breaking news
kidnap story
-
'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా..
ఆమెతో బోసుకి చిత్రంగా పరిచయం అయింది. ఒక సాయంత్రం, అతని ఇంటికి కొద్ది దూరంలో, ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. అతనిని ఆపి, ఒక డజను అరటిపండ్లు కొనమని అడిగింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒక్క రోజు కనిపించక పొతే ఆపి మరీ ‘ఏంటి బొత్తిగా నల్లపూస అయ్యావు?’ అనడిగేసేది. ఆ గదమాయింపులో అతనికి ఏదో ఆత్మీయత కనిపించేది.బోసు మొదటి అంతస్తులోని తన పోర్షన్‌కి వెళ్ళి తలుపు తెరిచాడు. భుజమ్మీద నుంచి ఆఫీస్ బ్యాగ్ తీసేసి పక్కనే ఉన్న దివాన్ మీద పెట్టాడు. అరటిపండ్లు ఉన్న బాగ్, పులిహోర ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకుని మళ్ళీ ఇంటికి తాళం వేసి బయటకి వచ్చాడు.వీధి చివరి వరకు నడిచిన తర్వాత, ఎదురుగా వస్తున్న ఆమెను గుర్తించాడు. పీలగా, బలహీనంగా ఉన్న ఆమె అతని వైపు వచ్చింది. బోసు కదలలేదు. కానీ ఆవిడ అతని ముందు అలాగే నిలబడి ఉంది. కొన్ని సెకన్ల పాటు! ఆమె ముఖం అభావంగానే ఉంది. ఆమె చూపులు అతని చేతిలో ఉన్న బాగ్ మీద పడ్డాయి. అంతే ఆమె ముఖం వెలిగిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుందో బోసుకు తెలుసు. అందుకే అతను ఆ చేతిని పట్టుకున్నాడు. ఆమె చూపులు మటుకు అతడు పట్టుకున్న గుడ్డ సంచిపైనే ఉన్నాయి.‘ఇదిగో మీ అరటిపండ్లు’ బోసు అన్నాడు. ‘ఓ! మళ్ళీ అడగకుండానే తెచ్చావు’ అంది ఆమె. బోసు ‘ఎస్’ అంటూ అభిమానంగా నవ్వాడు. ఎందుకో తెలియదు కానీ ఆమెతో గడపడం అతనికి చాలా ఇష్టం. ఎవరో అన్నట్లు కొన్నింటికి లాజిక్కులు ఉండవు. ఆమె తోడు కోసం కింద భాగం ఇంటిని అద్దెకు ఇచ్చింది. ఆమెకు వంట చేసుకోవడం కుదరకపోవడంతో, పనివాళ్ళ మీద ఆధారపడింది. వాళ్ళు కారాలు ఎక్కువేయడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే ఎక్కువ పండ్లు మాత్రమే తింటోంది. వాటిల్లో అరటిపండ్లు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రోజూ ఆఫీసు నుండి వచ్చాక బోసు.. ఆమెతో కలసి వాకింగ్‌కి వెళ్ళేవాడు. ఆ వాకింగ్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. ఆమె తన వ్యక్తిగత వివరాలను కొన్ని అతనికి చెప్పింది. ఆమె ఒక టీచర్. నార్త్ ఇండియాలో పుట్టి పెరిగింది. ఆమెకు సుడోకు అంటే ఇష్టం.‘నేను మీ కోసం ఇంకోటి తెచ్చాను’ అంటూ బోసు మళ్ళీ బ్యాగ్ తీశాడు. ‘అదేంటో?’ ఆమె ముఖం చిన్నపిల్లలా అయోమయంగా కనిపించింది.‘అప్పుడెప్పుడో మీరు పిజ్జా తినాలనుంది అన్నారుగా! తెచ్చాను’ బోసు చెప్పాడు. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించి, ‘థాంక్యూ.. థాంక్యూ’ సంబరపడిపోయింది.అయితే బోసుకి నిరాశగా అనిపించింది. తానేమి ఆశించాడు? ఉద్వేగంతో గెంతుతుందనా? ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుందనా? కొన్నిసార్లు ఆఫీస్ వేళల్లో అతని మనస్సు ఆమె వైపు మళ్లుతుంది. అయితే ఇవేమీ తెలియని ఆమె తన ప్రపంచంలో తానుంటుంది. నిజానికి ఆమె నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది.కొన్నిసార్లు ఆమెను కలుసుకోవడానికి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తాడు. ఆమె ఒంటరిగా ఉంటోంది. బోసు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నాడో అతనికే తెలియదు. తెలియకుండానే అనుబంధం పెంచుకున్నాడు. ఏదో తెలియని పాశం ఆమె వైపు సూదంటు రాయిలా లాగుతుంది. ఆమె గురించి తెలుసుకోవాలని బోసు చాల తహతహలాడుతున్నాడు. అడిగేతే బావుంటుందా? తననూ మగవాళ్లందరిలో ఒకడిగా జమకట్టి.. తనతో స్నేహం మానేస్తే..! ఆ ఆలోచనే భరించలేకపోయాడు. కాని అతని కుతూహులం నస పెడుతూనే ఉంది.. ఆమె కథ ఏమై ఉండొచ్చు? అని! అయితే ఈమధ్యనే ఆమె గురించి ఒక విషయం తెలిసింది. అప్పటి నుంచి మనిషి మనిషిగా లేడు. తన వస్తువును తనకు కాకుండా చేస్తున్న ఫీలింగ్. ఒక రకమయిన పొసెసివ్‌నెస్ వచ్చేసింది.రెండు రోజులుగా ఆమెను కలవలేదు. ఆ రోజు ఆదివారం.. ఆఫీస్‌కి సెలవు. దానికి తోడు పెద్ద వాన. కిటికీలోంచి ముత్యాల సరాలులా పడే వానని చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ఇంతలో ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చింది. ఆమెకి బాగా జబ్బు చేసిందని చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనిషి నీరసించి ఉంది. అసలే బక్కపల్చటి మనిషి.. ఈ రెండు రోజుల అనారోగ్యం ఆమెను మరింతగా కుంగదీసినట్టుంది. దగ్గరగా వెళ్ళి సన్నగా పుల్లలా ఉన్న చేయి పట్టుకుని ఆప్యాయంగా అడిగాడు ‘ఎలా ఉంది? నాకు కబురు పంపిస్తే వచ్చేవాడిని కదా! నేను నీకేమీ కానా?’ అంటూ.ఆ ప్రేమకి అభిమానానికి కరిగిపోయింది ఆమె. అదేం కాదననట్లు తల అడ్డంగా ఊపింది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. ‘కాసేపు కింద గార్డెన్‌లోకి వెళదాం. నాకు ఇక్కడ ఊపిరి ఆడటం లేదు’ అంది.‘సరే’ అని చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ సాయంకాలం.. వాళ్ళు మెల్లగా నడుస్తున్నారు. ఇద్దరి మధ్య బోలెడు కబుర్లు దొర్లాయి. ఆమె బలహీనమైన చేయి అతని చేతిలో ఉంది.‘నేను పెళ్ళి చేసుకోలేదు!’ ‘మీకు పెళ్ళయిందా? మీ వాళ్ళంతా ఎక్కడున్నారు?’ కాసేపటి క్రితం బోసు అనాలోచితంగా అడిగిన ఆ ప్రశ్నకు ఇప్పుడు జవాబు ఇచ్చింది.ఆశ్చర్యపోయాడు బోసు. మరి తను ఆ రోజు చూసిందేమిటి? ఆ దృశ్యాలు తనకిప్పటికీ గుర్తున్నాయి. ఆమె ఆ పిల్లలను కలుసుకోవడం గురించి ఎందుకు చెప్పటం లేదు? ఆమె ఎప్పుడైనా అలా చెప్పిందా, లేదా తను ఊహించుకున్నాడా? ఆమె డిమెన్షియాతో బాధపడుతోందా? అని మథనపడుతూనే ‘మరి ఆ పిల్లలు?’ అడిగాడు అప్రయత్నంగానే! ‘వాళ్ళు నావాళ్ళు కాదు’ అని చెప్పి వెంటనే ‘అంటే నా పిల్లలే, కానీ నేను వాళ్ళకి బయోలాజికల్ మదర్ని కాను’ అన్నది.బోసుకి గందరగోళంగా అనిపించింది, ‘మీరు వారిని దత్తత తీసుకున్నారా? క్లారిటీగా చెప్పండి’ బతిమాలుతున్నట్టుగా అడిగాడు.ఆమె నీరసంగా అతని వైపు చూస్తూ, ‘ఎక్కడయినా కూర్చుందాం. నా కాళ్ళు లాగుతున్నాయి’ అన్నది. ‘ఓ! సారీ.. పదండి’ అంటూ దగ్గరే ఉన్న బెంచ్ వైపు కదిలారు. ‘నేను ఎక్కువసేపు ఒకే చోట నిలబడలేను’ బెంచ్ మీద కూర్చుంటూ చెప్పింది. ‘అయ్యో సారీ.. నాకు తట్టనే లేదు’ నొచ్చుకుంటూ అన్నాడు. ఇద్దరూ ఒక్క క్షణం మౌనం వహించారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె, ‘వారు నా పిల్లలే.. కానీ నేను వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని కాను’ ఆమె మళ్ళీ చెప్పింది. ‘స్కూల్ టీచర్‌గా పనిచేసే దాన్ని. అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు ఊర్లో ఉండేవారు. నాకెందుకో పెళ్ళి అనే బంధం మీద ఇష్టం యేర్పడలేదు. దాంతో నా తల్లిదండ్రులు చాలా అసంతృప్తి చెందారు. ఆ కాలంలో ఒంటరిగా బతుకుతున్న స్త్రీని మీరు ఊహించుకోవచ్చు. నేను పెళ్ళి చేసుకుని, సెటిల్ అవ్వాలని మా పేరెంట్స్ కోరిక.కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నేను వారిని ఏమనలేకపోయాను. అసలు పెళ్ళి మీద నాకు దృష్టే లేదు. ఏదో చెయ్యాలనే తపన. పెళ్ళి చేసుకుంటే చేయలేను. నా ఈ ఆలోచన మా పేరెంట్స్‌కి అర్థంకాలేదు. ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయాను’ ఆయాసం రావడంతో కాసేపు ఆగి మళ్ళీ కొనసాగించింది,‘రోజూ స్కూల్ నుండి ఇంటికొచ్చాక.. మా ఏరియా చుట్టుపక్కలంతా చుట్టొస్తుండేదాన్ని. అలా నడుస్తున్నప్పుడు ఒక మురికివాడను చూశాను’ అంటూ ఆమె కళ్ళు మూసుకుంది. ‘ఏమైందప్పుడు?’ బోసు ఆత్రుతగా అడిగాడు.‘హు..?’ అంటూ ఆమె అయోమయంగా అతని వైపు తిరిగింది. ‘అదే మీ సాయంత్రం నడకలో ఒక మురికివాడలోకి వచ్చానని చెబుతున్నారు’ బోసు గుర్తుచేశాడు.‘ఆ.. అవును.. మురికివాడలో ఒక గుడిసె బయట.. ఒక మగ మనిషి, ఓ ఆడ మనిషి తీవ్రంగా కొట్టుకుంటున్నారు. మిగతావాళ్ళంతా నవ్వుతూ, ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. వాళ్ళను వారిద్దామనుకునే లోపల అక్కడ వినిపించిన కొంతమంది పిల్లల ఏడుపులు నన్ను ఆపేశాయి. అయిష్టంగానే వెనక్కి తిరిగాను. ఆ ఆడమనిషి ఆ పిల్లలను చెత్త కుప్ప మీదకు తోసేసింది. ఆమె మనసులోని దరిద్రమేదో ఆమె చేత ఆ పని చేయించి ఉండవచ్చు. ఏమైనా వాళ్ళు ఆమె పిల్లలు!తల్లిదండ్రులను భయంతో చూస్తున్నారు. ఏం జరుగుతుందో బహుశా.. వాళ్ళకు తెలుసు కాబోలు’ అని చెబుతూ ఆమె ఆపేసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంటూ మౌనం వహించింది. ఆమె చెప్పిన కథలోని శకలాలు బోసును ఆశ్చర్యపరచాయి. అతను కూడా ఆందోళన చెందాడు. ఆమె తన గతం చెప్పటం అయిపోయిందా లేక కొనసాగిస్తుందా? అతనికి వేచి ఉండే ఓపిక లేదు. కానీ వినాలనే కుతూహలం అతను వేచి ఉండేలా చేసింది. బోసు టైమ్ చూసుకున్నాడు.. దిక్కులు చూశాడు. ఆమె తిరిగి చెప్పడం ఎప్పుడు మొదలుపెడుతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఆవె కళ్ళు తెరిచింది. హమ్మయ్య అనుకున్నాడు బోసు. ‘నేను మళ్ళీ ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళాను. అదే దృశ్యం రిపీట్ అయింది. కానీ ఈసారి ఆ ఆడమనిషి తన పిల్లలను కొడితే నేను జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చేసుకున్నాను కూడా. పిల్లల్ని కొట్టొద్దని ప్రాధేయపడ్డాను. ఆమె వినలేదు. అయితే ఆ బస్తీలో వాళ్ళు మటుకు ‘ఇది వీళ్ళు రోజూ ఆడే నాటకమే. మీరు పట్టించుకోకండి’ అని చెప్పారు. నా కన్సర్న్ అంతా ఆ అమాయకమైన పిల్లల గురించే.కొన్ని రోజుల తర్వాత.. ఒకసారి నేను స్కూల్‌కి వెళుతూండగా ఆ పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించారు. మనసు చివుక్కుమంది. స్కూల్‌కి ఆలస్యమవుతున్నా.. వాళ్ళను వదిలి ముందుకు వెళ్ళలేకపోయాను’ అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని, ‘నేను ఆ పిల్లల దగ్గరకు వెళ్ళడం నాకిప్పటికీ గుర్తుంది. అంత చిన్న పిల్లలని ఆ తల్లిదండ్రులు అలా ఎలా రోడ్డు మీద వదిలేశారని ఆశ్చర్యపోయాను. అప్పుడే తెలిసింది. వాళ్ళంతా అనాథలని! దగ్గరలోని ఒక రెస్టారెంట్ నుండి వాళ్ళకు కావలసినవి తెచ్చిపెట్టాను. ఆ క్షణమే ఓ నిర్ణయానికి వచ్చేశాను. ముందు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ.. వాళ్ళు నాతో సన్నిహితంగా మెదిలేలా అలవాటు చేశాను’ అంటూ బోసు వైపు చూసింది.‘తర్వత ఏమైంది?’ ఉత్కంఠగా అడిగాడు బోసు. అచ్చు రాత్రిపూట.. తన అమ్మమ్మను కథ చెప్పమని అడిగే చిన్న పిల్లవాడిలా! ‘నేను వాళ్ళను నా అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాను.’బోసు ఆమె వైపు చూశాడు. ఆమె భుజాలు వంచి.. కళ్ళు మూసుకునుంది. ‘తర్వాత?’ అడిగాడు అదే ఉత్కంఠతో! కళ్ళు తెరుస్తూ ఆమె బోసు వైపు తిరిగి ‘వాళ్ళు నాతోనే ఉన్నారు’ చెప్పింది నెమ్మదిగా. బోసులో అయోమయం.. ‘వారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా! వాళ్ళ పిల్లలను మీరెలా తెచ్చుకున్నారు? వాళ్ళు అనుమతించారా? దత్తత గురించి మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా?’ఆమె.. అతని నుండి కళ్ళు తిప్పుకుని, ముడుచుకున్న తన చేతులను చూసుకుంటూ ‘నేను వారి తల్లిదండ్రులతో మాట్లాడలేదు. అసలు మళ్ళీ ఆ బస్తీకే వెళ్ళలేదు’ అని చెప్పింది స్థిరంగా. ‘అంటే కిడ్నాప్ చేశారా వాళ్ళను? చెప్పకుండా తీసుకెళ్ళడమంటే అదే కదా?’ విస్తుపోతూ బోసు. ‘ఎంతమందిని తెచ్చారు?’ తేరుకుని అడిగాడు. ‘ఒక పన్నెండు మందిని! వాళ్ళకు ఒక హోమ్ ఏర్పాటు చేశాను. అది వాళ్ళిల్లు. కుక్, కేర్‌టేకర్‌ని పెట్టాను. చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు’ చెప్పింది. ‘అయినా సరే.. అది కిడ్నాప్’ అంటూ గట్టిగా అరిచాడు బోసు. మళ్ళీ వెంటనే ‘కాదు.. కాదు ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో!’ సాలోచనగా అన్నాడు. ఆమె వణుకుతూ మెల్లగా లేచింది. బోసు అలాగే నిశ్చేష్టుడై ఉన్నాడు.‘నేను ఇంక ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు రోజూ రాత్రి ఫోన్ చేస్తారు’ అంటూ అడుగులు వేసింది. ఆ మాటకి బోసు ఈ లోకంలోకి వచ్చాడు. గబుక్కున బ్యాగ్ తీసి ఆమెకు ఇచ్చాడు.‘థాంక్యూ మై డియర్ బాయ్’ అంటూ అతని చేతిని ముద్దు పెట్టుకుంది. ‘నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మనవడు ఉన్నాడు గ్రానీ..’ అంటూ ఆమె బుగ్గలు పుణికాడు బోసు. ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చి బోస్‌ని చూసి నవ్వింది. ఆ పెద్దామె చేయి పట్టుకుని ముందుకు నడిపించసాగింది. పెద్దావిడ వెళుతూ వెళుతూ వెనక్కితిరిగి బోసును చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.బోసుకి ఆమెను చూసినప్పుడల్లా ఏదో అనుబంధం లాగుతున్నట్టనిపిస్తుంది. బహుశా.. తన జీవితంలో ఎప్పుడూ చూడలేని అమ్మమ్మ , నాన్నమ్మలని ఆవిడలో చూసుకుంటూ ఉండొచ్చు. అమ్మ చిన్నప్పుడే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ పోయారు. అలా అమ్మమ్మ పరిచయమే లేకుండా పోయింది. తన అయిదవ ఏట నానమ్మ పోయింది. అలా నానమ్మ జ్ఞాపకమూ మిగల్లేదు. చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుతో అమ్మానాన్నలకూ దూరంగానే ఉన్నాడు. అంత బాండింగ్ లేదు.వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు తనకు అతిగా అనిపించేవి. అందుకే వాళ్ళ నుంచి ప్రైవసీ కోరుకున్నాడు. సొంతూళ్ళో ఉద్యోగం వచ్చినా ఇలా ఇంకో ఊరికి మార్పించుకుని వచ్చాడు. అతని తల్లిదండ్రులు కొడుకు కోసం మొహం వాచిపోయున్నారు. ఉండబట్టలేక ఫోన్లు చేస్తే.. విసుక్కుంటాడు. పొడిపొడిగా మాట్లాడి సెకన్లలో కాల్ ముగించేస్తాడు. వాళ్ళెప్పుడు రమ్మన్నా వెళ్ళకుండా సాకులు వెదుక్కుంటుంటాడు. అలాంటి తనకు ఆ ఎనభై ఏళ్ల ఆ వృద్ధురాలు కనువిప్పు కలిగించింది. అనాథల కోసం అవివాహితగా మిగిలిపోయింది. వాళ్ళకు అమ్మ అవడం కోసం తన కుటుంబాన్ని వదులుకుంది.ఫోన్ మోగుతోంది. పనిలో ఉన్న శ్యామల గబగబా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ‘హెలో..’ అంది. ‘ఎవరూ?’ అని ఆత్రంగా అడుగుతూ ఆమె భర్త శ్రీనివాస్ వచ్చాడు. ‘హుష్..’ అని భర్తకు సైగ చేసింది. ‘వాడేనా?’ కుతుహులం పట్టలేక గుసగుసగా అడిగాడు శ్రీనివాస్. కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా అవునన్నట్టుగా తలూపింది. ‘ఎలా ఉన్నావు నాన్నా?’ ఫోన్ మాట్లాడుతూ అక్కడే టేబుల్ మీదున్న బోసు ఫొటోను ప్రేమగా స్పృశించింది శ్యామల. – మణి వడ్లమానిఇవి చదవండి: 'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై.. -
కిడ్నాప్.. సుఖాంతం!
ఉదయమే బాలిక అపహరణ సకాలంలో స్పందించిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా అప్రమత్తం... విస్తృత సోదాలు మధ్యాహ్నం వదిలేసిన వైనం ధర్మవరం అర్బన్: స్థానిక మారుతీనగర్‌లో రూరల్ పోలీస్‌స్టేషన్ వెనుక వైపు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని గురువారం ఉదయం కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని దుండగుడు మధ్యాహ్నం కుణుతూరు గ్రామ సమీపంలోని వంక వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలను ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ హరినాథ్ వెల్లడించారు. అనంతపురానికి చెందిన ఎలక్ట్రీషియన్ రామ్మోహన్, లక్ష్మీవసుంధర దంపతుల కుమార్తె రుషిత ప్రియ(6) దసరా సెలవుల కోసం ధర్మవరంలోని పెద్దమ్మ శ్యామల ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం 11.30గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆ బాలిక ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి చాక్లెట్లు కొనిస్తానంటూ ఎక్కించుకుని వెళ్లిపోయాడు. సమాచారాన్ని అందుకున్న పట్టణ సీఐ హరినాథ్ అక్కడకు చేరుకుని ఆరా తీశారు. వెంటనే ఇన్చార్జ్ డీఎస్పీ శివరామిరెడ్డి ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేయించారు. జిల్లా వ్యాప్తంగా రహదారులపై పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు. పోలీసుల కదలికలు వేగవంతం కావడంతో అప్రమత్తమైన దుండగుడు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుణుతూరు వంక వత్త బాలికను వదిలేసి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఏడుస్తూ ఉన్న బాలికను గమనించిన స్థానికులు బాలికను చేరదీసి బుజ్జగించారు. ఆమె ద్వారా తల్లి ఫోన్ నంబర్ తెలుసుకుని సమాచారం అందించారు. తల్లిదండ్రులతో కలిసి ఇన్చార్జ్ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ హరినాథ్.. కుణుతూరుకు వెళ్లి బాలికను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో కిడ్నాపర్‌ను పట్టుకుంటామని ఈ సందర్భంగా డీఎస్పీ పేర్కొన్నారు. కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో పట్టణ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
రాజమహేంద్రవరంలో తీసుకువెళ్లి.. నడకుదురులో వదిలేశారు.. తండ్రికి అప్పగించిన కరప పోలీసులు కరప (కాకినాడ రూరల్) : రాజమండ్రిలో నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలిక కథ సుఖాంతమైంది. బాలిక వెంకటలక్షి్మని కరప పోలీసులు గురువారం రాత్రి తండ్రి ఖాదర్‌కు అప్పగించారు. ఈ బాలికను రాజమండ్రిలో ముగ్గురు కిడ్నాప్ చేసి నడకుదురు వద్ద వదిలిపెట్టారు. ఆమె చెవికి ఉన్న రూ.9 వేల విలువైన రింగులను తీసుకుపోయారు. పోలీసులు, తండ్రి కథనం ప్రకారం... శ్రీశైలం నుంచి పొట్టకూటి కోసం ఖాదర్, ఉరవకొండ మల్లేశ్వరి, పిల్లలతో రాజమండ్రిలో జీవిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఖాదర్, మల్లేశ్వరి కుమార్తె వెంకటలక్ష్మి రాజమండ్రి గోదావరి గట్టుపై ఆడుకుంటుంటే.. ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి ట్రై¯ŒSలో కాకినాడ తీసుకువెళ్లారు. 8వ తేదీ బుధవారం నడకుదురులోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న ఈ బాలికను స్థానికులు మొండి ఈశ్వరరావు, గాడి శ్రీనివాస్, నడికట్ల శివశంకర్, జువ్వల చిన్నలు చేరదీసి వివరాలు సేకరించారు. చెవికి ఉన్న రింగులు వారు తీసేసుకున్నారని ఆమె చెప్పింది. ఈమె కోసం ఎవరైనా వస్తారేమోనని చూసిన వారు గురువారం ఆమెను కరప పోలీసుస్టేష¯ŒSలో అప్పగించారు. ఎస్సై మెల్లం జానకిరాం వైర్లెస్ సెట్లో ఆమె వివరాలు వెల్లడించడంతో.. బాలిక తప్పిపోయినట్టు ఫిర్యాదు ఉందని రాజమండ్రి త్రీటౌ¯ŒS పోలీసులు స్పందించారు. రాజమండ్రి పీఎస్ హెచ్‌సీ సీహెచ్ వెంకటరమణ, ఖాదర్‌తో కలిసి స్థానిక పోలీసుస్టేష¯ŒSకు రావడంతో బాలికను రైటర్ ఎ¯ŒS.వెంకటరమణ వారికి అప్పగించారు. నాలుగురోజుల నుంచి కుమార్తె కోసం తిరుగుతున్నానని ఖాదర్ చెబుతూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కుమార్తె చెవికి ఉన్న రింగుల విలువ రూ.9 వేలు ఉంటుందని చెప్పారు. -
ఇంటికి చేరిన ప్రేమనాథరెడ్డి
కదిరి : కిడ్నాప్‌కు గురైన ప్రేమనాథరెడ్డి గురువారం సాయంత్రం ఇంటికి చేరారు. కదిరి మున్సిపల్ పరిధిలోని ఇందిరాకాలనీలో తన ఇంటి దగ్గరే నలుగురు దుండగులు ఇతన్ని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు సమీపంలో పొంతనూరులో రోడ్డు పక్కన పడి ఉన్న ఇతన్ని అక్కడి స్థానికులు పొంతనూరు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి కదిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కదిరి టౌన్ ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి వెంటనే అక్కడికెళ్లి స్టేషన్లో క్షేమంగా ఉన్న అతన్ని కదిరికి తీసుకొచ్చారు. కదిరి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం అతన్ని నేరుగా వారి ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు. అయితే ‘మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అంత దూరం ఎలా తీసుకెళ్లారు? అని బాధితుడ్ని మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి అతను నిరాకరించారు. -
కిడ్నాప్ కలకలం
కదిరిలో టీడీపీ నేత తనయుడి అపహరణ ఫైనాన్షియర్ రాణాప్రతాప్‌రెడ్డి పనేనంటున్న కుటుంబ సభ్యులు చితకబాది కోయంబత్తూరు సమీపంలో పడేసి వెళ్లిన కిడ్నాపర్లు ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్, టీడీపీ నేత సోమగుట్ట ప్రతాప్‌రెడ్డి తనయుడు ప్రేమనాథ్‌రెడ్డి బుధవారం కదిరిలో కిడ్నాప్ అయ్యాడు. ఖాకీ దుస్తుల్లో వచ్చిన వ్యక్తులు ఆయన్ను అపహరించుకుపోయారు. బాగా చితక్కొట్టి తమిళనాడు రాష్ట్రంలో పడేసి వెళ్లిపోయారు. కిడ్నాప్ వ్యవహారం పట్టణంలో కలకలం రేపింది. కదిరిలోని ఇందిరాకాలనీలో ప్రేమనాథరెడ్డి నివాసముంటున్నాడు. ఈయన బుధవారం ఉదయం 5.30 గంటలకు వాకింగ్‌కు బయల్దేరాడు. భార్య ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఖాకీ దుస్తుల్లో నలుగురు వ్యక్తులు (ఇద్దరు హెల్మెట్, మిగిలిన ఇద్దరు మంకీ క్యాప్‌లు ధరించి) రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. ‘ప్రేమనాథ్‌రెడ్డి ఉన్నాడామ్మా..?’ అని వారిలో ఒకరు ప్రశ్నించారు. ఆమె బీట్ కానిస్టేబుళ్లని భావించి ‘సార్, అదిగో అక్కడ వాకింగ్‌కు వెళుతున్నాడు’ అంటూ భర్తవైపు చేయి చూపించింది. ఆమె చూస్తుండగానే వారు వెళ్లి తుపాకీతో భయపెట్టి ప్రేమనాథ్రెడ్డిని బలవంతంగా ద్విచక్రవాహనంలో తీసుకెళ్లారు. ఫైనాన్షియర్ రాణాప్రతాప్రెడ్డిపై అనుమానం కడపకు చెందిన ఫైనాన్షియర్ రాణాప్రతాప్‌రెడ్డి పనేనంటూ కిడ్నాప్‌కు గురైన ప్రేమనాథరెడ్డి భార్య లక్ష్మి, అతని తండ్రి ప్రతాప్‌రెడ్డిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘నా కొడుకు ప్రేమనాథ్‌కు కడపలో ఉన్న రాణాప్రతాప్‌రెడ్డి రూ 3 లక్షలు బాకీ ఉన్నాడు. ఆ డబ్బు ఇవ్వాలని కడపకు వెళ్లి అతన్ని గట్టిగా అడగడంతో చెక్ రాసిచ్చాడు. డబ్బు ఇవ్వాలని కోర్టు ద్వారా ఈ మధ్యే అతనికి నోటీసు పంపించాడు. దానికి అతను నా కొడుకుతో పాటు నా భార్య, నా కోడలుకు సైతం వారం రోజులుగా ఫోన్లు చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నాడు. నా కొడుకును అతనే కి డ్నాప్ చేయించి ఉంటాడు’ అని ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అనంతపురం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆనవాళ్లు సేకరించారు. కోయంబత్తూరులో పడేశారు.. కిడ్నాపర్లు.. ప్రేమనాథ్రెడ్డికి ముక్కు దగ్గర మత్తు మందు స్ప్రేచేసి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు తీసుకెళ్లినట్లు కదిరి పోలీసులకు సమాచారం అందింది. ఇనుపరాడ్లతో కొట్టి రోడ్డుపక్కన పడేయడంతో స్థానికులు పొడనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్లో క్షేమంగా ఉన్నారు. ఈ కిడ్నాప్ Ðð నుక రాణాప్రతాప్‌రెడ్డి ఉన్నారా? లేక ఇంకెవరి హస్తమైనా ఉందా? అనేది విచారణలో తేలుతుందని కదిరి డీఎస్పీ ఎన్.వి.రామాంజనేయులు ‘సాక్షి’కి తెలియజేశారు. ప్రేమనాథ్రెడ్డిని తీసుకొచ్చేందుకు ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి నేతత్వంలో ఒక బందాన్ని అక్కడికి పంపినట్లు చెప్పారు. -
'నన్ను కిడ్నాప్ చేసి, విడిచిపెట్టారు'
న్యూఢిల్లీ: అదృశ్యమైన స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా.. తనను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి, అనంతరం వదిలిపెట్టారని చెప్పింది. ఘజియాబాద్ పోలీసులకు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చింది. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్‌లో దీప్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. 40 గంటల తర్వాత హర్యానాలోని పానిపట్ వద్ద ఆమెను పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి ఘజియాబాద్ నుంచి ఇంటికి ఆటోలో వెళ్తుండగా తనను కిడ్నాప్ చేశారని దీప్తి పోలీసులకు చెప్పింది. తన కళ్లకు గంతలు కట్లి, గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని తెలిపింది. తనను 24 గంటల పాటు బందించారని, అనంతరం శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో తనను వదిలివెళ్లారని చెప్పింది. దుండగులు తనకు ఎలాంటి హాని తలపెట్టలేదని, భోజనం కూడా పెట్టారని తెలిపింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. కాగా దుండగులు దీప్తిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. దీప్తి కిడ్నాప్ ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సీరియస్‌గా తీసుకుని ఆచూకీ కనుగొనాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.