breaking news
kshetram
-
రాజ్యసభలో ‘కాశీనాయన’ కూల్చివేతల ప్రస్తావన.. గళమెత్తిన వైఎస్సార్సీపీ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: కాశీనాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఎంపీ మేడా రఘునాథరెడ్డి అన్నారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కాశీనాయన క్షేత్రం ప్రాంతాన్ని అటవీ శాఖ నుంచి డీనోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రం కార్యకలాపాల కోసం 33 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం.. ఆధ్యాత్మికవేత్తలకు దివ్యానుభూతిని కలిగిస్తోంది. ఏ సమయంలో వెళ్లినా అన్నదానం జరుగుతుండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే అనాథలకు ఇది ఆకలి తీర్చే ఒక దేవాలయం. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు కొనసాగుతున్నాయి. అయితే అటవీ ప్రాంతం పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇప్పటికే సత్రాలు, వాష్ రూమ్‌లను కూల్చివేశారు.గతంలో అటవీ శాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకూ వెళ్లలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు.అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వెనుకా ముందు చూడకుండా కూల్చివేతలు చేపట్టింది. నెల్లూరు జిలాకు చెందిన కాశినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు. కాశినాయన పరమపదించాక 1995 నుంచి జ్యోతిక్షేత్రం... కాశినాయన క్షేత్రం అయ్యింది. ఇక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలకు గతంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి సైతం సహకారం అందించడం గమనార్హం. -
విజయనగరంలోని రామక్షేత్రంలో శివనామస్మరణ
-
శివ...శివా... చూడవయ్యా ఈ సిత్రాలు
మూడునాళ్ల ముచ్చటగా అభివృద్ధి పనులు పది రోజులు గడవక ముందే గోతులు పడ్డ ఫ్లోరింగ్ పంచారామ క్షేత్రంలో నాసిరకంగా అభివృద్ధి పనులు నేడు ఉప ముఖ్యమంత్రి రాజప్ప సమీక్ష సమావేశం సామర్లకోట : పంచారామ క్షేత్రంలో అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పనులు పూర్తి చేసి పది రోజులు గడవక ముందే పెచ్చులూడిపోతుండడం పట్ల అటు భక్తులు, ఇటు ఆలయ పాలకవర్గం, అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో బుధవారం నిర్వహించే సమీక్ష సమావేశంలో ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రూ.కోటితో అభివృద్ధి పనులు పురాతన క్షేత్రం కావడంతో పురావస్తు శాఖ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఆలయం అభివృద్ధికి రూ.కోటి నిధులు విడుదల కావడంతో ఆ శాఖ ఆధ్వర్యంలోనే పనులు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో గార్డెన్ పెంపకం పనులు పూర్తి చేశారు. కోనేరు వరకూ సీసీ రోడ్డు, కోనేరు చుట్టూ మెట్లు ఏర్పాటు చేశారు. కోనేరు దిగువ భాగంలో జిగురు మట్టి ఉండటం వల్ల లోనికి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోనేరులో ఉన్న మట్టిని పూర్తిగా తొలగించి ఇసుక వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కోనేరు అభివృద్ధికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ఓ దాత కూడా ముందుకు వచ్చారు. కోనేరు మధ్యలో ఉన్న మండపం పైనుంచి ఆకతాయిలు కోనేరులోనికి దూకుతున్నారు. ఇప్పటి వరకు జిగురు మట్టిలో కూరుకుపొయి ఇద్దరు యువకులు మృతి చెÆందారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు కోనేట్లో పుణ్య స్నానాలు చేస్తారు. మహాశివరాత్రి నాటికి ఇసుకు వేసి భక్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు కొరుతున్నారు. నాసిరకంగా ప్లోరింగ్ పనులు ఆలయ ఆవరణలో ప్లోరింగ్ పనులు నాసిరకంగా జరిగాయి. ఆలయ దిగువ భాగంలోని ఉప ఆలయాల చుట్టూ ఫ్లోరింగ్ పనులను గానుగు సున్నంతో చేశారు. పనులు పూర్తి చేసిన 10 రోజులు గడవక ముందే ఫ్లోరింగ్ పెచ్చులూడిపోయి గోతులు ఏర్పడటంతో ట్రస్టు బోర్డు సభ్యులు, భక్తులు ముక్కున వేలు వేసుకున్నారు. గోతులు పడ్డ ప్రదేశంలో తిరిగి మరమ్మతులు చేయడం వల్ల అందంపోయి అతుకులు వేసిన్నట్టు ఉంటుందని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఆలయ ప్రవేశంలో మెట్లు, గణపతి ఆలయం, శ్రీకుమారస్వామి ఆలయం వద్ద ఫ్లోరింగ్‌పై గోతులు పడ్డాయి. మొదటి అంతస్తులో ప్రాకారం చుట్టూ చేసిన ఫ్లోరింగ్ కూడా పాడై పోయింది. పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు నాసిరకంగా జరిగాయని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద కూడా పనులు కూడా నాసిరకంగానే ఉన్నాయనని చెబుతున్నారు. ఫ్లోరింగ్ పనులకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి పురావస్తు శాఖ సీఐ దృష్టికి తీసుకు వెళ్లారు. కోనేరులో ఇసుక వేయాలి పంచారామ క్షేత్రం కోనేరులో భక్తులు స్నానాలు చేస్తుంటారు. మహాశివరాత్రి రోజున వేలాది మంది స్నానాలు చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోనేరులో జిగురు మట్టిని తొలగించి ఇసుక వేయాలి. కొత్త నీటితో కోనేరును నింపాలి. - నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు, సామర్లకోట అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఫ్లోరింగ్ పనులు నాసిరకంగా జరిగిన మాట వాస్తవమే. దీనిపై ట్రస్టు బోర్డుతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యను పరిష్కారిస్తాం. - కంటే జగదీష్‌మోహనరావు, ట్రస్టు బోర్డు చైర్మన్, సామర్లకోట