breaking news
kristhurajapuram
-
బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సాక్షి, విజయవాడ : నగరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రీస్తురాజపురం ప్రాంతానికి దివ్య తేజస్విని ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్న నాగేంద్రబాబు అలియాస్ స్వామి కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. తన ప్రేమను నిరాకరించిందని కక్ష కట్టిన స్వామి.. గురువారం యువతి ఇంటికి వెళ్లాడు. ఇదే విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో కోపోద్రేకుడైన స్వామి కత్తితో దివ్య తేజస్వినిపై దాడి చేశారు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, దాడి చేసిన అనంతరం స్వామి తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం స్వామి కూడా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మృత్యుంజయురాలైన విజయవాడ మహిళ
విజయవాడ: ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఓ మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. విజయవాడ క్రీస్తురాజపురంలోని అరుణ అపార్ట్మెంట్ లో వల్లూరు విజయలక్ష్మి(37) దంపతులు నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆమె దండేనికి ఆరేసిన బట్టలు తీస్తుండగా పట్టుతప్పి ఐదో అంతస్తులోంచి జారిపడ్డారు. అలా మూడో అంతస్తులోని గ్రిల్స్ మధ్యలో ఆమె కాలు ఇరుక్కోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు 108, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. తలకిందులుగా వేలాడుతూ ఆమె చేసిన ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గ్రిల్స్‌కు వేలాడుతున్న ఆమెను కిందికి దించారు. అనంతరం విజయలక్ష్మిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె చేయి, కాలు ఫ్రాక్చర్ అయ్యాయి.