breaking news
Kamakshi apartment
-
విషం తాగి తల్లి సహా ఇద్దరు పిల్లల మృతి
-
విషం తాగి తల్లి సహా ఇద్దరు పిల్లల మృతి
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): కాకినాడలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి విషం సేవించి మరణించింది. శనివారం రాత్రి పాత గెగోలపాడు కామాక్షి అపార్టుమెంట్లో ఈ సంఘటన జరిగింది. సూర్యకుమారి అనే మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి విషం సేవించింది. సూర్యకుమారి గత కొంత కాలంగా వెంకటరమణ అనే వ్యక్తితో సహా జీవనం చేస్తోంది. దీంతో తల్లి, పిల్లల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. అనంతరం వెంకటరమణను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.