breaking news
karampodi
-
కేజ్రీవాల్‌పై కారంపొడి దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సచివాలయంలోనే ఓ వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కారంపొడి చల్లాడు. అత్యంత భద్రత ఉండే సచివాలయంలోని సీఎం కార్యాలయం బయటే ఈ దాడి జరిగింది. నిందితుణ్ని ఢిల్లీకి చెందిన అనిల్ కుమార్ శర్మగా గుర్తించిన పోలీసులు, అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఖైనీ పొట్లాల్లో కారంపొడి నింపుకుని వచ్చిన అనిల్, మధ్యాహ్నం భోజనానికి సీఎం తన కార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ దాడి చేశాడు. కేజ్రీవాల్ కంట్లో కారం చల్లేందుకు అనిల్ ప్రయత్నించాడనీ, ఆయన కళ్లద్దాలు కిందపడి దెబ్బతిన్నాయని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. -
తెలంగాణ వంట బ్రాండ్‌గా మారాలి
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అద్భుతమైన వంటకాలు తెలంగాణ ప్రత్యేకమని, వీటికి విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. ఫిలింనగర్లో ఉన్న ‘కారంపొడి’కి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రెస్టారెంట్ పురస్కారం లభించిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉడిపి, కామత్ హోటల్స్ స్థాయిలో మన వంటకాలకు ఏ ప్రాంతంలోనైనా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సాధించేందుకుగాను ఒక క్యులినరీ పాలసీని రూపొందించామన్నారు. ‘కాకతీయ థాలి’ పేరుతో తెలంగాణ వంటకాల ఫుడ్‌ఫెస్టివల్‌ను ప్రారంభించిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ ఛైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ రుచులలో మన వంటకాలకు సాటిలేదని, వీటి కోసం ప్రత్యేకంగా రెస్టారెంట్స్ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గదన్నారు. కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు శ్యామ్, అజయ్, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.