breaking news
Khans
-
పద్మావత్ 300కోట్లు వసూలు చేసినా...
సాక్షి, హైదరాబాద్ : అనేక వివాదాలు ఎదుర్కొన్న ‘పద్మావత్’ సినిమా ఎట్టకేలకు రూ. 300 కోట్ల క్లబ్లో చోటు సంపాదించుకుంది. ఈ సినిమా వసూళ్లను ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. పద్మావత్ వసూళ్లతో బాలీవుడ్ చిత్ర సీమలో ఖాన్ల ఆధిపత్యం మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికి రూ.500 కోట్లు సాధించలేకపోయింది. ఇప్పటివరకూ రూ.500 కోట్ల వసూళ్లు చేసిన సినిమా హీరోలుగా ఆమీర్, సల్మాన్‌లు ముందున్నారు. వీరిని పక్కకునెట్టి పద్మావత్ ముందుకు దూసుకు వెళ్తుందనుకున్న అంచనాలు తారుమారయ్యాయి. సినిమా రిలీజై ఏడు వారాలు కావస్తున్నా రూ.300 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించగలిగింది. వివాదాస్పద సినిమాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకునే లీడ్‌రోల్ చేశారు. భారీ తారాగణంతో తెరకెక్కిన పద్మావత్ అప్పట్లో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. జనవరి 25న భారీ అంచనాలు, వివాదాల నడుమ సినిమా రిలీజైనప్పటికీ బాలీవుడ్ ఖాన్లకు పోటీగా రాలేకపోయింది. మొదటివారంలో భారీగా వసూలు చేసి ఖాన్లకు గట్టి పోటీ ఇస్తుందనుకుంటే తర్వాతి కొద్ది రోజులకు అంచనాలను తలకిందులు చేస్తూ వసూళ్లు తగ్గుకుంటూ వచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి వచ్చిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’ భారీ వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలు ఆరు ఉంటే అందులో 5 సినిమాలు ఆమీర్, సల్మాన్లవే. ఇందులో పీకే, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, దంగల్, టైగర్ జిందా హై, బాహుబలిలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ఈ సినిమాల లిస్ట్‌లో తెలుగు సినిమా బాహుబలి కూడా ఉండటం, ఈ సినిమా ఒక్క హిందీ వెర్షన్లోనే రూ. 500 కోట్లు వసూలు చేసింది. -
ఖాన్లూ.. కపూర్లూ.. విందుకు రండి!
ఈ ఆదివారం దీపాల పండగ. బట్టలు, మిఠాయిలు, టపాసులు కొనుక్కుంటూ చాలామంది బిజీ బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ పనులతో పాటు మరో పనితో బిజీగా ఉన్నారు. పండగ సందర్భంగా ఈ కుటుంబం బంధువులు, సన్నిహితులు, స్నేహితులను పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇస్తుంటుంది. ఐదేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఏడాది ఎవర్నెవర్ని ఆహ్వానించాలో లిస్టు తయారు చేసుకున్నారు. ‘బీ రెడీ’ అంటూ పిలుపులు కూడా అయిపోయాయ్. దీపావళి పండగ రాత్రి ఈ పార్టీ జరగనుంది. పార్టీలో పాల్గొనబోతున్న వారిలో కపూర్లూ, ఖాన్లూ కంపల్సరీ. ప్రతి ఏడాదీ వీళ్లు చేసే సందడికి కొదవ ఉండదట. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. విందులో వడ్డించ బోయేవన్నీ సంప్రదాయబద్ధమైన వంటకాలట. భారతీయ మిఠాయిలనే తయారు చేయిస్తున్నారు. నో.. మంచూరియాస్.. నో ఫ్రెంచ్ ఫ్రైస్. ఓన్లీ ఇండియన్ ఫుడ్. వంటకాలన్నీ రుచిగా ఉండేట్లు బచ్చన్ ఇంటి మహరాణులు జయాబచ్చన్, ఐశ్వర్యా రాయ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.