breaking news
katruveliyidai
-
నేను మణిరత్నంను కలిసుండకపోతే..
నేను దర్శకుడు మణిరత్నంను కలిసుండకపోతే ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు అని పేర్కొన్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ . సోమవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినిమాస్ థియేటర్లో జరిగిన కాట్రువెలియిడై చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రెహ్మాన్ పై విధంగా వ్యాఖ్యానించారు. మణిరత్నం తాజా చిత్రం కాట్రువెలియిడై. కార్తీ, అదితిరావు జంటగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతభాణీలు అందించారు. ఈ చిత్ర ఆడియోను ఆయన ఆవిష్కరించగా నటుడు సూర్య తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ తాను ఏఆర్.రెహ్మాన్ కలిసి 25 ఏళ్లుగా పని చేస్తున్నామన్నారు. ఏఆర్.రెహ్మాన్ తో కలిసి పని చేయడం ఎప్పుడూ ఒక కొత్త అనుభవమేనని పేర్కొన్నారు. కాట్రువెలియిడై భారతీయ విమానదళం నేపధ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలిపారు. తాను కార్తీను మూడు రోజుల క్రితం కలిసినప్పుడు షూటింగ్ సమీపంలో యుద్ధ విమాన అధికారులను చూసినప్పుడు లేచి నిలబడి వారికి గౌరవాన్ని ఇస్తానని అన్నారన్నారు. అలా వారి గౌరవాన్ని ఆవిష్కరించే చిత్రమే కాట్రు వెలియిడై అని పేర్కొన్నారు. ఏఆర్.రెహ్మాన్ మాట్లాడుతూ మణిరత్నం తనకు లభించిన వరప్రసాదం అన్నారు. తాను ఆయన్ను కలిసుండకపోతే ఈ స్థాయిలో ఉండేవాడినే కాదన్నారు. సూర్య మాట్లాడుతూ తాను, తన భార్య మణిరత్నంను చాలా కాలంగా అడగాలనుకుంటున్న ప్రశ్న ఆయన ఇప్పటికీ ఇంత అందమైన ప్రేమ కథా చిత్రాలను ఎలా తెరకెక్కించగలుగుతున్నారన్నారు. కార్తీ మాట్లాడుతూ తాను మణిరత్నం వద్ద మోస్ట్ అసిస్టెంట్‌గా ఉండి కథానాయకుడిని అయ్యానన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని, పనిలో ఇంత సిన్సియర్‌గా ఉంటున్నానంటే ఆయనే కారణం అన్నారు. మణిరత్నం తనను నటించమని ఈ చిత్ర స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనన్నారు. కాట్రువెలియిడై చిత్రం లో నటించడం ఒక మధురమైన అనుభవంగా కార్తీ పేర్కొన్నారు. ఈ చిత్రంతో తన కల నిజమైందని నటి అదితిరావు పేర్కొన్నారు. -
మరోసారి పోలీస్ అధికారిగా కార్తీ
సినిమాలపై టైటిల్స్ ప్రభావం చాలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు ముందు తోళా అంటూ నాగార్జునతో కలిసి పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు కార్తీ ఇటీవల కాషో్మరాగా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ను అందించారు. ఇలా విజయపథంలో పయనిస్తున్న కార్తీ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కాట్రు వెలియిడై అంటూ రొమాంటిక్ పాత్రలో తెరపైకి రావడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు తదుపరి చిత్రానికీ సన్నద్ధం అవుతున్నారు. కాషో్మరా చిత్ర నిర్మాతలకే మరో అవకాశం ఇచ్చారు. ఆ నిర్మాతలు ఈ సారి మరో పవర్ఫుల్ పాత్రలో కార్తీని చూపించడానికి రెడీ అవుతున్నారు.దీనికి అప్పుడే పేరును కూడా ఖరారు చేశారండి. ఆ పేరు వింటేనే కార్తీ పాత్ర పవర్ ఏరేంజ్‌లో ఉంటుందో అర్థమైపోతుంది. అదే ధీరన్ అధికారం ఒండ్రు. ఇంతకీ ఈ చిత్రంలో కార్తీ పోషించే పాత్ర ఏమిటనేగా మీ ఆసక్తి. పవర్ అనగానే అర్థం అయ్యే ఉంటుందే. అవునండీ కార్తీ ఈ చిత్రం ద్వారా మరోసారి కాకీ దుస్తుల్లో రఫ్ఫాడించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది సాధారణంగా విలన్ల భరతం పట్టే ఆషామాషీ కథా చిత్రం కాదని నిర్మాతల్లో ఒకరైన ఎస్ఆర్.ప్రభు అన్నారు. ఒక నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కినున్న చిత్రం ధీరన్ఆధికారం ఒండ్రు అట. ఇందులో కార్తీ పేరు ధీరన్. ఇందు కోసం కార్తీ ఇప్పటికే చాలా కిలోల బరువు తగ్గారట. ఇంతకీ ఈయనతో రొమాన్స్ చేసే నాయకి ఎవరనుకుంటున్నారూ.. టాలీవుడ్లో టాప్ రేంజ్లో వెలిగిపోతున్న రకుల్ ప్రీతిసింగ్నే. చతురంగవేట్టై చిత్రం ఫేమ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. చిత్ర షూటింగ్ కొత్త సంవత్సరం తొలి నెలలోనే ప్రారంభం కానుంది. ఇంతకు ముందు చిరుతై చిత్రంలో పోలీస్ అధికారిగా దుమ్మురేపిన కార్తీ మరో సారి కాకీ పవర్‌ను చూపించనున్నారన్న మాట.