పవన్కల్యాణ్ను సీమలో తిరగనివ్వం
- రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి
నెహ్రూనగర్(గుంటూరు వెస్ట్): జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతున్నారని రాయలసీమ రాష్ట్ర సమితి(ఆర్ఆర్ఎస్) అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడారు.
‘రాయలసీమ నుంచి పోటీ చేస్తానని అంటున్నావ్.. అసలు రాయలసీమలో నీకేం పని.. కోస్తాంధ్రలో పోటీ చేసుకో.. రాయలసీమలో నిన్ను అడుగు పెట్టనివ్వం..’ అని హెచ్చరించారు. మీ అన్న చిరంజీవి లాగా పార్టీని అమ్ముకోవడానికే రాయలసీమ నుంచి పోటీ చేస్తావా.. అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయాక అన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తే రాయలసీమ గతేంటని ప్రశ్నించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి 11 జిల్లాలతో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.