breaking news
Kesari Nath Tripathi
-
వివాదంగా మారిన యోగా డే లేఖ
కోల్‌కతా : బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రాసిన లేఖ అధికార పార్టీ, గవర్నర్ మధ్య వివాదానికి దారి తీసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను జరుపుకోవడానికి సన్నాహకాలు ముమ్మరం చేయాలని, ఈ ఏడాది యోగా డేను విజయవంతంగా జరపాలని గవర్నర్ త్రిపాఠి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లకు లేఖ రాశారు. గవర్నర్ తీరును అధికార తృణమూల్ తప్పుబట్టింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ..‘ యూనివర్సిటీలకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలను రావాలి. లేఖలు రాసే అధికారం వారికే ఉంటుంది. రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలపై గవర్నర్ జోక్యం తగదు. అలా చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడట్లే. యోగా డేను నిర్వహించాడానికి సీఎం మమత బెనర్జీ అన్ని ఏర్పాట్లు చేశారు’ అని అన్నారు. గవర్నర్ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నాని టీఎంసీ ఆరోపిస్తోంది. కాగా యోగా డే నిర్వహణపై గతంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. -
ఐదు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
* యూపీకి రామ్‌నాయక్, గుజరాత్‌కు ఓపీ కోహ్లీ * రాష్ట్రపతి భవన్ ప్రకటన న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఐదురాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌కు బీజేపీ సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి రామ్‌నాయక్(80)ను నియమించగా, ఢిల్లీకి చెందిన మరో సీనియర్ నేత ఓపీ కోహ్లీ(78)ని గుజరాత్ గవర్నర్‌గా నియమించారు. అలాగే యూపీ మాజీ స్పీకర్ కేసరీనాథ్ త్రిపాఠీ (79) పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నియుక్తులయ్యారు. మరో సీనియర్ నేత బల్రామ్దాస్ టాండన్ (87) ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. బీజేపీ ఈశాన్యరాష్ట్రాల వర్కింగ్ గ్రూప్ సభ్యుడు పద్మనాభ ఆచార్యకు నాగాలాండ్ బాధ్యతలు అప్పగించారు. త్రిపుర గవర్నర్‌గా ఉన్న పురుషోత్తమన్ రాజీనామా చేసిన నేపథ్యంలో తాత్కాలికంగా ఆ బాధ్యతలను కూడా పద్మనాభ ఆచార్యకే అప్పగించారు. ఇంతవరకు నాగాలాండ్ బాధ్యతలను కూడా పురుషోత్తమన్ చూసేవారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో అధికారంలోకి రాగానే గతంలో యూపీఏ సర్కార్ నియమించిన పలువురు గవర్నర్ల రాజీనామాకు ఒత్తిడి చేసిన బీజేపీ ప్రభుత్వం స్వంత పార్టీ నేతలకు బహుమతిగా పదవుల పందేరం చేసింది. వీరంతా పార్టీని ఏళ్లతరబడి అంటిపెట్టుకున్న కురువృద్ధులే కావడం గమనార్హం.