breaking news
Keshav Memorial School
-
కేశవ్ మెమోరియల్ స్కూల్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న హిమాయత్‌నగర్ జోనల్ కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లో కేశవ్ మెమోరియల్ స్కూల్ విజయం సాధించింది. సోమవారం జరిగిన కబడ్డీ టోర్నమెంట్ అండర్-17 బాలుర విభాగంలో కేశవ్ మెమోరియల్ స్కూల్ 27-1తో ప్రభుత్వ బాలుర హైస్కూల్ (అంబర్‌పేట)ను చిత్తుగా ఓడించింది. బాలికల విభాగంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్ 25-8తో బీఆర్ఆర్ హైస్కూల్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో నృపతుంగ హైస్కూల్ 19-6తో జీపీఎస్‌పై, హారో హైస్కూల్ 19-7తో నవ్య గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ పీటర్స్ హైస్కూల్ 10-7తో జీజీహెచ్ఎస్ (అంబర్‌పేట)పై గెలుపొందాయి. ఇతర మ్యాచ్‌ల వివరాలు అండర్ -17 బాలురు: జీబీహెచ్ (కాచిగూడ) 19-8తో రిషి విద్యాలయపై, హెచ్‌పీఎస్ (రామంతపూర్) 11-7తో కేశవ్ మెమోరియల్ స్కూల్(ఇంగ్లీష్ మీడియం)పై, పీపుల్స్ హైస్కూల్ 15-3తో శ్రీ సత్యసాయి స్కూల్(విద్యానగర్)పై, గాంధీ హైస్కూల్ 10-3తో సెయింట్ అగస్టీన్ హూస్కూల్పై, భరత్ స్కౌట్స్, గైడ్స్ హైస్కూల్ 9-6తో సెయింట్ ఫిలిప్స్ స్కూల్‌పై విజయం సాధించాయి. అండర్-14 బాలురు: జీబీహెచ్ ఎస్ (కాచిగూడ) 10-3తో భాష్యం హైస్కూల్‌పై, భరత్ హైస్కూల్ 21-6తో సెయింట్ పీటర్స్ ైెహ స్కూల్‌పై, శ్రీ సత్యసాయి విద్యా విహార్ 10-6తో కోర్ మోడల్ హైస్కూల్‌పై, హుడా హైస్కూల్ 14-12తో సెయింట్ అగస్టీన్ హైస్కూల్‌పై, హారో హైస్కూల్ 5-3తో ప్రభుత్వ పోలీస్ బాలుర స్కూల్‌పై, నవ్య గ్రామర్ హైస్కూల్ 18-4తో సీపీఎల్ (అంబర్‌పేట)పై విజయం సాధించాయి. అండర్-14 బాలికలు: అజంపురా హైస్కూల్ 15-5తో సీపీఎల్ అంబర్పేటపై, జీబీహెచ్‌ఎస్, కాచిగూడ 18-0తో సెయింట్ అగస్టీన్‌పై, భాష్యం హైస్కూల్ 15-5తో ఆర్పీహెచ్ఎస్పై నెగ్గాయి. -
కేశవ్ మెమోరియల్ స్కూల్లో ప్రసంగించిన మోడీ
హైదరాబాద్: నగరంలోని నారాయణగూడలో ఉన్న కేశవ్ మెమోరియల్ స్కూల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. అక్కడసర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్నిఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. నవభారత్ యువభేరీకి సభ సందర్భంగా హైదరాబాద్‌కు విచ్చేసిన మోడీ.. తరువాత కేశవ్ మెమోరియల్ స్కూల్‌ను సందర్శించారు. అంతకు ముందు ఎల్బి స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన నవభారత యువభేరీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గాంధీ, వల్లభాయి పటేల్ పుట్టిన ప్రాంతం నుంచి తాను వచ్చినట్లు తెలిపారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకురావడానికి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. సామాన్యుడికి మేలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు.