breaking news
khaidi numbar 150
-
మెగా రికార్డును బద్దలు కొడతాడా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై లవ కుశ. తారక్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లు సాదిస్తున్న జై లవ కుశ, త్వరలోనే మెగా రికార్డ్ ను బ్రేక్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కలెక్షన్ల విషయంలో బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా నాన్ బాహుబలి లిస్ట్ లో మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 టాప్ లో ఉంది. ఓవరాల్ గా 164 కోట్ల గ్రాస్ సాధించిన చిరంజీవి సినిమా మొత్తం మీద మూడో స్థానంలో నాన్ బాహుబలి లిస్ట్ లో టాప్ ఉంది. అయితే ఎన్టీఆర్ జై లవ కుశ ఇప్పటి వరకు 162 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో మంచి వసూళ్లు సాదిస్తుండటంతో బిజినెస్ ముగిసేనాటికి ఖైదీ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. కొంత మంది ఫ్యాన్స్ నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ మెగా రికార్డ్ ను బీట్ చేశాడన్న వాదన కూడా వినిపిస్తోంది. అసలు లెక్క తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
మెచ్యూరిటీ లేకనే తప్పు చేశా!
సినిమా పరిపక్వత లేక మొదట్లో పొరపాట్లు చేశానని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరీ ముద్దుగుమ్మ. తెలుగులో చిరంజీవితో నటించిన ఖైదీనంబర్ 150 చిత్రం విజయాన్ని సాధించడంతో అమ్మడు ఆనందంలో మునిగితేలుతున్నారు. అంతే కాకుండా అజిత్‌కు జంటగా వివేకం చిత్రంతో పాటు, విజయ్ సరసన ఆయన తాజా చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో రానాతో మరో చిత్రం కూడా చేస్తున్నారు. ఇలా బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ తన విజయానికి తన క్రమశిక్షణే ప్రధాన కారణం అంటున్నారు. మొదట్లో సినిమా పరిపక్వత లేక పోవడంతో కొన్ని చెత్త చిత్రాలు చేసి మార్కెట్‌ను చెడగొట్టుకున్నానని చెప్పారు. అయితే ఆ తరువాత పరిణితి చెంది మంచి కథా పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ, క్రమశిక్షణ పాటిస్తూ కథానాయకిగా మంచి పేరు సంపాదించుకున్నానని అన్నారు. ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం హోరెత్తుతోంది. స్టార్ హీరోలు, యువ హీరోలతో నటిస్తున్న కాజల్‌అగార్వల్ సీనియర్ హీరోలతో నటించడానికి సంకోచిస్తున్నారని తెలిసింది. ఇటీవల తెలుగులో చిరంజీవికి జంటగా ఖైదీనంబర్ 150 చిత్రంలో నటించడానికి భారీ పారితోషికాన్నే పుచ్చుకున్నట్లు సమాచారం. మామూలుగా కోటిన్నర పారితోషికం తీసుకునే కాజల్ చిరంజీవితో నటించిన చిత్రానికి కోటిముప్పావు అందుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఆ చిత్రం హిట్ అవడంతో కాజల్ ఆనందానికి పట్టపగ్గాల్లేకుండాపోతున్నాయట. తాజాగా మరో సీనియర్ హీరో సరసన నటించే అవకాశం రాగా చిరంజీవి చిత్రానికి అందుకున్న పారితోషికాన్నే ఇవ్వాలని డిమాండ్ చేశారట. దీంతో నోటిమాట రాక ఆ నిర్మాత మౌనంగా జారుకున్నారట. చేతిలో మూడు చిత్రాలు ఉన్న కారణంగా కొత్త అవకాశాలు పోయినా పర్వాలేదన్న ధోరణితో ఈ ముద్దుగుమ్మ అధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.