breaking news
Khayyum Bhai
-
నయీమ్‌లానే ఉన్నారు
కృష్ణంరాజు సతీమణి శ్యామల గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖయ్యూం భాయ్’. కట్టా రాంబాబు, నందమూరి తారకరత్న, ప్రియ, హర్షిత, చలపతిరావు, సుమన్ తదితరులు ముఖ్య పాత్రల్లో భరత్ పారేపల్లి దర్శకత్వంలో పత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో కట్టా శారద చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు సాగర్, నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ నాగభూషణం ఆవిష్కరించారు. శ్యామల మాట్లాడుతూ– ‘‘రాంబాబుగారు అచ్చం నయీమ్‌లానే ఉన్నారు. టీజర్ బాగుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, భరత్‌కి, యూనిట్‌కి మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ‘‘భరత్ మంచి టెక్నీషియన్ అయినా రావాల్సినంత పేరు రాలేదు. ‘ఖయ్యూం భాయ్’ ఆయనకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం యాక్షన్ నేపథ్యంలో ఉంటుంది. మే రెండో వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ చిత్రం చేశా. క్వాలిటీ, ఖర్చు విషయంలో రాజీ పడలేదు’’ అని కట్టా రాంబాబు చెప్పారు. కట్టా శారద, నటుడు బెనర్జీ, నిర్మాత టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
నయీమ్ కథతో ఖయ్యుమ్
గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితకథ ఆధారంగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖయ్యుమ్ భాయ్’. ఏసీపీగా నందమూరి తారకరత్న, ఖయ్యుమ్గా కట్టా రాంబాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కట్టా శారదా చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘నయీమ్ చిన్ననాటి నుంచి ఎన్కౌంటర్లో మరణించిన ఘటన వరకూ సినిమాలో చూపిస్తున్నాం. సినిమాలో యాక్షన్ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయి. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కట్టా రాంబాబు. నటులు ‘బాహుబలి’ ప్రభాకర్, చిన్నా, బెనర్జీ, ఫైట్ మాస్టర్ విజయ్, దర్శకుడు భరత్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర.