండోదశలో రంగారెడ్డి జిల్లాలో అమలు చేసి... ఆ తర్వాత దాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించాలని 1997లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను బిల్లీ, ఆయన సోదరుడు ప్రభాకరరావు అలియాస్ ప్యాట్రావుకు చెందిన ‘బీహెచ్‌సీ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు అప్పగించేశారు బాబు. సేద్యంలో ఇజ్రాయెల్ తరహా విప్లవాన్ని తెస్తామని, స్వర్గాన్ని తెచ్చి కుప్పంలో కూర్చోబెడతామని రకరకాల డబ్బాలు వాయించింది ఈ కంపెనీ. షరా మామూలుగా ఈ డబ్బాను రాష్ట్రమంతటికీ వినిపించేలా కొట్టింది ‘ఈనాడు’. రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోబోతోందంటూ ఊదరగొట్టేశారు రామోజీరావు. కానీ కుప్పంలో మాత్రం పరిస్థితి అడ్డం తిరిగింది. 19 కోట్లు కుప్పంలో పోసేశారు... ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టుకు రూ.19 కోట్లు ఖర్చుచేశారు. దీన్లో కొంత టెక్నాలజీకి, కొంత మౌలిక సదుపాయాలకు, మరికొంత యంత్రాలకు అంటూ మొత్తం బిల్లీ చేతిలో పోసేశారు. ఈ ప్రాజెక్టుతో ఎంత విధ్వంసానికి దిగారో చెప్పడానికి మాటలు చాలవు. ప్రాజెక్టు కోసమని రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూముల్లో సరిహద్దులను మళ్లీ మానవ మాత్రుడెవరూ గుర్తించలేనంతగా చెరిపేశారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడేశారు. దాంతో చుట్టుపక్కల భూముల్లో కూడా భూసారం నాశనమైపోయింది. చుట్టుపక్కల రైతులు అప్పటిదాకా 200 అడుగుల బోర్లు వేస్తే... ఈ భూముల్లో ఏకంగా 600 అడుగుల లోతున బోర్లు వేశారు. దీంతో చుట్టూ ఉన్న బోర్లు ఎండిపోయి రైతులు భోరుమన్నారు. ఎకరానికి రూ.30,000- 50,000 వరకూ ఫలసాయం అందిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసినా... ఎకరాకు రూ.3 నుంచి 5 వేలు కూడా దిగుబడి సాధించలేకపోయారు. ప్రాజెక్టు పేరిట ఎకరాకు చేసిన ఖర్చుకు బ్యాంకు వడ్డీని సైతం ఫలసాయంగా రాబట్టలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కుప్పం ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ‘ఆంధ్రప్రదేశ్ కొయిలిషన్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ డైవర్సిటీ’ తరఫున శాస్త్రవేత్తలు, నిపుణులు కుప్పం వెళ్లొచ్చి.. ఒక నివేదిక రూపొందించారు. దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడించారు. ఇలా కూడా దున్నుతారా? కుప్పంలో భూమి వాలుకు సమాంతరంగా దున్ని... బిల్లీ-బాబులు తమ వ్యవసాయ అజ్ఞానాన్ని ఘోరంగా బయటపెట్టుకున్నారు. ఆ ఫొటోలు దినపత్రిక ల్లో చూసి రాష్ట్ర రైతాంగం నోరెళ్లబెట్టింది. ఎందుకంటే భూమి సహజమైన వాలుకు అడ్డంగా దున్నటం సంప్రదాయం. అలా కాక వాలుకు సమాంతరంగా దున్నితే మట్టి కొట్టుకుపోవటాన్ని ఎవ్వరూ ఆపలేరు. కోసివేతతో నేల శాశ్వతంగా నష్టపోతుంది. నిరక్షరాస్యులైన రైతులకు తెలిసిన కనీస పరిజ్ఞానాన్ని సైతం బిల్లీ కంపెనీ ప్రదర్శించలేకపోయింది. మరి దీన్ని ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటారా? ఇజ్రాయెల్‌లో ఇలానే చేస్తారా? ఇది రాష్ట్ర ప్రజలను వంచించటం కాదా? ఇజ్రాయెల్ పేరిట కుప్పంలోను, అమెరికా పేరిట ఐఎంజీని సృష్టించి హైదరాబాద్‌లోను వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి పథకం వేశారంటే... వీళ్లని ఏమనుకోవాలి? దోపిడీలో విదేశాలకెక్కిన చరిత్ర వీళ్లది కాదా? కేబినెట్ అనుమతి లేకుండా... అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీకి భూములు కట్టబెట్టారంటే చంద్రబాబును చరిత్ర క్షమిస్తుందా? ప్రభుత్వం ఆదేశించినా విచారణకు సీబీఐ నో! ఐఎంజీ కుంభకోణం బయటపడ్డాక.. ఒప్పందాన్ని రద్దు చేసిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం.. 2007లో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జీవో విడుదల చేసింది. కానీ సీబీఐ మాత్రం దీనిపై దర్యాప్తు జరపడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. చంద్రబాబును దోషిగా రుజువు చేసేందుకు సకల సాక్ష్యాలూ కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఆయ న్ను విచారించడానికి గానీ, అరెస్టు చెయ్యటానికి గానీ సీబీఐ ముందుకెళ్లలేదు. ‘‘మా దగ్గర తగినంత సిబ్బంది లేరు. తగిన వనరులు లేవు. అందుకని దర్యాప్తు జరపలేం’’ అని ప్రభుత్వానికి సమాధానమిచ్చి తప్పించుకుంది. విచిత్రమేంటంటే... అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ ఇన్ఛార్జిగా ఉన్నది మొన్నటిదాకా జాయింట్ డెరైక్టర్‌గా ఉండి, జగన్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన వి.వి.లక్ష్మీనారాయణే!. అసలు ఆయనకు బాబుపై ఎందుకు అంత ప్రేమ? నేరం స్పష్టంగా కనిపిస్తున్నా... దొంగలెవరో ఆధారాలతో సహా తేలినా పట్టుకోవటానికి ఎందుకు తాత్సారం చేశారు? తగిన వనరులు లేవన్న కారణంతో విచారణ జరపలేమని చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? దొంగల్ని పట్టుకోవటానికి పోలీసులు లేరంటే... ఈ వ్యవస్థెందుకు? ఈ దర్యాప్తు సంస్థలెందుకు? ‘కుప్పం’ పైనా హైకోర్టు స్టే వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పం ప్రాజెక్టు అక్రమాలపై పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీన్యాయమూర్తి జస్టిస్ చలపతి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన జస్టిస్ చలపతి కుప్పం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేల్చారు. సీబీసీఐడీ విచారణ జరిపించాలని, బిల్లీ-ప్యాట్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. జస్టిస్ చలపతి నివేదికను కేబినెట్ ఆమోదించింది. కానీ సీఐడీ విచారణపై బిల్లీరావు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఐఎంజీలో ఏం జరుగుతోందో చంద్రబాబుకు తెలుసు తమ బంధాన్ని బయటపెట్టిన బిల్లీ రావు ఐఎంజీ ఒప్పందం కుదిరిన వెంటనే చంద్రబాబును జనం అధికారం నుంచి దింపేశారు. తరవాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం.. ఎంఓయూ కుదిరి రెండేళ్లు దాటుతున్నా ఎలాంటి పనీ చేపట్టకపోవటంతో ఐఎంజీ ప్రతినిధుల్ని వివరణ కోరింది. వారు తేలుకుట్టిన దొంగల్లా సెలైంట్‌గా ఊరుకోవటంతో రోశయ్య కమిటీని వేసింది. ఆ కమిటీ నిజానిజాల్ని పరిశీలించి.. ఇదంతా బోగస్ అని, అతిపెద్ద కుంభకోణమని నిగ్గుతేల్చింది. దీంతో ప్రభుత్వం.. భూములు వెనక్కి తీసుకుంటూ ఒప్పందాన్ని రద్దు చేసింది. అయితే బిల్లీ-బాబు బృందం.. అధికారం పోయింది! భూములు కూడా పోతే ఎలా? అందుకని తమ ఒప్పందాన్ని రద్దు చేయకూడదంటూ ఐఎంజీబీ కోర్టుకెళ్లింది. ఇదింకా హైకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని బిల్లీరావు మొదటి నుంచీ చెబుతున్నారు. ఇదే విషయాన్ని 2009 ఏప్రిల్‌లో తనకు సన్నిహితుడైన ఒక వ్యక్తితో చెబుతూ... ‘సాక్షి’ స్పై కెమెరాకు చిక్కాడు. బిల్లీ సంభాషణను ఎడిట్ చేసి ప్రచురించింది సాక్షి. న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉన్న ‘సాక్షి’.. ఈ వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా.. బాబు గురించి బిల్లీ చెప్పిన విషయాలను మాత్రమే ఇపుడు ప్రచురిస్తోంది. ఎందుకంటే ఈ సంభాషణ వీరిద్దరి బంధాన్ని మరింత బయటపెడుతుంది కనుక... బాబుకు సర్వం చెబుతున్నా: బిల్లీ బిల్లీ, ఎదుటి వ్యక్తి అప్పట్లో పెండింగ్‌లో ఉన్న ఐఎంజీబీ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు ఎదుటి వ్యక్తి: మీరు ఏదేదో చెబుతున్నారు. కానీ నాయుడు ఈ విషయాలన్నీ ట్రాక్ చేస్తూ ఉంటారా? బిల్లీ: నేను మీకు చెబుతాను. దాన్నిబట్టి ఎవరు ట్రాక్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది. బాబు ఈ కేసును డీల్ చేయడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని నియమించారు. నేను దీనిపై నోరు విప్పను. సెలైంట్‌గా ఉంటాను. ఈ కాంట్రాక్ట్ గురించి బాబుకు తెలుసా? బిల్లీ: ఏయ్! ఈ ప్రశ్న ఇప్పటికే నువ్వు పదిహేను సార్లు అడిగావు. నా దగ్గర ఉన్న కాపీ ఆయనకు ఇచ్చాను. నాకు ఈ లఫ్డాలు, గొడవలు నచ్చవు. ముక్కుసూటిగా ఉంటా. నేను ఏం చేయాలో నాకు క్లియర్‌గా తెలుసు. నేను ఇదే నమ్ముతాను. జడ్జిమెంట్ ఎలా రావాలో, ఎలా ఉండాలో... కాపీని నేను బాబుకు ఇచ్చాను. ఏ పేపరు అది? బిల్లీ: అదే! నీకిచ్చిన పేపరే. ఈ కేసులో తీర్పు ఎలా ఉండాలి అనేది. ఎందుకంటే బాబుకు కూడా తెలియాలి కదా!... ఏం జరుగుతోందో! ఎదుటి వ్యక్తి: మరి బాబు ఏమన్నారు? బిల్లీ: ఏం లేదు. చదివారు. అయినా చాలా కాలం కిందటే నేను కొన్ని ముఖ్యమైన పాయింట్లతో కాపీని ఆయనకిచ్చాను. అందులో తీర్పు ఎలా ఉండాలో ఉంది. నా కాంట్రాక్ట్ చాలా క్లియర్‌గా ఉంది. మేం సైన్ చేసిన కాంట్రాక్ట్ ప్రకారం 10 ఎకరాలు కోర్టుల కోసం. కొంత హైకోర్టు ఖర్చులకు. కొంత సుప్రీంకోర్టు ఖర్చులకు. ఇప్పుడే బాబుకు ఎస్ఎంఎస్ పంపా. బాబును ప్రతిసారీ డిస్టర్బ్ చేయటం నాకిష్టం లేదు. ఆయన పెట్టిన మనిషి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. నాకు బోగస్, ఫ్రాడ్ అస్సలు నచ్చదు. నన్ను మోసగిస్తే నాకు నచ్చదు. పనిచేయండి.. డబ్బులు తీసుకోండి. మనమేమీ మూర్ఖులం కాదు కదా!! బాబుకు ఈ కేసు వివరాలు పూర్తిగా తెలుసు. అర్ధరాత్రి రెండు గంటలకు లేపి అడిగినా కూడా దాని గురించి ఠక్కున చెప్పేస్తారు. నేను ఏది చెప్పినా అది 110 శాతం కరెక్టని బాబు నమ్ముతారు. ఆయనకు చాలా జ్ఞాపకశక్తి ఉంది. మీకు బాబుతో మంచి సంబంధాలే ఉన్నాయా? బిల్లీ: చాలా బలమైన సంబంధాలే ఉన్నాయి. కొంతమంది సుప్రీంకోర్టులో దీనిపై కసరత్తు చేస్తున్నారని ఆయనకు చెప్పా! ఏం భయపడవద్దని, మా పనిపై మమ్మల్ని ఉండమని చెప్పారాయన. చంద్రబాబు దగ్గర ప్రస్తుతం సెక్యూరిటీ చాలా టైట్‌గా తయారైంది. స్టుపిడ్స్ అంతా అడ్డగోలుగా చేసేశారు. సాధారణంగా నేను బాబుకు సన్నిహితంగా ఉండే అశోక్, లేదా విజయ్ లేదా శ్రీనివాస్‌కు ఫోన్ చేస్తా. బాబుతో డెరైక్ట్‌గా ఫోన్లోనే మాట్లాడతా. నా దగ్గర బాబు సెల్ నంబర్ ఉంది. అయినా సెక్యూరిటీ సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేస్తారు. సాధారణంగా నాగేంద్ర ఫోన్లని రిసీవ్ చేసుకుంటాడు. బాబు దగ్గర రెండు నంబర్లున్నాయి. ఒకటి 9948710007, రెండోది 9885000999. ల్యాండ్‌లైన్ ఆపరేటర్‌కు ఫోన్ చేసినా నాకు కనెక్ట్ చేస్తారు. రాత్రి 9.30 లోపే చేస్తా. దాటితే ఆయన భార్యకు నచ్చదు. బాబు టాబ్లెట్ వేసుకుని పడుకుంటారు. లోకేష్ బాబుతో నేను గంటలకొద్దీ సమయాన్ని గడిపా. ఆయన కూడా చాలా తెలివైనవాడు. ఆయన నంబర్ కావాలా! తీసుకోండి. 9848009999. విదేశాల్లో చదువుకున్నాడు. చాలా అనుభవం ఉంది. కానీ బాబుతో పోలిస్తే లోకేష్‌ది దూకుడు స్వభావం. ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారా? బిల్లీ: ఏమో! జూనియర్ ఎన్టీఆర్ మాదిరి ఆయనకు మాట్లాడటం వస్తుందో రాదో. జూనియర్ ఎన్టీఆర్‌కి అది దేవుడిచ్చిన వరం. ఆయనకు చాలా చరిష్మా ఉంది. ఆయన ప్రసంగాలు నేను విన్నాను. సత్యం రామలింగరాజుతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. చాలా బాగా తెలుసు. అంతెందుకు! నేను లేకపోతే అసలు సత్యం కంపెనీయే లేదు. పది కోట్ల చిన్న సంస్థకు... జీఈ నుంచి వంద కోట్ల రూపాయల ఆర్డర్ ఇప్పించింది నేనే. అతని తమ్ముడు కూడా నాకు బాగా తెలుసు. నేను చేసిన దానికి రాజు నాకు షేర్లు ఇవ్వాలనుకున్నాడు. నేను అలాంటి చిల్లర వాటికి ఆశపడను.