breaking news
Kalinga Lancers team
-
ఫైనల్లో కళింగ లాన్సర్స్
భువనేశ్వర్: పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వేదాంత కళింగ లాన్సర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కళింగ లాన్సర్స్ జట్టు 2–1 గోల్స్‌తో రాంచీ రాయల్స్‌పై గెలుపొందడంతో నేరుగా టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. కళింగ తరఫున అలెగ్జాండర్ హెండ్రిక్స్ (12వ, 32వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, రాంచీ రాయల్స్ జట్టులో మన్దీప్ సింగ్ 40వ నిమిషంలో గోల్ చేశాడు. రాంచీకి ఫైనల్ చేరే అర్హత రెండో క్వాలిఫయర్ రూపంలో ఇంకా సజీవంగానే ఉంది. ఆదివారం ఫైనల్ బెర్త్ లక్ష్యంగా రాంచీతో హైదరాబాద్ తుఫాన్స్ తలపడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో కళింగ లాన్సర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు గత ఏడాది రన్నరప్ హైదరాబాద్ తుఫాన్స్ జట్టు రెండో క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో హైదరాబాద్ జట్టు 2–0తో హెచ్ఐఎల్ జీసీ జట్టుపై విజయం సాధించింది. తుఫాన్స్ స్ట్రయికర్ శిలానంద్ లాక్రా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అతను 16వ, 39వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. హైదరాబాద్ గోల్‌కీపర్ జీన్ పాల్ డానెబర్గ్ ప్రత్యర్థి గోల్స్ చేయకుండా అడ్డుగోడ కట్టేశాడు. -
ముంబైకి కళింగ లాన్సర్స్ షాక్
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వరుస విజయాలతో జోరు మీదున్న దబంగ్ ముంబై జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ జట్టు 4–3 గోల్స్ తేడాతో ముంబై జట్టును బోల్తా కొట్టించింది. కళింగ లాన్సర్స్ తరఫున ఫ్యుర్స్టె మోరిట్జ్ రెండు పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ (32వ 33వ ని.లో) చేయగా... బాకెర్ బిల్లీ (40వ ని.లో) ఫీల్డ్ గోల్ సాధించాడు. హెచ్ఐఎల్లో ఒక ఫీల్డ్ గోల్, పెనాల్టీ స్ట్రోక్ రెండు గోల్స్‌తో సమానం. అంతకుముందు ముంబై తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ 27వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు. దాంతో ముంబై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 43వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చడంతో ముంబై ఖాతాలో మరో గోల్ చేరింది. ఆ తర్వాత ముంబై మరో గోల్ చేసేందుకు ప్రయత్నించినా లాన్సర్స్ అడ్డుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్‌తో రాంచీ రేస్ తలపడుతుంది.


