breaking news
kalayana durgam
-
కుమార్తె సీమంతం.. గంటల్లోపే మృత్యు ఒడికి తండ్రి
కళ్యాణదుర్గం: కుమార్తె సీమంతం ఘనంగా జరిపిన 24 గంటల్లోపే ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన గంగవరం గంగన్న (52) ఒక్కగానొక్క కుమార్తె జయంతి సీమంతం వేడుకను బుధవారం బంధువుల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక గంగన్న ఛాతినొప్పితో విలవిల్లాడుతుంటే కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న అతను ఛాతి నొప్పి రావడంతో మృతి చెందినట్లు అల్లుడు ప్రవీణ్ తెలిపారు. కాగా, గంగన్న గతంలో ఆర్డీటీ ఉపాధ్యాయుడిగా, ఆయన భార్య హంపమ్మ గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారు. (చదవండి: విజయవాడలో దారుణం.. స్నేహితు పనేనా..?) -
వేదనవతి!
కళ్యాణదుర్గం : ఇసుక మాఫియూ అవతారమెత్తిన టీడీపీ నాయకులు కోట్లు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అధికారమే పెట్టుబడిగా భావించారు. బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి గ్రామ సమీపంలోని వేదవతి నదిలో గల ఇసుక పై వీరి కన్ను పడింది. నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి తనయుడి పాత్ర ఇందులో కీలకమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వందలాది లారీల ఇసుక బెంగళూరుకు తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని ఇసుక వ్యాపారులతో ఒక లారీ ఇసుక రూ.30 నుంచి 50 వేలతో తరలించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇసుక లారీలు కర్ణాటక ప్రాంతంలోకి వెళ్లేదాక వీరే బాధ్యత తీసుకున్నట్లు సమాచారం. 20 టన్నుల సామర్థ్యం గల ఒక లారీ ఇసుకను 15 కిలోమీటర్ల దూరంలో గల కర్ణాటకకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంటే రూ.30 వేలు ఆదాయం వస్తుంది. రోజుకు కనీసం పది లారీలు తరలిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇసుక దందా ఏ రీతిలో సాగుతోందో ఇట్టే తెలుస్తోంది. వేదవతి పైనే కన్ను నాణ్యమైన ఇసుక అంటే బెంగళూరులో అత్యంత ధర లభిస్తుంది. వేదవతి నదిలో ఇసుక నిల్వ భారీ పరిమాణంలో ఉన్నట్లు గమనించిన టీడీపీ ఇసుకాసురులు దానిపై కన్నేశారు. నది పక్కనే ఓ టీడీపీ నాయకుడి తోట ఉండటం వీరి అక్రమ రవాణాకు కలిసి వచ్చింది. నది నుంచి ట్రాక్టర్లతో టీడీపీ నాయకుని తోటలోకి ఇసుకను డంప్ చేసి అక్కడి నుంచి కర్ణాటక నుంచి వచ్చిన లారీల్లో నింపుతారు. ఆంధ్ర సరిహద్దులు దాటేవారకు టీడీపీ నాయకుడి మనుషులు వెంట వెళ్తారు. పట్టుబడ్డ ఇసుక లారీలు మాయం ? మంగళవారం తెల్లవారు జామున బ్రహ్మసముద్రం పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. అరుుతే కాసేపటికే అవి అక్కడి నుంచి మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. లారీల మాయం వెనుక ముఖ్య ప్రజాప్రతినిధి తనయుడి ఒత్తిడి పని చేసిందనే విమర్శలున్నాయి. కేఏ52-9923, కేఏ41-బీ-729, కేఏ-41-ఏ6699, కేఏ52-8538 నెంబర్లు గల ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నప్పుడు స్థానికులు గమనించారు. అరుుతే కేవలం నాలుగు ట్రాక్టర్లు, వంద ట్రాక్టర్ల నిల్వ ఉన్న ఇసుకను మాత్రమే పోలీసులు సీజ్ చేశారు. ఇసుక లారీలు వెళ్ళే మార్గాలివి... బుడిమేపల్లి సమీపంలోని వేదవతి నది నుంచి ఇసుకను నింపుకున్న కర్ణాటక లారీలు రెండు మార్గాల గుండా ఆంధ్ర సరిహద్దులను దాటి వెళ్తున్నారుు. నది నుంచి చెలిమేపల్లి కెనాల్ మీదుగా పోలేపల్లి, కపటలింగనపల్లి, పొబ్బర్లపల్లి నుంచి కర్ణాటకలోని నల్లరాళ్ళతిమ్మాపురం(కరెకల్లు తిమ్మాపురం) చేరుకుంటాయి. నది నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ఆ ప్రాంతానికి 20 నిమిషాలలో వెళ్లిపోతున్నారుు. నది నుంచి పోలేపల్లి, బైరవానితిప్ప మీదుగా కర్ణాటకలోని బసాపురానికి (10కిటోమీర్లు, 15 నిమిషాల ప్రయాణం) మరో మార్గం మీదుగా వెళ్తున్నారుు. వేదవతి నదిలో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తుండటంతో సమీప పొలాల్లోని వ్యవసాయ బోరు బావుల్లో నీరు కరువవుతోంది. ఇప్పటికే ఆప్రాం తంలో 15 వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటి పోయింది. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమణ రవాణాపై ఆ ప్రాంత రైతులెవరైనా నిలదీస్తే టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోయారు. బోర్లు ఎండిపోతున్నారుు : రైతు బోయరామాంజినేయులు, బుడిమేపల్లి తోటలో వేసుకున్న బోర్లు ఎండిపోతాయని భయపడుతున్నాం. ఇప్పటికే మూడు బోర్లు ఎండిపోయాయి. ఉన్న బోర్లలో ఒక ఇంచుకూడా నీరు రావడం లేదు. ఇలాగే ఇసుక తరలిస్తే మరింత నష్టం జరగడం ఖాయం. బోర్లలో నీరు తగ్గితే ఎలా బతకాలి : రైతు గొల్ల రామాంజినేయులు, బుడిమేపల్లి బోర్ల ఆధారంగానే పంటలు పండించుకుంటున్నాం. నదిలో ఇసుకను ఇలాగే తరలిస్తే బోర్లలో నీరు తగ్గిపోతుంది. అదే జరిగితే ఎలా బతకాలో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. అధికారులు కూడా పట్టించుకోలేదు : రైతు తిప్పేస్వామి, బుడిమేపల్లి నదిలోంచి ఇష్టానుసారం ఇసుక తోలుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై ఏమైనా మాట్లాడితే ఇబ్బందులొస్తాయని రైతులందరూ భయపడుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని ఇసుక తవ్వకాలను బంద్ చేరుుంచాలి. -
దళారుల రాజ్యం
కళ్యాణదుర్గం/అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వేరుశనగ కొనుగోలు కేంద్రంలో దళారులను నియంత్రించాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం మార్కెట్ యార్డు ప్రధాన గేటు ఎదుట బైఠాయించి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ఈ నెల 23వ తేదీన రైతులు వేరుశనగ బస్తాలు తీసుకు వస్తే ఇప్పటి వరకు తూకం వేయలేదని ఆరోపించారు. దళారులు మాత్రం అమ్ముకుంటున్నారన్నారు. కేంద్రాన్ని ఈ నెల 31న మూసివేస్తున్నారని, రెండు రోజుల్లో వేరుశనగ కాయలను ఎలా అమ్ముకోవాలో అర్థం కావడం లేదని రైతులు మండిపడ్డారు. మార్కెట్ యార్డులో పని చేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సిబ్బంది, దళారులు కుమ్మక్కు అయ్యారని, ఇలా అయితే రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని నిలదీశారు. ఇది ఇలాగే కొనసాగితే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. రోజూ ఎంత మంది రైతులు వేరుశనగ కాయలను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారో.. ఎన్ని క్వింటాళ్లు తూకం వేశారో ఏరోజుకారోజు మైక్ ద్వారా వివరించాలని కోరారు. దీనికి అధికారులు అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించారు. ధర్నాలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మార్కెట్ రామన్న, కాంగ్రెస్ నాయకులు బాలనరేంద్రబాబు, డీఎన్ మూర్తి, రాధాస్వామి, మల్లికార్జునబాబు పాల్గొన్నారు. కాటాలు, కౌంటర్ల సంఖ్య పెంచాలి వేరుశనగ కాయలను అమ్ముకోవడానికి పెద్ద ఎత్తున రైతులు వస్తుంటే అందుకు అనుగుణంగా కాటాలు, కౌంటర్లు పెంచకుండా వారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. బుధవారం అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని వేరుశనగ కొనుగోలు కేంద్రం వద్ద సీపీఐ నేతలు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అనంతరం రైతుల అవస్థలపై ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఏకాంబరరాజును నిలదీశారు. రైతులు నాలుగైదు రోజులుగా రేయింబవళ్లు అవస్థలు పడుతుంటే టోకెన్లు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మంచిదికాదని మండిపడ్డారు. వేరుశనగ కొనుగోలు కేంద్రాలను మార్చి 31వ తేదీ వరకు కొనసాగించాలని డిమాండ్ చేశారు.