breaking news
Kandukuri Awards
-
రంగస్థల నటులకు ‘కందుకూరి’ పురస్కారాలు
సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలో రంగస్థలంలో కొన్నేళ్లుగా మంచి ప్రతిభ కనబరుస్తూ నాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన వారిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి కందుకూరి వీరేశలింగంపేరు మీదుగా విశిష్ట పురస్కారం అందజేసింది. ఈ మేరకు ఆదివారం రాజమహేంద్రవరంలో ఎంపిక చేసిన వారికి పురస్కారం పేరుతో రూ. 10వేల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎం పీ మురళీమోహన్ తదితరుల చేతుల మీదుగా అందించారు. జిల్లాకు ఐదుగురు చొప్పున 13 జిల్లాలకు 65 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిని ఎంపీ మురళీమోహన్, డాక్టర్ పెద్ది రామారావు, ఎస్.కె. మిస్రో, పాటిబండ్ల ఆనందరావు, ఎస్.బాలచంద్రరావు, పి.ఓబుల య్య, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఎస్.వెంకటేశ్వర్లతో కూడిన ఏడుగురు సభ్యుల కమిటీ ఎంపిక చేసింది. శ్రీకాకుళం నుంచి గోకవలస కృష్ణమూర్తి, పి.సూర్యనారాయణ, ఎస్.రమణ, వాకమళ్ల సరోజిని, బస మురళీలు కందుకూరి విశిష్ట పురస్కారం అందుకున్నారు. -
కందుకూరి పురస్కారాలకు ఎంపికైంది వీరే
అమరావతి: 2017వ సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి కందుకూరి రంగ స్థల పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో ముగ్గురిని, జిల్లాకు ఐదుగురు చొప్పున ప్రభుత్వం ఎంపిక చేసింది. కర్నాటి లక్ష్మీనరసయ్య, చింతా కబీర్ దాస్, అగ్గరపులు రజనీబాయి ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది. రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష, జిల్లా స్థాయి గ్రహీతలకు రూ.10వేలతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాలను రాజమహేంద్రవరంలో ఈ నెల 30న ప్రదానం చేస్తారని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ ఎండీ ఎస్.వెంకటేశ్వర్ వివరించారు. విజేతల పూర్తి వివరాల కోసం www.apsftvtdc.in వెబ్ సైట్లో ను సందర్శించాలని చెప్పారు.