breaking news
Kedaranath
-
ఎయిర్ లిఫ్టింగ్.. నదిలో పడిపోయిన హెలికాప్టర్
డెహ్రాడున్: మరమ్మత్తులకు గురైన ఓ హెలికాప్టన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఎంఐ-17 హెలికాప్టర్ తరలిస్తుండగా.. ఒక్కసారిగా గాలిలోనే జారి నదిలో పడిపోయింది. ఇటీవల కేదార్నాథ్ సమీపంలోని భీంబాలి సమీపంలో ఓ హెలికాప్టర్ మరమ్మతులకు గురైంది. అయితే దానిని శనివారం ఎంఐ17 హెలికాప్టర్‌తో అధికారులు లిఫ్ట్ చేశారు. తరలిస్తుండగానే ఎంఐ17 హెలికాప్టర్ తీగ తెగి నదిలో పడిపోయింది. ఈ ఘటనుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.‘‘ఎంఐ-17 హైలికాప్టర్ మరమ్మత్తులకు గురైన చిన్న హెలికాప్టర్‌ను గౌచర్ ల్యాండింగ్ స్ట్రిప్‌కు తీసుకువెళుతోంది. గాలి పీడనం, చిన్న హెలికాప్టర్ బరువు కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. అనంతరం కిందకు జారి నదిలో పడిపోయింది’’ అని జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే పేర్కొన్నట్లు జాతీయమీడియా పేర్కొంది.VIDEO | Uttarakhand: A defective helicopter, which was being air lifted from #Kedarnath by another chopper, accidentally fell from mid-air as the towing rope snapped, earlier today.#UttarakhandNews(Source: Third Party) pic.twitter.com/yYo9nCXRIw— Press Trust of India (@PTI_News) August 31, 2024 -
శైశవ దశలో విపత్తు నిర్వహణ
వరద హెచ్చరికలు చేయగల సాధనాలు సైతం మన జాతీయ విపత్తు నిర్వహణా సంస్థకు లేవు. కేదార్నాథ్ విషాదం జరిగి రెండేళ్లయినా... ముందుగా కుంభవృష్టి, భారీ వర్షాలను సూచించగల రాడార్లను ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీ మూడు భౌగోళిక భ్రంశరేఖలపై (ఫాల్ట్ లైన్స్) ఉన్న నగరం. దాదాపు గత మూడు శతాబ్దాల కాలం లో రిక్టర్ స్కేలుపై 5కు మిం చిన తీవ్రతగల ఐదు భూకం పాల తాకిడికి గురైన చరిత్ర కూడా ఉంది. దాన్ని నాలుగవ స్థాయి భూకంప ప్రాంతంగా గుర్తించారు. ఏప్రిల్‌లో నేపాల్‌లో సంభవించిన స్థాయి భూకంపానికి ఆ నగరంలోని 80% భవనాలు నేలమట్ట మవుతాయని అంచనా. అక్కడి విపత్తు నిర్వహణ కేం ద్రాలు సైతం బీటలువారిన, చిన్న భవనాల్లోనే ఉన్నా యి. పైగా సుత్తులు, టార్చిలైట్ల వంటి కనీస ప్రాథమిక సాధనాలు సైతం దానికి లేవు. విపత్కర పరిస్థితుల్లో ఆ నగరానికి సహాయం అందించడమూ కష్టమే. ఆసుప త్రులు సైతం ఆకాశహర్మ్యాల్లోనే ఉన్నాయి. కాబట్టి సహా యక శిబిరాల్లో ప్రాథమిక వైద్య సేవలకూ కరువు తప్ప దు. దేశంలో 70% సునామీలు, తుపాన్ల నుంచి, 60% భూకంపాల నుంచి, 12% వరదల నుంచి ముప్పును ఎదుర్కొంటోంది. మన విపత్తు నిర్వహణ మాత్రం శైశవ దశలోనే ఉంది. భూకంప తాకిడికి తట్టుకునే భవ నాలను నిర్మించేలా చేయడానికి ఉన్న వాటిని దృఢతరం చేయడానికి ఉద్దేశించిన ‘ది నేషనల్ ఎర్త్‌క్వేక్ రిస్క్మిటి గేషన్ ప్రాజెక్ట్’ (2013) ఉనికి కనిపించడమే గగనం. నేపాల్ భూకంపాన్ని ముందుగా కనిపెట్టలేని దుస్థితి మన సెస్మాలజీ కేంద్రాలది. భౌగోళిక కారణాల వల్ల భూకంపాల ముప్పు ఉండ టమే కాదు... మన భౌతిక, సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలు సైతం అందుకు కారణమవుతున్నాయి. పట్టణీకరణ విస్తరించి బహుళ అంతస్తుల నిర్మాణం విప రీతంగా పెరిగింది. బీమ్స్, పిల్లర్లపై నిర్మించే ఆ భవనాల స్థిరత్వానికి భంగం కలిగేలా కార్ పార్కింగ్‌లను ఏర్పా టు చేస్తున్నారు. మన నివాసాల్లో 84% భూకంపాలను తట్టుకోలేనివే. పైగా మనకు భూకంప ఇంజనీరింగ్ కోర్సున్న విశ్వవిద్యాలయాలూ స్వల్పమే. భూకంపాల సంభావ్య తను లెక్కగట్టగలమేగానీ ముందుగా చెప్ప లేం. కాబట్టి నష్ట నివారణ కోసం భూకంపాలను తట్టు కునే నిర్మాణం, భూసాంకేతిక ఇంజనీరింగ్‌లకు ప్రాధా న్యం ఇవ్వాలి. ఎక్కువ విపత్కర, హానికర ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ, భూకంప సమయాల్లో కుంగిపోయే, కరిగిపోయే నేలల్లో భవన నిర్మాణాన్ని నివారించాలి. ఇది మానవతావాద సహాయపరమైన విపత్తులు నానా టికీ పెరుగుతున్న యుగం. ప్రణాళికాబద్ధమైన పట్టణీ కరణ మాత్రమే విపత్తులను తట్టుకోగలుగుతుంది. జపాన్ రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతగల భూకంపాలను (మే 13న వచ్చింది) సైతం తట్టుకోగలుగుతోంది. భూకంపాలను తట్టుకునే సురక్షిత ఆవాసాలకు హామీని కల్పించడంలో మన ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు విఫలమ య్యారు. అందుకు తగిన విధంగా వారిని మలచాల్సి ఉంది. ‘ది ఇండియా డిజాస్టర్ రిసోర్స్ నెట్వర్క్’ను వ్యవస్థీకరించి సంఘటిత సమాచారం, సాధన సంప త్తులను సేకరించే కేంద్రంగా అభివృద్ధి పరచాల్సి ఉంది. వరదలను ముందుగా సూచించగల సాధనాలు సైతం మన జాతీయ విపత్తు నిర్వహణా సంస్థకు (ఎన్ఎండీఏ) లేవు. కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చే అర కొర అంచనాలే దిక్కు. కేదార్నాథ్ విషాదం జరిగి రెండే ళ్లయినా... 3 నుంచి 6 గంటల ముందు కుంభవృష్టి, భారీ వర్షాలను సూచించగల డ్రాప్లర్ రాడార్లను ఉత్తరా ఖండ్‌లో ఏర్పాటు చేయలేదు. వరద ముప్పున్న ప్రాం తాల్లో నిర్మాణాలకు మార్గదర్శకాలుగానీ, సురక్షిత ప్రాంతాల మ్యాప్లుగానీ లేవు. పైగా హిమాలయ పర్వ త ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారీ డ్యామ్‌ల నిర్మా ణానికి అనుమతులిస్తున్నా ఎన్ఎండీఏ నోరు మెదపడం లేదు. దేశంలో 5,000కు పైగా డ్యామ్‌లున్నా కేవలం 200కు మాత్రమే అత్యవసర పరిస్థితి కార్యాచరణ ప్రణా ళికలున్నాయి. 4,800 రిజర్వాయర్లుండగా 30కి మా త్రమే నీటి ప్రవాహం వచ్చి చేరడంపై ముందస్తు హెచ్చ రికలు చేయగల వ్యవస్థ ఉంది. అసలు ఎన్డీఎంఏనే ఒక తలకాయ లేని సంస్థగా ఉంది. దానిలోని 11 లేదా 12 మంది సభ్యులకుగానూ ముగ్గురిని మాత్రమే నియమిం చారు. మార్గదర్శకాలను సూచించాల్సిన సంస్థ అయిన దానికి వాటిని అమలు చేసే యంత్రాంగమే లేదు. దాని మార్గదర్శకాలకు రాష్ట్రాలు కట్టుబడాల్సిన అవసరం లేకపోవడంతో ప్రాంతాలవారీ ప్రణాళికలు కొన్ని చోట్లే అమలవుతున్నాయి. పైగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కేంద్ర హోం శాఖ అధీనంలో ఉండటంతో దాని సహాయక చర్యలు తాత్కాలిక ప్రాతి పదికపైనే సాగుతున్నాయి. పైగా దానికి తగు సిబ్బంది, శిక్షణ, మౌలిక సదుపాయాలు, సాధనసంపత్తి లేవు. ప్రధాన నగరాల్లో విపత్తు నష్ట నివారణలో దాని పాత్ర కాగ్ పేర్కొన్నట్టు ‘‘నామమాత్రం’’ ప్రకృతి విపత్తులు సంక్లిష్టమైన పలు అంశాల వల్ల సంభవిస్తాయి. వాటితో వ్యవహరించాల్సిన విపత్తు నిర్వ హణ యంత్రాంగం బహుముఖమైనదిగా ఉండాలి. వర దలు, తుపానులు, సునామీలు, దుర్భిక్షాలు, భూకం పాలు వంటి విభిన్నమైన సవాళ్లను ఎదుర్కొనేది కావా లి. స్థానిక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, జీవావరణ సంబంధ అంశాలను సైతం అది పరిగణనలోకి తీసు కుని తాత్కాలిక, దీర్ఘకాలిక సహాయ పునరావాస ప్రణాళి కలను రూపొందించగలిగి ఉండాలి. ఈ సమగ్ర దృష్టితో ఎన్డీఎంఏను తిరిగి పునర్నిర్మించి, దానికి మార్గదర్శకా లను అమలు చేయించగల యంత్రాంగాన్ని సమకూ ర్చాలి. అంతవరకు విపత్తుల్లో తక్షణం స్పందించేది సైన్యం, పారా మిలిటరీ బలగాలే కాక తప్పదు. (వ్యాసకర్త బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు) - వరుణ్ గాంధీ ఈమెయిల్: fvg001@gmail.com