breaking news
Kishore pardasani
-
డైరెక్టర్ డాలీతో నితిన్?
‘అ ఆ’ సినిమాతో 50 కోట్ల క్లబ్ లో చేరిన నితిన్ తరువాత వరుసగా లై, ఛల్ మోహన్ రంగ సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో శ్రీనివాస కళ్యాణం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శతమానం భవతి సినిమాతో సక్సెస్ సాధించిన సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం... నితిన్ ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. కాటమరాయుడు డైరెక్టర్ డాలీ (కిషోర్ పార్థసాని)తో తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డాలీ చెప్పిన కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా ఉండటంతో నితిన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస కళ్యాణం తరువాత నితిన్ చేయబోయే సినిమా ఇదే అన్న ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. -
మార్చిలో రాయుడు వస్తాడు
అన్నయ్య ఇంటి పెద్ద. నలుగురు తమ్ముళ్లంటే ప్రాణం. తమిళ చిత్రం ‘వీరమ్’ కథ ఇది. అక్కడ అన్నయ్యగా అజిత్ నటించిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో ఇక్కడ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ‘కాటమరాయుడు’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలోని పవన్ గెటప్ ఇప్పటికే ఆకట్టుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పంచెకట్టు, కోరమీసంలో పవన్ కల్యాణ్ లుక్ డిఫరెంట్‌గా ఉందని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌కు కూడా భారీ ఎత్తున స్పందన లభించింది. ట్రైలర్ విడుదలైన రెండు గంటల్లో 10 లక్షల మంది వీక్షించడం విశేషం. ‘గోపాల గోపాల’ తర్వాత దర్శకుడు కిషోర్ పార్ధసాని (డాలీ), సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్‌తో, ‘గబ్బర్‌సింగ్’ తర్వాత శ్రుతీహాసన్‌తో, పవన్ కల్యాణ్ చేస్తున్న మరో చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబందించిన టాకీ దాదాపుగా పూర్తయింది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు డబ్బింగ్ , రీ–రికార్డింగ్ చేస్తున్నారు. మార్చి 5న పాటల చిత్రీకరణ కోసం యూనిట్ యూరప్ వెళ్లనుంది. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. శివబాలాజీ, కమల్కామరాజ్, చైతన్యకృష్ణ, అజయ్, అలీ, రావు రమేశ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.