breaking news
Kalamata Venkatraman
-
అభివృద్ధి కోసమే టీడీపీని ఆశ్రయించా
పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తాడేపల్లి రూరల్: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం సీఎం నివాసం వద్ద చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణ ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే మోహనరావు మాట్లాడుతూ పాతపట్నం వెనుకబడిన నియోజకవర్గమని, ఐదు మండలాల్లో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాలంటే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టును పూర్తి చేస్తే తమ ప్రాంతంలో మరో ఉండవల్లిలో లాగా పచ్చటి పొలాలను చూడవచ్చని చెప్పారు. తాము అమ్ముడు పోయామన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. -
రండి.. ఇసుక మేటలు చూపిస్తా
ఎల్.ఎన్.పేట: జిల్లాల్లో వంశధార, నాగావళి నదుల వరద వల్ల ఏటా పంట భూముల్లో ఇసుక మేటలు వేస్తున్నాయని, దీని వల్ల రైతులకు తీరని నష్టం జరుగుతోందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. బాధిత రైతులను ఆదుకోవడంతో పాటు పొలాల్లో మేటలు వేసిన ఇసుకను రైతులే అమ్ముకునే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. వంశధార, నాగావళి నదులకు వచ్చిన వరదలు వల్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయని వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అని ఎమ్మెల్యే కలమట వ్యవసాయాశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. మంత్రి పత్తిపాటి స్పందిస్తూ పొలాల్లో ఇసుకమేటలే లేవంటూ సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానంపై ఎమ్మెల్యే కలమట మాట్లాడుతూ జిల్లాలోని పొలాల్లో ఇసుక మేటలు ఉన్నాయని, మీరు ఒక కమిటీ వేసి ఆ కమిటీని నాతో పంపిస్తే పొలాల్లోని ఇసుక మేటలను చూపిస్తానని, లేకుంటే సభలో క్షమాపణలు చెబుతానని సవాల్ చేశారు. అధికారులు ప్రభుత్వాన్ని, మంత్రులను తప్పుదారి పట్టించి తప్పుడు నివేదికలు ఇస్తున్నారనడానికి ఇదో నిదర్శనమన్నారు. ఇసుక మేటలు చూపిస్తే బాధిత అధికారులపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో వరదలు కారణంగా నాగావళి, వంశధార నదుల తీరలో ఉన్న 825 హెక్టారుల్లో ఇసుక మేటలు వేశాయన్నారు. పొలాల్లోని ఇసుకను తొలగించేందుకు హెక్టారుకు రూ.8,600 ఇవ్వాలని జీవో విడుదల చేశామన్నారు. పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను అమ్ముకుంటామని రైతులు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఇస్తామని చెప్పారు.