breaking news
kottapally
-
బీజేపీలో భగ్గుమన్న విబేధాలు
-
ఆర్టీసీ బస్సులు ఢీకొని 20మందికి గాయాలు
గంభీరావుపేట : కొత్తపల్లి గ్రామశివారు మూలమలుపు వద్ద ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇరవై మంది ప్రయాణికులు గాయపడ్డారు. దుబ్బాక డిపోకు చెందిన రెండు బస్సుల్లో ఒకటి కామారెడ్డి నుంచి దుబ్బాకకు వెళ్తుండగా.. మరొకటి దుబ్బాక నుంచి కొత్తపల్లికి వస్తోంది. మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఢీకొన్నాయి. ప్రమాదంలో సుమారు 20మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కొత్తపల్లి రిజర్వాయర్‌కు ఎస్సారెస్పీ నీరు
కరీంనగర్ రూరల్: కొత్తపల్లి రిజర్వాయర్‌లోకి కాకతీయకాలువ ద్వారా ఎస్సారెస్పీనీటిని విడుదల చేయడంతో గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేరిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం కొత్తపల్లి రిజర్వాయర్‌లోకి రూ.60 లక్షలతో నిర్మించిన పైపులైన్ షట్టర్గేట్వాల్వ్ను విప్పి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు. సంప్‌హౌస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఫిల్టర్‌బెడ్స్‌ను పరిశీలించారు. నీటిని శుద్ధి చేసేందుకు నాణ్యమైన ఇసుకను ఉపయోగించాలని సూచించారు. ముందుగా ఎల్ఎండీ నింపిన తర్వాతే సాగుకు నీరు వదులుతామన్నారు. అనంతరం రేకుర్తిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామిగుట్టపైకి చేపట్టిన రోడ్డునిర్మాణపు పనులను పరిశీలించారు. ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ సభ్యులు ఎడ్ల శ్రీనివాస్, జమిలొద్దీన్, సర్పంచ్ వాసాల అంబికాదేవి, ఉపసర్పంచ్ కనకారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శంకరమ్మ, ఉప్పు శ్రీనివాస్, తహసీల్దార్ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందర్‌రాజు, టీఆర్ఎస్ నాయకులు బండ గోపాల్‌రెడ్డి, స్వర్గం నర్సయ్య, దూస మునీందర్, ఫకద్దీన్, పిట్టల రవీందర్, గడ్డం శ్రీరాములు, నందెల్లి మహిపాల్ పాల్గొన్నారు.