breaking news
kanchi kamakshi temple
-
కంచిలోని బంగారు, వెండి బల్లి వెనక ఉన్న విశేషం ఏంటి..?!
కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం వుండదని ఒక నమ్మకం. బల్లి శరీరం మీద పడిన వారు... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉంది. బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల విశిష్టత ఏంటో తెలుసుకుందాం... బంగారు, వెండి బల్లులకి సంబంధించిన పురాణగా«థ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. రోజూ నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది. బల్లి ఇంట తిరుగాడుతున్నప్పటీకీ... అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా... కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెబుతారు. పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి’ క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది. -
రూ.6.40లక్షల నగదుతోపాటు బైక్ అపహరణ
బైక్‌లో రూ.6.40లక్షల నగదు భీమడోలు : గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌ను అపహరించి పరారైన ఘటన గురువారం జాతీయ రహదారి భీమడోలులోని కాంచికామాక్ష్మమ్మ గుడి వద్ద జరిగింది. అపహరించిన బైక్‌లో రూ.6.40లక్షల నగదు ఉంది. ఇదంతా సినీ ఫక్కీలో జరిగింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉంగుటూరు మండలం అప్పారావుపేట చెందిన ఇనుపకుర్తి సూర్యనారాయణ చేపల చెరువుల యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి గురువారం ఆయన ఏలూరు బయలు దేరాడు. అక్కడ ఓ వ్యక్తికి ఇచ్చేందుకు రూ.6.40లక్షలను బండిలో పెట్టుకున్నాడు. అయితే అతను సాయంత్రం తీసుకుంటానని చెప్పడంతో సూర్యనారాయణ తన మోటార్ సైకిల్‌పై నారాయణపురం తిరిగి వెళ్తుండగా.. అతని వద్ద డబ్బు ఉందని గుర్తించిన ఇద్దరు వ్యక్తులు ఓ కారులో వెంబడించారు. దీనిని సూర్యనారాయణ గమనించలేదు. కారులోని ఇద్దరు వ్యక్తులు భీమడోలులోని కాంచికామాక్ష్మమ్మ గుడి వద్దకు వచ్చే సరికి ముందుగా వెళ్తున్న మోటార్‌బైక్‌ను ఆపారు. దిగిన సూర్యనారాయణతో వారు వాగ్వివాదానికి దిగారు. ఈ సమయంలో వారిలో ఒకడు చెంపపై కొట్టడంతో సూర్యనారాయణ కింద పడ్డాడు. దీంతో కారులో వచ్చిన ఇద్దరిలో ఓ వ్యక్తి మోటార్‌బైక్ తీసుకెళ్లిపోయాడు. మరో వ్యక్తి కారులో ఉడాయించాడు. కిందపడిన సూర్యనారాయణ తేరుకునేలోపే ఇదంతా జరిగిపోయింది. దీంతో లబోదిబోమంటూ సూర్యనారాయణ భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ బి.వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.