ఆర్టీసీ బస్సులు ఢీకొని 20మందికి గాయాలు | Rtc buses accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులు ఢీకొని 20మందికి గాయాలు

Aug 28 2016 9:15 PM | Updated on Sep 4 2017 11:19 AM

ఆర్టీసీ బస్సులు ఢీకొని 20మందికి గాయాలు

ఆర్టీసీ బస్సులు ఢీకొని 20మందికి గాయాలు

కొత్తపల్లి గ్రామశివారు మూలమలుపు వద్ద ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇరవై మంది ప్రయాణికులు గాయపడ్డారు.

గంభీరావుపేట : కొత్తపల్లి గ్రామశివారు మూలమలుపు వద్ద ఆదివారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇరవై మంది ప్రయాణికులు గాయపడ్డారు. దుబ్బాక డిపోకు చెందిన రెండు బస్సుల్లో ఒకటి కామారెడ్డి నుంచి దుబ్బాకకు వెళ్తుండగా.. మరొకటి దుబ్బాక నుంచి కొత్తపల్లికి వస్తోంది. మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఢీకొన్నాయి. ప్రమాదంలో సుమారు 20మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement