breaking news
krishnaveni reddy
-
కృష్ణవేణి రెడ్డికి ‘సాక్షి’ అభినందనలు
సాక్షి, ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో విజయం సాధించి తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కందిగ కృష్ణవేణిరెడ్డిని సాక్షి ఫైనాన్స్ అండ్ అడ్మిన్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి అభినందించారు. గత వారం జరిగిన బీఎంసీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందిన కృష్ణవేణి రెడ్డి వార్డు నంబర్ 174 నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. సాక్షి ముంబై కార్యాలయంలో రెండేళ్ల కిందటి వరకు కృష్ణవేణి ఆపరేటర్‌గా విధులు నిర్వహించారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన అనంతరం ‘సాక్షి’ టీమ్‌కు కృతజ్ఞత తెలిపేందుకు ఆమె గురువారం ముంబై దాదర్‌లోని సాక్షి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వైఈపీ రెడ్డితోపాటు సాక్షి ముంబై యూనిట్ ఆమెకు పుష్పగుచ్చం అందించి అభినందిం చారు. ఆమె రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. ఒక సాధారణ గృహిణి అయిన కృష్ణవేణి రెడ్డి సాక్షి ఆపరేటర్ నుంచి కార్పొరేటర్‌గా ఎదగడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమని వైఈపీ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణి రెడ్డి కూడా సాక్షిలో ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన సమయంలోని అనుభూతులను నెమరవేసుకున్నారు. -
కృష్ణవేణి.. తెలుగోడి వాణి..
► ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా కృష్ణవేణిరెడ్డి గెలుపు ► తొలిసారి తెలుగువారికి ప్రాతినిథ్యం.. ► ‘సాక్షి’లో ఒకప్పుడు ఆపరేటర్.. ఇప్పుడు కార్పొరేటర్ సాక్షి ముంబై: తెలుగు వారికి అందని ద్రాక్షగా మిగిలిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి ప్రాతినిథ్యం దక్కింది. బీఎంసీలో వార్డు నంబర్ 174 నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన కందిగ కృష్ణవేణి రెడ్డి విజయం సాధించారు. ‘సాక్షి’ దినపత్రిక ముంబై కార్యాలయంలో ఒకప్పుడు ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన ఆమె ఇప్పుడు బీఎంసీ కార్పొరేటర్‌గా విజయం సాధిం చారు. ప్రతిక్షనగర్‌లో నివసించే ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 2014 ఫిబ్రవరిలో సాక్షి ముంబై కార్యాలయంలో ఆపరేటర్‌గా చేరారు. 2015 మేలో పదవీ విరమణ చేసి.. సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆమెను బరిలోకి దింపింది. ఎన్నికల్లో గెలిచి, బీఎంసీలో తెలుగువారికి తొలిసారిగా ప్రాతినిథ్యాన్ని కల్పించారు. కడప నుంచి ముంబై వయా చిత్తూరు కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో జన్మించిన కృష్ణవేణి రెడ్డి వివాహం చిత్తూరు జిల్లా కొత్త ఆరూరుకు చెందిన వినోద్ రెడ్డితో జరిగింది. ఆమె భర్త ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయన ఫార్మా రంగంలో ఉండగా ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. కాగా, 2012లో జరిగిన ఎన్నికల్లో శివసేన టికెట్‌పై 176వార్డు (ధారావి–ట్రాన్సిస్ట్ క్యాంప్)నుంచి పోటీ చేసిన వరంగల్ జిల్లాకు చెందిన అనూషా వల్పదాసి విజయం సాధించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఆమె పదవి రద్దు అయిన సంగతి తెలిసిందే. మార్పు కోరుకున్నారు.. ‘‘రాజకీయ అనుభవంలేని నేను రాజకీయాల్లోకి రావడం, విజయం సాధించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ అనుభవం లేని మీరు రాజకీయ బురదలోకి ఎందుకొస్తున్నారు.. వచ్చినా.. ఎలా నెగ్గుకొస్తారని పలువురు ప్రశ్నించారు. అయితే నేను వారికి చెప్పే సమాధానమొక్కటే రాజకీయ బురదని అందరూ తప్పించుకుంటే ఎలా? మహిళలతోపాటు యువత రాజకీయాల్లోకొస్తే కొత్త ఆలోచనలతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే నాకు అవకాశం కల్పించారు’’