విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి
నెల క్రితం సమంత రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. ఈమె అనే కాదు గతంలోనూ పలువురు హీరోయిన్లు విడాకులు తీసుకున్న కొన్నేళ్లకు మరొకరిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో బ్యూటీ చేరింది. కొత్త ఏడాది సందర్భంగా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రియుడితో కలిసి వీడియోని కూడా పంచుకుంది.(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)యాడ్స్‌లో నటించి కెరీర్ ప్రారంభించిన కీర్తి కల్హారీ.. తర్వాత బాలీవుడ్‌లోనూ పింక్, ఉరి, షైతాన్, మిషన్ మంగళ్ తదితర సినిమాలు చేసింది. క్రిమినల్ జస్టిస్, హ్యుమన్, ఫోర్ మోర్ షాట్స్ తదితర వెబ్ సిరీస్‌ల్లోనూ కీలక పాత్రలు చేసి పేరు సొంతం చేసుకుంది. ఈమెనే ఇప్పుడు తన ప్రియుడిని పరిచయం చేసింది. 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్‌లో తన సహనటుడు రాజీవ్ సిద్ధార్థ్‌తోనే ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని అధికారికం చేసేశారు.కీర్తి కల్హారీ గతంలో సాహిల్ సెహగల్ అనే నటుడిని 2016లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2021లో వీళ్లిద్దరూ విడిపోయారు. గత నాలుగేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న కీర్తి ఇప్పుడు రాజీవ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. చూస్తుంటే త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతారనిపిస్తోంది. కొత్త జంటకు తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్ చివరి సీజన్ గత నెల 19న స్ట్రీమింగ్ అయింది. ఆ సిరీస్ ఇలా అయిపోయిందో లేదు వీళ్లు తమ బంధాన్ని బయటపెట్టేశారు.(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari)