ఇంటికి చేరిన ప్రేమనాథరెడ్డి | kidnap story conclusion | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరిన ప్రేమనాథరెడ్డి

Oct 27 2016 11:46 PM | Updated on Sep 4 2017 6:29 PM

కిడ్నాప్‌కు గురైన ప్రేమనాథరెడ్డి గురువారం సాయంత్రం ఇంటికి చేరారు.

కదిరి : కిడ్నాప్‌కు గురైన ప్రేమనాథరెడ్డి గురువారం సాయంత్రం ఇంటికి చేరారు. కదిరి మున్సిపల్‌ పరిధిలోని ఇందిరాకాలనీలో తన ఇంటి దగ్గరే నలుగురు దుండగులు ఇతన్ని కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు సమీపంలో పొంతనూరులో రోడ్డు పక్కన పడి ఉన్న ఇతన్ని అక్కడి స్థానికులు పొంతనూరు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి కదిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో కదిరి టౌన్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి వెంటనే అక్కడికెళ్లి స్టేషన్‌లో క్షేమంగా ఉన్న అతన్ని కదిరికి తీసుకొచ్చారు. కదిరి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం అతన్ని నేరుగా వారి ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు. అయితే ‘మిమ్మల్ని ఎవరు కిడ్నాప్‌ చేశారు? అంత దూరం ఎలా తీసుకెళ్లారు? అని బాధితుడ్ని మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి అతను నిరాకరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement